తనపై మీడియాలో జరుగుతున్న ప్రచారం గురించి, కేసుల గురించి రామ్‌గోపాల్‌ వర్మ ఒక వీడియోను విడుదల చేశారు.


ప్రముఖ సినిమా దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఆంధ్రప్రదేశ్‌ పోలీసులకు బదులిచ్చారు. విచారణకు హాజరు కాకపోవడం, పరారీలో ఉన్నారని, రామ్‌గోపాల్‌ వర్మను అరెస్టు చేయడం కోసం కోసం గాలింపులు చేపట్టారని మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రామ్‌గోపాల్‌ వర్మ ఓ వీడియోను విడుదల చేశారు. తాను ఎక్కడకు పారి పోలేదని, భయంతో వణికి పోలేదని, మంచం చాటున దాక్కోలేదని ఆ వీడియోలో వివరించారు.

అసలు ఆ వీడియోలో ఆర్జీవీ ఏమన్నారంటే..
ఎక్‌స్ట్రీమ్‌ల్లీ సారీ ఫర్‌ డిస్సప్పాయింట్‌మెంట్‌. నేనేదో వణికిపోతున్నాను. మంచం కింద కూర్చుని ఏడుస్తున్నానని అందరు అనుకుంటున్నారని మీడియా స్పెక్యులేట్‌ చేస్తోంది. వారందరికీ చిన్న డిస్సప్పాయింట్‌మెంట్‌ ఉండొచ్చు. కాదనడం లేదు. నేను ఆల్మోస్ట్‌ ఒక ఏడాది క్రితం ఏదో ట్వీట్స్‌ పెట్టానని నా మీద ఉన్న అలిగేషన్‌. ఆ ట్వీట్స్‌ ఎవరో మనోభావాలు దెబ్బతినాయని అనేది కేసు. ఇక్కడ విచిత్రం ఏంటంటే.. ఏడాది క్రితం పెట్టిన ట్వీట్స్‌ నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో, నాలుగు డిఫరెంట్‌ జూరిస్‌డిక్షన్స్‌లో నలుగురికి మూడు, నాలుగు రోజుల వ్యవధిలో వాళ్ల మనోభావాలు దెబ్బతినాయి. ఆ పరంగా నాపై కంప్లెయింట్‌ ఇవ్వడం, కేసులు పెట్టడం జరిగింది. ఇక్కడ గమనించాల్సింది.. ఎవరి మీద అయితే ట్వీట్‌లు పెట్టానని వారు చెబుతున్నారో, వారికి కాకుండా, ఎవరో థర్ట్‌ పార్టీకి, సంబంధం లేని వారికి మనోభావాలు దెబ్బతిన్నాయని కేసులు పెట్టారు. ఆ కాంటెస్టులో నాపై పెట్టిన కేసులు ఎలా వర్తిస్తాయనేది ప్రశ్న. అప్పుడు ఆబ్వియస్‌గా నాకు కానీ నా మనుషులకు కానీ వచ్చే అనుమానం ఏంటంటే.. ఇది ప్రొసెక్యూషన్‌ చేయడానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న చట్టాలను వాడుతున్నారా? లేక ప్రపంచ వ్యాప్తంగా ఒక ఫినామినా ఏమి జరుగుతోందంటే.. పొలిటికల్‌ పార్టీల వాళ్లు వెపనైజింగ్‌ ద సిస్టమ్స్‌ ఆఫ్‌ ద పోలీస్‌. ఇది అమెరికాలో జరుగుతోంది. యూరప్‌లో జరుగుతోంది. ఇక్కడ కూడా జరుగుతోంది.
నేను ఏ ఒక్క వ్యక్తిని, పోలిటికల్‌ లీడర్‌ను కానీ, పోలీసు అధికారిని కానీ నేను బ్లేమ్‌ చేయడం లేదు. చివరికి న్యాయం ఉంది. చట్టాలున్నాయి. ఇక్కడ జరిగిందేంటి? నాకు ఒక పోలీసు నోటీసు వచ్చింది. దానికి నేనొక రిప్లై ఇచ్చాను. ఫలానా చోట ఫలానా తారీఖున వస్తానని. అప్పటికే నాకు జరుగుతున్న పని ఆన్‌గోయింగ్‌ సినిమా షెడ్యూల్‌ ఉంది కాబట్టి అది అవ్వలేదు. సినిమా షెడ్యూల్‌ ఆగిపోతే సంబంధిత ప్రొడ్యూసర్‌కు నష్టం వస్తుంది కాబట్టి నేను మళ్లీ టైమ్‌ అడిగాను విచారణకు హాజరు కావడానికి. అసులు ఏంటీ కేసు అంటే.. అర్జెంట్‌ కేసు కాదు. ఏడాది తర్వాత ట్వీట్‌ చూసిన వాళ్లకు వారంలో అన్నీ అయిపోవాలనే దానిలో ఏమన్నా అర్థం ఉందా? మర్డర్లు వంటి కేసులకు సంబంధించి సంవత్సరాలు, సంవత్సరాలు తీసుకొని, ఏడాది తర్వాత ట్వీట్‌ చూసిన కేసులో అర్జెంట్‌గా విచారణకు రావాలనడంలో ఏమన్నా అర్థం ఉందా? అని మాట్లాడుతూ ఒక వీడియో విడుదల చేశారు. ఇది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్‌గా మారింది.
వ్యూహం సినిమా ప్రమోషన్‌ సమయంలో చంద్రబాబు, లోకేష్, బ్రాహ్మణి, పవన్‌ కళ్యాణ్‌లతో పాటు వారి కుటుంబ సభ్యులను కించపరుస్తు అభ్యంతరకర పోస్టులు సోషల్‌ మీడియాలో పెట్టారని ఆర్జీవీపై కేసులు నమోదు చేశారు. విచారణకు హాజరు కావాలని నోటీసులు ఆదేశించారు. విచారణకు ఆర్జీవీ హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆర్జీవీని అరెస్టు చేసేందుకు గాలింపులు చేపట్టారు.
Next Story