ఆంధ్ర ప్రజలకు అలెర్ట్.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు!
x

ఆంధ్ర ప్రజలకు అలెర్ట్.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు!

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలోనే అంతర్గత తమిళనాడు, ఇతర ప్రాంతాల్లో ఆవర్తనం కొనసాగుతోందని..


ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలోనే అంతర్గత తమిళనాడు, ఇతర ప్రాంతాల్లో ఆవర్తనం కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. మధ్య మహారాష్ట్ర నుంచి దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి విస్తరించి ఉందని ఆయన చెప్పారు. ఇది బుధవారం నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉందని, అది ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం నాటికి వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని చెప్పారు.

ఈ అల్పపీడనం ప్రభావంతో రేపు అల్లూరి సీతారామరాజు, కోనసీమ, పార్వతీపురం మన్యం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, అనంతపురం, ఏలూరు, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని ఆయన వివరించారు. అదే విధంగా రాష్ట్రంలో మరోవైపు శ్రీకాకుళంలో ఆరు మండలాలు, విజయనగరంలో 8 మండలాలు, మన్యం జిల్లాలో 9 మండలాలు, అల్లూరి జిల్లాలో ఒక మండలంలో వడగాలులు వీసే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు.

ఇందులో భాగంగానే ఆదివారం కురిసిన వర్షానికి సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు పల్నాడు జిల్లా పెద్దకూరపాడులో 55మీమీ, ఎన్‌టీఆర్ జిల్లాలో 40 మీమీ, జగ్గయ్యపేట 39.5మీమీ, అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగలలో 38 మీమీ, చింతపల్లిలో 36 మీమీ, అదే విధంగా దాదాపు 47 ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిశాయని ఆయన తెలిపారు.

Read More
Next Story