రాజకీయ పార్టీలు ఓట్లు వేయించుకునే ముందు ఒక మాట.. వేయించుకున్నాక మరొక మాట మాట్లాడుతున్నాయి.


జి, విజయ కుమార్


ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పార్టీలకు చిత్త శుద్ధి లేదని ఎస్సీ.. ఎస్టీ.. బీసీ.. మైనారిటీల సంఘాలు ఆరోపిస్తున్నాయి. కొన్ని వర్గాలకు భారత రాజ్యాంగం కొన్ని ప్రత్యేకతలను కొంత సానుకూల వాతావరణాన్ని కల్పించింది. వారు అణగారిన వర్గాలుగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. కుల మత వర్గ బేధాలు లేకుండా అందరూ సమానంగా జీవించాలనే రాజ్యాంగ నిర్మాతలు చేశారు. అందుకే వారు తీసుకున్న నిర్ణయాలు ఇప్పటి రాజకీయ నాయకులు కొనసాగిస్తున్నారు.

ఎస్సీ..ఎస్టీలకు ప్రత్యేక అవకాశాలు
ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి భారత రాజ్యాంగం కొన్ని ప్రత్యేక అవకాశాలను కల్పించింది. ఈ అవకాశాల ద్వారా వారు అణగారిన వర్గాలుగా కాకుండా ఆర్థికంగా అందరితో సమానంగా ముందుకు సాగేందుకు ఈ ప్రత్యేకతలు తోడ్పడుతాయి. అందులో ప్రధానమైనవి సబ్‌ ప్లాన్‌ నిధులు. ఈ నిధుల సమీకరణ ఎలా చేయాలో కూడా సబ్‌ ప్లాన్‌లో ఉన్నాధికారులు రూపొందించిన మార్గ దర్శకాల్లో పొందుపరచారు. జనాభాను బట్టి కనీసం ఐదు శాతానికి తగ్గకుండా నిధులు సేకరించి ఆ నిధుల ఆధారంగా ప్రత్యేక పథకాలను రూపొందించి ఎస్సీ, ఎస్టీలకు ఆర్థిక తోడ్పాటుతో పాటు జీవన స్థితిగతులు మెరుగు పరచేందుకు చర్యలు తీసుకోవలసి ఉంటుంది. అయితే ఇప్పటి రాజకీయ నాయకులు చేస్తున్నదేంటి?. ఎందుకు ఈ చట్టాన్ని నీరు గారుస్తున్నారు?. అవసరమైతే చట్టానికి మరింత పదును పెట్టి కేంద్రం ద్వారా నిధుల సేకరణ చేపట్టి ముందడుగు వేయాలే కానీ అలాంటి పనలు రాష్ట్ర ప్రభుత్వాలు అసలు చేయడమే లేదు.
ఒక్కో శాఖ నుంచి
ఒక్కో శాఖకు కేటాయించిన బడ్జెట్‌లోని నిధుల నుంచి ఐదు శాతం అదే శాఖ ద్వారా ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేకంగా ఖర్చు పెట్టాలి. ఇది అసలు సబ్‌ ప్లాన్‌ నిబంధన. నిధుల సేకరణ జరుగుతున్నదే కానీ ఆ శాఖ ఎవరి కోసం ని«ధులను పక్కకు తీసిందో వారి కోసం మాత్రం నేరుగా ఖర్చు పెట్టడం లేదు. ప్రభుత్వ ఆర్థిక శాఖకు జమచేయాల్సిన పర్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చింది. రాష్ట్ర నేతలు ఆ డబ్బును ఎవరి కోసం ఎందుకు ఖర్చు పెట్టాలనుకుంటున్నారో అందుకు కేటాయించుకుంటున్నారు. ఎంద దారుణం?. ఇటువంటి పరస్థితి ఎవరి పాలనలోను రాకూడదు. వేరే రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎక్కడా కూడా లేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ఈ పరిస్థితి ఉంది.
అంతా డీబీటేనే
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం గతంలో ఉన్న అన్ని పథకాలను దాదాపు పక్కన పెట్టేసిందని చెప్పొచ్చు. ఆ పథకాలకు నిధుల కేటాయింపుల్లేవు. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీల మేరకు పథకాల రూపకల్పన జరిగి కార్పొరేషన్‌ల ఖాతాలకు ఆర్థిక శాఖ నుంచి నిధులు పంపించి నేరుగా కంప్యూటర్‌ మోనటరింగ్‌ సిస్టమ్‌ ద్వారా లబ్ధిదారుల అకౌంట్లకు జమచేయడం జరుగుతోంది. ఆ డబ్బును దేని కోసం.. ఎలా ఖర్చు పెడుతున్నారు అనే పర్యవేక్షణ మాత్రం లేదు. ప్రభుత్వం ఇవ్వడం మాత్రమే నేర్చుకుంది. తీసుకున్న వారు ఎలాఖర్చు పెడితే జీవితం బాగుటుందో మాత్రం చెప్పలేదు.
బీసీ, మైనారిటీ సబ్‌ప్లాన్‌ అంతా మోసం
