టీడీపీలో చేరకుండానే సీటు సంపాదించిన వారిలో పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి ప్రధముడని చెప్పొచ్చు. చంద్రబాబు ప్రకటించిన తరువాత వైసీపీ నుంచి టీడీపీలో చేరారు.
జి విజయ కుమార్
నిన్ని మొన్న వరకు వైసిపిలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన పెనమలూరు వైసిపి సిట్టింగ్ ఎమ్మెల్యే. ఆయనకు 2024 ఎన్నికల్లో వైసిపి టికెట్ నిరాకరించింది. వెంటనే టిడిపిలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు చంద్రబాబుతో టాక్ నడిచింది. టిటిపిలో చేరక ముందే ఏలూరు జిల్లా నూజివీడు అసెంబ్లీ టిడిపి అభ్యర్థిగా బాబు కన్‌ఫామ్ చేశారు. ఈ నెల 26న టిడిపిలో చేరారు. ఆయన ఎవరో తెలుసా.. ఆయనే కొలుసు పార్థ సారధి.
నూజివీడు టిక్కెట్ పార్థసారధికి ఎందుకిచ్చినట్లు? ప్రస్తుతం ఉన్న ఇన్‌చార్జ్ ముద్రబోయిన వెంకటేశ్వరావు యాదవ సామాజికవర్గం. పార్థసారధి కూడా యాదవ సామాజిక వర్గానికి చెందినవారే. ఇద్దరిలో ఎవరున్నా యాదవుల ఓట్లు ఇంచుమించుగా ఒకే విధంగా వచ్చే అవకాశం ఉంది. పార్టీలో చేరకముందే సీటు కన్‌ఫామం చేయడం ఓటర్లలో చర్చనియాంశంగా మారింది.
రాజకీయంగా బీసీలను ప్రభావితం చేయగలిగిన వ్యక్తి పార్థసారథి, ఈ నేపథ్యంలోనే చంద్రబాబు పార్థసారధిని పార్టీలోకి తీసుకోవడమే కాకుండా నూజివీడు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారు. ఇక గెలుపు ఓటములనేవి ఓటర్ల చేతుల్లో ఉంటాయి. నూజివీడు నియోకవర్గంలో సుమారు 25వేల యాదవుల ఓట్లు ఉన్నాయి. కాపుల ఓట్లు 25వేలు, గౌడ ఓట్లు 20వేల వరకు ఉన్నాయి. ఈ ఓట్లు రాబట్టుకోవచ్చనే ఆలోచన టీడీపీలో ఉంది. అయితే సుమారు 80వేలకు పైబడి ఎస్సీల ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్లు మెజారిటీ ఎటు ఉంటే గెలుపు అటే ఉంటుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
కొలుసు పార్థ సారధి రాజకీయ ప్రస్తానం
కొలుసు పార్థసారధి ఇప్పటి వరకు మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో మొదటి సారి ఉయ్యూరు నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శాసనసభకు ఎన్నికయ్యారు. 2009లో కాంగ్రెస్ తరఫున 2019 ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పెనమలూరు నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రి వర్గంలో పశు సంవర్థక, పాల అభివృద్ధి, మత్స్య, పశు వైద్య విశ్వవిద్యాలయ మంత్రిగా పని చేశారు. సెంకండరీ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్, ఇంటర్మిడియట్ ఎడ్యుకేషన్ పోర్టు ఫోలియోను కేటాయించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు మాధ్యమిక విద్యకు చివరి మంత్రిగా పని చేశారు. 2014లో వైసిపి టికెట్ నిరాకరించింది.
కుటుంబ నేపథ్యం
పార్థసాధి స్వగ్రామం పామర్రు నియోజక వర్గం కరకంపాడు. రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చిన నేత. తండ్రి పెద్దారెడ్డయ్య యాదవ్ 1991, 1996లో మచిలీపట్నం నుంచి ఎంపీగా గెలిచారు.
నూజివీడు సీటు కేటాయించిన బాబు
తాజగా పార్థసారధికి నూజివీడు టిడిపి టికెట్ కేటాయించారు. ఇటీవల విడుదల చేసిన తొలిజాబితాలో చంద్రబాబు ఆయన పేరును ఖరారు చేశారు. గత ఎన్నికల వరకు నూజివీడు కూడా కృష్ణా జిల్లా పరిధిలో ఉంది. జిల్లాల పునర్విభజన అనంతరం ఏలూరు జిల్లా కిందకు చేర్చారు. ఇప్పటి వరకు నూజివీడులో నాలుగు పర్యాయాలు టిడిపి గెలుపొందింది. ఏడు సార్లు కాంగ్రెస్, రెండు సార్లు వైసిపి, ఒక మారు స్వతంత్య్ర అభ్యర్థి గెలుపొందారు. 1985, 1994,1999 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా బరిలోకి దిగిన కోటగిరి హనుమంతరావు కాంగ్రెస్ అభ్యర్థి పాలడుగు వెంకట్రావుపై గెలుపొందారు. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా వైసిపి విజయం సాధించింది. మేకా అప్పారావు ఆ పార్టీ తరఫున గెలుపొందారు. టిడిపి నుంచి పోటీ చేసిన ముద్రబోయిన వెంకటేశ్వరరావుకి 2019లో 85740 ఓట్లు, 2014లో 85168 ఓట్లు లభించాయి. మేకా అప్పారావు 2014లో 10,397 ఓట్ల మెజారిటీ, 2019లో 16,210 ఓట్ల ఆధిక్యం లభించింది.
Next Story