Chandrababu naidu, cm Jagan

చంద్రబాబును తిట్టాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు సీఎం వైఎస్‌ జగన్‌ ఎందుకు చెప్పారు?


చంద్రబాబు, లోకేష్, పవన్‌ కళ్యాణ్‌ను జగన్‌ ఎందుకు తిట్టమన్నారు? తిట్టకుంటే టిక్కెట్లు ఇచ్చేది లేదని ఎందుకు చెప్పారు? దీని వెనుక ఒక రహస్యం ఉంది. అందుకే ఆయన తిట్టట్టాలన్నారు. అయినా వైఎస్సార్‌సీపీ లీడర్లు పెద్దగా పట్టించుకోలేదు. టిక్కెట్లు ఇవ్వకపోయినా పరవాలేదనుకున్నారు. అందుకే వారు తిట్టలేదు. మాగుంట శ్రీనివాసులురెడ్డి వంటి వారు తిట్టడం కుదరదని తెగేసి చెప్పారు జగన్‌కు. అందుకే నేను సీటివ్వటం లేదని జగన్‌ కూడా తెగేసి చెప్పారు. ఇంతకూ జగన్‌ వారిని ఎందుకు తిట్టాలన్నారో ఇప్పటికైనా అర్థమైందా..

ఇదొక వ్యూహాత్మక లోగుట్టు
లోగుట్టు పెరుమాళ్ల కెరుక అన్నారు పెద్దలు. ఇది సరిగ్గా జగన్‌ విషయంలో వర్తిస్తుంది. పార్టీగుట్టు బయటకు పొక్కకుండా చూసుకోవడంలో సీఎం జగన్‌ తనకు తానే సాటి అనిపించుకున్నారు. ప్రతిపక్షాలను తిట్టే బ్యాచ్‌ను పార్టీలో తయారు చేశారు. అటువంటి వారికే మంత్రి పదవులు కూడా ఇచ్చారు. పార్టీలో ఉన్న నాయకుల ద్వారా ప్రతిపక్షాలను తిట్టిస్తున్నారు సరే. మరి జగన్‌ ఎందుకు ప్రతిపక్ష నేతలను బూతులు తిట్టటం లేదు. ఆయన సద్విమర్శ చేయాలి. పార్టీలోని ఇతర నాయకులు మాత్రం ప్రతిపక్ష నేతల్ని బూతులు తిట్టాలి. ఇదెక్కడి న్యాయం అనుకుంటున్నారా? అవును అదంతే అలా చేస్తే పార్టీలో అంతర్గత సమస్యలు వచ్చినా బయటకు వెళ్లేందుకు నాయకులకు అవకాశం ఉండదు.
సీట్లు ఇవ్వని వారి విషయం జగన్‌కు ముందు తెలియదా!
ఒకటికి ఐదు సంస్థలతో సర్వేలు చేయించారు. ఈ సర్వేల్లో ఎవరిపైనైతే నెగటివ్‌ రిపోర్టులు వచ్చాయో వారిని ఆ స్థానం నుంచి మార్చేయాలనుకున్నారు. కొందరికి సీటు ఇవ్వొద్దనుకున్నారు. ఇది జగన్‌కు ముందే తెలుసు. ఎందుకంటే ఆయనేకదా ఈ ఆలోచన చేసింది. సీట్లు ఇవ్వని వారిని పిలిపించి మీరు ప్రతిపక్ష నాయకులైన చంద్రబాబు, లోకేష్, పవన్‌ కళ్యాణ్‌లను తిట్టాలని ఆదేశించారు. అటువంటి వారిలో ఇప్పుడు సీట్లు రాకుండా పోయిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి, పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి, నందికొటుకూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్, పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబులు ఉన్నారు. వీరు జగన్‌ చెప్పిన విధంగా తిట్టేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. మేము తిట్టలేదు కాబట్టే మాకు సీట్లు ఇవ్వడం లేదని పార్థసారధితో పాటు మిగిలిన నాయకులంతా చెబుతూనే ఉన్నారు.
పార్టీని వీడకుండా ఇదో ఎత్తుగడ
ప్రతిపక్షాల వారిని నేరుగా తిట్టిస్తే సొంతపార్టీలో సీటు ఇవ్వకపోయినా, అసంతృప్తి ఉన్నా టీడీపీ, జనసేనలో చేరే అవకాశం రాక అలాగే పార్టీలో పడుంటారనేది జగన్‌ ఎత్తుగడ. ఈ ఎత్తుగడ కొందరి విషయంలో వికటించినా మరికొందరి విషయంలో సక్సెస్‌ అయ్యిందని చెప్పొచ్చు. అయితే తిట్ల పురాణం గురించి ముందుగా పసిగట్టిన వాళ్లు ఇప్పుడు టీడీపీ, జనసేనలో చేరిపోతున్నారు. ఆ పార్టీల వారు కూడా వైఎస్సార్‌సీపీ నుంచి వచ్చిన వారిని చేర్చుకుంటున్నారు.
Next Story