బీసీలకు సబ్‌ ప్లాన్‌ తీసుకొస్తున్నామని, బీసీ ప్రజలను మోసగించేందుకు అసెంబ్లీలో బిల్లును ప్రవేశ పెట్టారు. ఆ బిల్లుకు ఇంత వరకు చట్ట బద్దత వచ్చిందో రాలేదో అనే విషయం వెల్లడించ లేదు. సబ్‌ప్లాన్‌ రూపొందిస్తున్నారంటే కేంద్రం కూడా తన వంతు వాటాను సబ్‌ప్లాన్‌కు జమ చేయాల్సి ఉంటుంది. అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ చట్టాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. అలాంటిదేమీ జరుగుతున్నట్లు పాలకులు ఎప్పుడు ఎక్కడా చెప్పలేదు. సబ్‌ ప్లాన్‌ రూపొందించాం, మీ కోసం కోట్లు ఖర్చు పెడుతున్నామని మాటల్లో గారడీ చేసి చూపిస్తున్నారు. ఎందుకీమాట చెప్పాల్సి వస్తుందంటే ప్రస్తుతం రాష్ట్రంలోని చాలా గ్రామాల్లో బీసీలకు ప్రత్యేకంగా కాలనీలున్నాయి. ఈ కాలనీల్లో గృహాలు, రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్‌ సౌకర్యం వంటి పనులు సాధారణంగా జరుగుతాయి. కొత్త పనులే కాకుండా పాత పనులకు మరమ్మతులు కూడా జరుగుతాయి. ఇవన్నీ బీసీ సబ్‌ప్లాన్‌ నిధులతో చేసినట్లు తప్పుడు లెక్కలు చూపుతున్నారు. నిజానికి ఇవి సాధారణ నిధుల నుంచి జరిగిన పనులు. ఇవి పాలకులు చేస్తున్న మోసం కాదా?.
ప్రస్తుత ప్రభుత్వం బీసీలకు రూ. 75,760 కోట్లు సబ్‌ ప్లాన్‌ ద్వారా ఖర్చు పెట్టినట్లు లెక్కలు చెబుతోంది. ఏ శాఖ నుంచి ఎంత శాతం నిధులు సేకరించారు, ప్రత్యేక ప్లాన్‌తో ఏ పనులుచేపట్టారనేది ఎక్కడా కనిపించడం లేదు. ఇక మైనారిటీ సబ్‌ ప్లాన్‌ కూడా రూపొందించారట. ఇది మరీ ఆశ్చర్యం. దానికో చట్టం లేదు. అసలు ఆ మాటే లేదు. అయినా రూ. 5400 కోట్లు సబ్‌ ప్లాన్‌ కింద మైనారిటీలకు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం లెక్కలు చెబుతోంది. ఇదో పెద్ద మోసమని మనం చెప్పొచ్చు.
అంకెలు చూస్తే కళ్లు తిరుగుతాయి
ఎస్సీ ఎస్టీల కోసం ఖర్చు చేస్తోన్న సబ్‌ ప్లాన్‌ నిధుల అంకెలు చూస్తే కళ్లు తిరుగుతాయి. గతంలో రూ. 15వేల కోట్లు ఎస్సీ సబ్‌ ప్లాన్‌ కోసం ఖర్చు చేస్తున్నారంటే అందరూ నమ్మే వారు. ప్రణాళిక శాఖ కూడా ఈ వివరాలను పకడ్బంధీగా వెల్లడించేది. కానీ ఈ ఐదేళ్లలో రూ. 28,149 కోట్లు సబ్‌ప్లాన్‌ కింద ఖర్చు పెట్టారట. ఇవి మోసపు మాటలే. ఇక ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధుల కింద రూ. 5, 350 కోట్లు ఖర్చు పెట్టారట. ఇంత కంటే మోసం మరొకటి ఉండదు. ట్రైబల్‌ డిపార్ట్‌మెంట్‌ సాధారణ బడ్జెట్టే సుమారు రూ. 6వేల కోట్లకు మించి లేదు. ఉద్యోగుల జీతాలు, ఇతర సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఈ నిధులు ఖర్చుచేస్తారు. ఇక ట్రైబల్‌ కార్పొరేషన్‌కు 60 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఉంటాయి. ఆ నిధులను ఉపయోగించి కేంద్ర ప్రభుత్వం సూచించిన పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరో 40 శాతం నిధులు మ్యాచింగ్‌ గ్రాంట్‌గా ఇచ్చి కార్యక్రమాలు చేపడుతారు. ఇవేవీ ఎక్కడా కనిపించడం లేదు. అసలు మ్యాచింగ్‌ గ్రాంట్‌నే నిలిపేసింది. సబ్‌ ప్లాన్‌ కింద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల కోసం ఏకంగా రూ. 1, 14, 664 కోట్లు ఖర్చు పెట్టినట్లు వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం వెల్లడించింది. ఇవన్నీ కేవలం డీబీటీ పద్దతి ద్వారా మాత్రమే ప్రజలకు చేరిన డబ్బు. ఇందులో సబ్‌ ప్లాన్‌ ఎక్కడుందనేది తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రశ్న. సబ్‌ ప్లాన్‌ నిధులన్నీ దారి మళ్లించి వారి ఇష్టాను సారం ఇష్టం వచ్చిన వారికి పంచి పెట్టారని ఎన్నికలసభల్లో చంద్రబాబు నాయుడు ఆరోపిస్తూ వస్తున్నారు.
Next Story