పింఛన్‌ల పంపిణీలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అలా చేస్తే షాక్‌ ట్రీట్‌మెంట్‌ ఇస్తానని, 95 ముఖ్యంత్రి సీబీఎన్‌ గుర్తుంచుకోవాలని చంద్రబాబు నవ్వుతూనే వార్నింగ్‌ ఇచ్చారు సీఎం.


ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ల పంపిణీ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేష్‌లు ఒకే వేదిక మీద ఆసీనులు కావడం, అక్కడ నుంచే జాయింట్‌గా అధికారులకు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి, వైఎస్‌ఆర్‌సీపీ నేతలకు వార్నింగ్‌లిచ్చారు. దీంతో పాటుగా వారిద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. మంగళగిరి అసెంబ్లీ నియోజక వర్గం పెనుమాకలో సోమవారం పింఛన్‌ల పంపిణీ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, కొండపల్లి శ్రీనివాస్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య ఆసక్తికర డిస్కషన్‌ జరిగింది. ఒకే వేదికపై తండ్రి, కొడుకులు ప్రభుత్వ పెద్దల హోదాలో ఆసీనులు కావడం, కుమారుడు లోకేష్‌ తండ్రి సీఎం చంద్రబాబును సార్‌ అని సంభోదించి మాట్లాడటం సభకు హాజరైన అదికారులకు, ప్రజలకు, స్థానికులకు ఇంట్రస్టింగ్‌గా అనిపించింది. లోకేష్‌ కొన్ని అంశాలపై చంద్రబాబును అడుగుతుంటే వాటికి అందరిని ఆశ్చర్యానికి గురి చేసే విధంగా సమాధానాలు చెప్పడం ఆసక్తికరంగా మారింది.

పింఛన్ల పింపిణీ సందర్భంగా సీఎం స్పీచ్‌ అనంతరం లోకేష్‌ మాట్లాడుతూ.. సార్‌ మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలలో తొలి అడుగు వేశారు. మంగళిగిరి అసెంబ్లీ నియోజక వర్గం పెనుమాకలో ఇది జరగడం సంతోషంగా ఉంది. గత ఐదు సంవంత్సరాలుగా పరదాల ముఖ్యమంత్రిని చూశాం. ఇప్పుడు ప్రజల ముఖ్యమంత్రిని మనం చూస్తున్నామాన్నారు.
కొద్ది సేపు తన స్పీచ్‌ను ఆపి.. అధికారులు ఇంకా టైమ్‌ పడుతుందనుకుంటా ఇంకా సెట్‌ అయ్యేదానికి అని సీఎం చంద్రబాబును లోకేష్‌ అడిగారు. దీనికి లేదు సెట్‌ అయ్యారని చంద్రబాబు బదులిచ్చారు. లేదు అధికారులు ఇంకా పరదాలు కడుతున్నారు సార్, వాళ్లని బ్రతిమిలాడి అన్ని తీపించుకోవాల్సి వస్తోంది సార్‌ అని లోకేష్‌ అన్నారు. దీనికి చంద్రబాబు బదులిస్తూ.. అధికారులు ఇంకా పరదాలు కడితే.. కట్టిన వాళ్లను సస్పెండ్‌ చేయడం తప్పా వేరే మార్గం లేదు. కాబట్టి నేనింకా వినదలుచుకోలేదు. కాబట్టి ఎవ్వరైనా అధికారులు సింపుల్‌గా పాత రోజులు మరిచిపోయి.. కొత్త రోజులను జ్ఞాపకం చేసుకొని ముందుకు పోవలసిందిగా అందరిని కోరుతున్నా అని సమాధానం చెప్పారు. పరదాలు కట్టడం ఇక నుంచి ఎక్కడా జరక్కూడదు. ఎవరైన కంప్లైంట్‌ చేస్తే మాత్రం అధికారులకు పనిష్‌మెంట్‌ తప్పదని, బీ క్లియర్‌ అని నవ్వుతూనే హెచ్చరించారు.
దీనిని లోకేష్‌ కొనసాగిస్తూ గత ఐదేళ్లు పరదాలు కట్టడానికి అధికారులు అలవాటు పడ్డారని, పద్దతి మార్చుకునేందుకు ఇంకా టైమ్‌ పడుతుంది అనుకుంటా సార్‌ అని అనగానే.. మీకు కూడా అందరికి అలవాటు కావాలి, వాళ్లకే కాదు అని లోకేష్‌తో పాటు ఇతర మంత్రులకు, ప్రజా ప్రతినిధులకు సూచించారు. దీనికి లోకేష్‌తో పాటు అందరూ నవ్వులు చిందించారు. చంద్రబాబు ఈ టాక్‌ను ఇంకా కొనసాగిస్తూ.. కొత్త శకానికి, కొత్త కల్చర్‌కి అందరు అలవాటు కావలసిందే. ఇక టైమ్‌ ఉండదు. రివర్స్‌ గేర్‌ వేసి రివర్స్‌లో పోయే బండిని పాజిటివ్‌లో నడిపిస్తున్నాం.. ఇంక స్పీడ్‌ పెంచడం తప్ప వెనక్కి పోయే సమస్య ఎవరికి ఉండకూడదు. అలాంటి ఆలోచనలు కూడా రాకూడదు. లేక పోతే ఒక షాక్‌ ట్రీట్‌మెంట్‌ ఇస్తే అందరు సెట్‌ అయిపోతారు. ఇంక్లూడింగ్‌ .. ఎవరైనా సరే.. నేను సిద్ధంగా ఉన్నా షాక్‌ ట్రీట్‌మెంట్‌ ఇవ్వడానికి. పాపం కొంచెం ఇది ఉంది కాబట్టి స్లోగా పోతున్నా.. ఇప్పుడు స్పీడ్‌ పెంచాలి ఇక అంతే. నేను అందుకే చెప్పా 1995 ముఖ్యమంత్రిని చూస్తారని.. 4.ఓ 1995 అని అనగానే చప్పట్లతో ప్రజలు హోరెత్తించారు. ఇంకా కొనసాగిస్తూ అది గుర్తు పెట్టుకోవాలి.. 1995లో ఒక సారి మీరు చరిత్రను గుర్తు పెట్టుకోవాలి.. లోకేష్‌ను చూపిస్తూ అప్పుడు నువ్వు కుర్రాడివి.. నీకు కూడా ఐడియా లేదు.. అప్పుడు నా చరిత్ర గుర్తు పెట్టుకుంటే.. హైదరాబాద్‌లో బయలు దేరుతున్నానంటే రాష్ట్రం మొత్తం రెడ్‌ అలెర్ట్‌ ఉండేది.. ఇప్పుడు అంత భయంకరంగా చేయను కానీ.. తప్పు చేస్తే మాత్రం ఎవ్వరినీ వదిలి పెట్టను. అందుకే మైండ్‌ అంతా మార్చుకోవాలి. అందుకే 1995 అన్నాను నేను.. 95 సీబీఎన్‌.. 1.ఓ.. నాట్‌ 4.ఓ అని నొక్కి చెప్పారు. అది రిపిటిషన్‌ వస్తుందిక్కడ. మంత్రులకు ఉంటుంది.. ఎమ్మెల్యేలకు ఉంటుంది.. అందరికి ఉంటుంది అని చంద్రబాబు అనడంతో లోకేష్‌తో పాటు అందరిలో నవ్వులు వికసించాయి. నవ్వుతూనే అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్షాలకు వార్నింగ్‌ ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు.
Next Story