సీఎం చంద్రబాబు నాయుడు బద్వేలు బాధిత కుటుంబంతో ఫోన్‌లో మాట్లాడారు. రూ. 10లక్షల ఆర్థిక సాయం ప్రభుత్వం ప్రకటించింది.


వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బద్వేలు పర్యటన సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. బద్వేలులో పెట్రోల్‌ దాడి కేసులో మరణించిన బాధితురాలి కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం ప్రకటించింది. కడప జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్‌ అధితి సింగ్, టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి బుధవారం ఉదయం ఆ చెక్కును బాధిత కుటుంబానికి అందజేశారు. అంతేకాకుండా బాధిత కుటుంబ సభ్యులతో సీఎం చంద్రబాబు నాయుడు ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు.

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం కడప జిల్లా పర్యటన చేయనున్నారు. ఈ పర్యటనలో భాగంగా బద్వేలు వెళ్లనున్నారు. పెట్రోలు దాడిలో మృతి చెందిన బాధిత కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు బాధిత కుటుంబంతో ఫోన్‌లో మాట్లాడి పరామర్శించడం, బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.


Next Story