కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులపై కేసులు నమోదు చేయడం పెరిగి పోయింది.
తప్పుడు కేసులో ఇరికించారు..ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలని ఓ అధికారి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు విధించే ఏ షరతుకైనా కట్టుబడి ఉంటానని..ఈ కేసులో అరెస్టు కాకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. గురువారం ఈ కేసుపై హైకోర్టులో విచారణ జరగనుంది.
గత జగన్ ప్రభుత్వ హయాంలో పత్రికలకు ప్రకటనలు ఇవ్వడంలోను, వాటికి సంబంధించిన బిల్లుల చెల్లింపుల్లోను అవకతవకలు జరిగాయని, సాక్షి పత్రిక, సాక్షి టీవీ చానల్‌కు కోట్ల రూపాయల్లో భారీగా లబ్ధి చేకూర్చే విధంగా నాటి ఆంధ్రప్రదేశ్ సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్, ఎక్స్ అఫిషియో కార్యదర్శి తుమ్మా విజయ్‌కుమార్‌రెడ్డి వ్యవహరించారని, ఏపీ మీడియా ఫెడరేష(ఏపీఎంఎఫ్) ప్రధాన కార్యదర్శి ఆర్ దిల్లీబాబురెడ్డి ఏసీపీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా విజయ్‌కుమార్‌రెడ్డి మీద గుంటూరు రేంజ్ ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. దీనిపైన ఏసీబీ అధికారులు ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు.
సాక్షి మీడియా గ్రూపులో పని చేస్తున్న పులువురు ఉద్యోగులను అడ్డదారుల్లో నిబంధనలకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్స్ కార్యాలయంతో పాటు ఏపీ డిజిటల్ కార్పొరేషన్‌లో కూడా ఉద్యోగులుగా నియమించారని ఏసీబీ చేపట్టిన ప్రాథమిక విచారణలో గుర్తించారు. ఈ కేసులో తుమ్మారెడ్డి విజయ్‌కుమార్‌రెడ్డిని ప్రధాన నిందితుడిగా చేర్చుతూ కేసు సమోదు చేశారు. ఈ కేసులో ముందుస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. తప్పుడు కేసులో తనను ఇరికించారని, బెయిల్ మంజూరు చేయాలని పిటీషన్‌లో పేర్కొన్నారు. కోర్టు విధించే ఏ షరతుకైనా తాను కట్టుబడి ఉంటానని పిటీషన్‌లో కోర్టుకు వివరించారు.
Next Story