ఏపీలో సాగు నీటి సంఘాల ఎన్నికలు సక్రమంగా జరిగాయా? జరగలేదా? అనే విషయం పక్కన పెడితే కూటమి పక్షమే వశం చేసుకుంది.
రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ లేదా ఆ కూటమి స్థానిక సంస్థల ఎన్నికలు, సాగు నీటి సంఘాల ఎన్నికల్లో ఆధిక్యత కనపరచడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్వసాధారణంగా మారిపోయింది. ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం పరిపాటిగా మారింది. రాష్ట్రం విడిపోయిన నాటి నుంచి ఈ వాతావరణం బాగా పెరిగి పోయింది. విభజన అనంతరం ఏపీలో అధికారం చేపట్టిన టీడీపీ హవా ఈ ఎన్నికల్లో కొనసాగగా, తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్‌ఆర్‌సీపీ తన ప్రతాపాన్ని చూపించింది. తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి పక్షం ప్రస్తుతం సాగునీటి సంఘాల ఎన్నికల్లో 95 శాతంకు పైగా సంఘాలను తన వశం చేసుకొని సత్తాను చాటింది. ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు వైఎస్‌ఆర్‌సీపీ ఇది వరకే ప్రకటించింది.
శ్రీకాకుళం జిల్లాలో అధిక శాతం నీటి సంఘాలలో ఏకగ్రీవం అయ్యాయి. తక్కిన చోట్ల కూడా ఏకగ్రీవం అవ్వాల్సి ఉండగా.. ఎన్నికలు వాయిదా పడ్డాయి. 344 సాగు నీటి సంఘాలల్లో 342 చోట్ల ఏకగ్రీవం అయ్యాయి. విజయనగరం జిల్లాలో 398 సంఘాలకు గాను 340, విశాఖ జిల్లాలో ఎన్నికలు జరిగిన 29 సంఘాలు ఎకగ్రీవం అయ్యాయి. అనకాపల్లి జిల్లాలో 300 సంఘాలకు గాను 226, అల్లూరి జిల్లాలో 84 సంఘాలకు 80, పశ్చమ గోదావరి జిల్లాలో 112 సాగు నీటి సంఘాలకు గాను 110 ఏకగ్రీవం అయ్యాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం 432 సంఘాలకు 431 ఏకగ్రీవం అయ్యాయి.
కృష్ణా జిల్లాలో 209 సాగు నీటి సంఘాలకు గాను ఐదు చోట్ల తప్ప తక్కిన 204 చోట్ల ఏకగ్రీవం అయ్యాయి. ఎన్టీఆర్ జిల్లాలో ఎన్నికలు జరిగిన వాటిల్లో ఒక్కటి తప్ప తక్కినవన్నీ ఏకగ్రీవం అయ్యాయి. జిల్లాలో 242 సాగు నీటి సంఘాలు ఉంటే వాటిల్లో 237 సంఘాలకు ఎన్నికలు నిర్వహించగా 236 చోట్ల యునానిమస్ అయ్యాయి. గుంటూరు జిల్లాలో 106 , పల్నాడు జిల్లాలో 274 సంఘాలకు, కర్నూలు జిల్లాలో 123 సంఘాలకు 121, నంద్యాల జిల్లాలో 261 సంఘాలకు 164, అనంతపురం జిల్లాలో 143 సంఘాలకు గాను 141, అన్నమయ్య జిల్లాలో 167 సంఘాలకు 164, చిత్తూరు జిల్లాలో 220 సంఘాలకు గాను 217, శ్రీసత్యసాయి జిల్లాలో 230 సాగు నీటి సంఘాలకు గాను 230 ఏకగ్రీవం అయ్యాయి.
Next Story