ఆంధ్రలో ఐపీఎల్ మ్యాచ్ లు

ఆంధ్రప్రదేశ్లోని విశాఖ నగరంలో 40,000 మంది కూర్చునే విధంగా ఒక స్టేడియం ను నిర్మించాలని ఏసీఏ నిర్ణయించింది. ఏపీ నుంచి మెరికల్లాంటి క్రీడాకారులకు శిక్షణ ఇవ్వనుంది.


ఆంధ్రలో ఐపీఎల్ మ్యాచ్ లు
x
మీడియా సమావేశంలో పాల్గొన్న ఏసీఏ కార్యదర్శి

ఆంధ్రలో ఐపీఎల్ లో 40 వేల సీట్ల కెపాసిటీ తో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణం

యువ క్రికెటర్లు శిక్షణ కోసం మాజీ ఇండియా కెప్టెన్ రవి శాస్త్రి సంస్థతో ఒప్పందం

ఆంధ్ర నుంచి అంతర్జాతీయ క్రికెటర్లను తయారు చేయడమే లక్ష్యం

ఆంధ్రలో ఈ ఏడాది మార్చి నెలలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్ నిర్వహణకు ప్రాన్చైజీలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆంధ్ర నుంచి అంతర్జాతీయ క్రికెటర్లను తయారు చేయడమే లక్ష్యంగా పని చేస్తూ వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వటమే లక్ష్యంగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ముందుకు సాగుతోంది. ఆంధ్ర క్రికెటర్లు భారతదేశ జట్టుకు ఎంపిక కావడమే లక్ష్యంగా ప్రతిభ ఉన్న క్రికెటర్లను గుర్తించి ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలో ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ఏసిఏ ప్రణాళిక సిద్ధం చేసింది. నైపుణ్యం, ఫిట్నెస్ మెరుగు పరచడానికి ఇండియా మాజీ కెప్టెన్ రవి శాస్త్రి, ఇండియా మాజీ బౌలింగ్ కోచ్ శేఖర్ భరత్ కు చెందిన కోచింగ్ బియాండ్ అనే సంస్థతో ఏసిఏ ఒప్పందం కుదుర్చుకుంది. వైజాగ్ లోని డా. వైయస్ఆర్ ఏసీఏ - వీడిసీఏ క్రికెట్ బి గ్రౌండ్ లో ఇండోర్ స్టేడియం నిర్మించేందుకు ఏసీఏ నిర్ణయించింది.

ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) సీజన్ - 1, 2ను దిగ్విజయంగా ఏసీఏ నిర్వహించటం విశేషం. ప్రతిభ ఉన్న ఎంతో మంది యువ క్రికెటర్లు ప్రీమియర్ లీగ్ ద్వారా వెలుగులోకి వచ్చారు. ఏపీఎల్ - 2 మ్యాచ్ ను స్టార్ స్పోర్ట్స్ లో లైవ్ ఇవ్వడం వల్ల 40 లక్షల మంది వీక్షించారని ఏ సి ఏ వెల్లడించింది. అదేవిధంగా ఉమెన్ ఏపీఎల్ ను దేశంలోనే మొట్ట మొదటి సారిగా ఆంధ్రలో విజయవంతంగా నిర్వహించారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ దేశంలో ఉమెన్ ప్రీమియర్ లీగ్ నిర్వహించారు. అదేవిధంగా ఏసీఏ సిబ్బంది, క్రీడాకారుల కోసం గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఏసీఏ అమలు చేస్తోంది.

రాష్ట్రంలోని అన్ని స్కూళ్ల పరిధిలో లీగ్ నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. దాదాపు 400 మంది క్రీడాకారుల పౌష్ఠికాహారం కోసం ఏడాదికి రూ. 1.50 కోట్లు ఖర్చు చేసే విధానాన్ని దేశంలోనే మొదటి సారిగా ఆంధ్రప్రదేశ్ లో అమలు జరుగుతోంది. వైజాగ్ లో 40 వేల సీట్ల కెపాసిటీతో కొత్తగా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు ఏసీఏ నిర్ణయించింది. నాలుగేళ్లలో రెండు టీ -20, రెండు వన్డే, రెండు టెస్టు మ్యాచ్ లు దిగ్విజయంగా నిర్వహించటం విశేషం.

కోవిడ్ కాలంలో ఇబ్బందులున్నా తమ ఉద్యోగులందరికీ జీతాలు పెంచిన బిసిసిఐ యూనిట్లలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ దేశంలోనే మొదటి సంస్థగా నిలిచింది. రాష్ట్రంలోని అన్ని మైదానాలను అభివృద్ధి చేయడం, అన్ని కేంద్రాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని బీసీఏ చేపట్టింది. రాష్ట్రంలోని అన్ని స్కూళ్ల లో లీగ్ నిర్వహించేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్లాన్ తయారు చేసింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ద్వారా భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలను

ఏసీఏ అధ్యక్షులు శరత్ చంద్రారెడ్డి నాయకత్వంలో కార్యక్రమాలను ముమ్మరంగా కొనసాగిస్తున్నట్లు కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్ రెడ్డి విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు

Next Story