తిరుమల క్యూలో బంగారుబాబుల సందడి
x
తిరుమల శ్రీవారి ఆలయం

తిరుమల క్యూలో బంగారుబాబుల సందడి

తిరుమల శ్రీవారి ఆలయంలో ముగ్గురు ప్రత్యేకంగా కనిపించారు. ఆలయం వెలుపల కూడా వారు ప్రత్యేక ఆకర్షణ అయ్యారు. ఇంతకీ ఆ గోల్డ్ మెన్లు ఏమి చేశారు.


శ్రావణమాసం మూడో శుక్రవారం తిరుమల ఆలయం, క్యూలో ప్రత్యేక వాతావరణం కనిపించింది. ఇద్దరు గోల్డుమెన్లు, ఓ గోల్డ్ విమెన్ ఒంటినిండా బంగారు ఆభరణాలతో సందడి చేశారు. శ్రీవారి దర్శనార్ధం భక్తలు రావడం సర్వసాధారణం. ముగ్గరు వ్యక్తులు ధరించిన ఆభరణాలు యాత్రికులను ఆకట్టుకున్నాయి.


తిరుమల శ్రీవారిని నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. సామాన్య భక్తులే కాదు. దేశ, విదేశాల్లోని రాజకీయ ప్రముఖులు, క్రీడాకారులు సినీరంగ ప్రముఖులకు కొదవ ఉండదు. శుక్రవారం ముగ్గురు వ్యక్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సాధారణంగా మహిళలు ధరించడం చూస్తుంటాం. ఆమెతో పాతు ఇద్దరు పురుషులు కూడా మెడనిండా ధరించిన దాదాపు 25 కిలలో ఆభరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తిరుమల శ్రీవారి దర్శనానికి క్యూలో ఉన్న ఆలయంలోని యాత్రికుల దృష్టిని తమవైపు మరల్చుకున్నారు.


తిరుమల ఆలయంలో స్వామి దర్శనానికి వచ్చిన ఇద్దరు పురుషులు, ఓ మహిళ ఆలయ సంప్రదాయ దుస్తులతో వచ్చారు. వారి మెడ, చేతులకు ఏకంగా ఒంటినిండా బంగారు ఆభరణాలు ధరించి రావడం ద్వారా ప్రత్యేకంగా నిలిచారు. పుణెకు చెందిన చెందిన ఇద్దరు గోల్డ్ మెన్లు, ఒక గోల్డ్ విమెన్ శుక్రవారం ఉదయం శ్రీవారి దర్శనార్థం వచ్చారు. వీఐపీ విరామ సమయంలో వారు ఆలయంలోకి ప్రవేశించారు. వారిలో గోల్డ్ మెన్లు సన్నీ నన వాగ్చోరీ, సంజయ్ దత్తాత్రేయ గుజర్, ప్రీతిసోని మెడ నిండా మోయలేనంటతి ఆభరణాలు ధరించారు. చేతి ఉంగరాలు కూడా అదే స్ధాయిలో ఉన్నాయి. వారు ముగ్గరు చేతి వేళ్లకకు సరిపడినన్ని ఉంగరాలు ధరించారు. చేతులకు కంకణాలు, మెడలో భారీ హారాలు ధరించి స్వామివారి దర్శనానికి వచ్చారు. వారి ధరించిన ఆభరణాలు ఎన్ని కిలోలు ఉంటాయో వారికైనా తెలుసో లేదో?


శ్రీవారి ఆలయంలోనే వీఐపీ విరామ సమయం కావడంతో దాదాపు ప్రముఖులు, వారి సిఫారసు లేఖలపై వచ్చిన వారే ఉంటారు. అదే సమయంలో ఆలయంలోకి వచ్చిన ఆ ముగ్గురిని భక్తులు విచిత్రంగా చూస్తూ ముందుకు సాగారు. దర్శనానంతరం ఆలయం వెలుపలికి వచ్చిన ఆ ముగ్గురు గోల్డ్ మెన్లు, గోల్డ్ విమెన్ అందరికీ ముకకుళిత హస్తాలతో నమస్కరిస్తూ, ముందుకు సాగారు. ఆలయ సమీప ప్రాంతాల్లో ఉన్న వారు కూడా ఆ ముగ్గురి కదలికలలు ఆసక్తిగా చూస్తు కనిపించారు. మొత్తానికి శుక్రవారం ఉదయం తిరుమల ఆలయం వద్ద ప్రత్యేక సందడి కనిపించింది.

Read More
Next Story