Vijayasai Reddy | విజయ సాగు బాగా సాగేనా..?
x

Vijayasai Reddy | విజయ సాగు బాగా సాగేనా..?

గంటల వ్యవధిలోనే వ్యవసాయంలోకి దిగిపోయారు. ఆధునిక రైతు గెటప్ లో షేర్ చేసిన ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇంతకీ ఆ క్షేత్రం ఎక్కడుంది?


ఆడిటర్ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన విజయసాయిరెడ్డి 20 ఏళ్లకే విరక్తి చెందారు. సేద్యంలోకి దిగడం ద్వారా కొత్త అవతారం ఎత్తారు. "నా ఉద్యానవన పంటల కార్యకలాపాలు ప్రారంభించానని చెప్పడానికి సంతోషిస్తున్నాను" అని కర్ణాటక రాష్ట్ర రిజిస్ట్రేషన్ తో ఉన్న దక్షిణాఫ్రికా మోడల్ జీపు ముందు ఫొటోస్టిల్స్ తో ట్వీట్ చేశారు. తద్వారా..


రాజకీయాలకు విశ్రాంతి ప్రకటించిన వైసీపీ (YCP) మాజీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి వ్యవసాయంతో సేదదీరుతా అన్నట్లు తన మార్గాన్ని మార్చుకున్నాను అనే విషయాన్ని స్పష్టం చేశారు. చార్టెడ్ అకౌంటెంట్గా జీవితం ప్రారంభించిన సాయిరెడ్డి మధ్యలో రాజయాల్లోకి ఎంట్రీ ఇచ్చినా, ఆ అనుభవాన్ని కూడా పక్కకు ఉంచారు. ఈ విషయం ఇలా ఉంచితే..

కార్యాచరణ ప్రకటించిన 48 గంటల లోపలే ఆయన వ్యవసాయ క్షేత్రంలోకి దిగినట్లు తన అభిమానులకు సంకేతం ఇస్తున్నట్లుగా ట్విట్టర్ వేదికగా ఫోటొలు పోస్టు చేశారు. అంటే రాజకీయాల్లో తీరిక లేనంతగా ఉంటుూనే వ్యవసాయ క్షేత్రాన్ని కూడా సిద్ధం చేసుకున్నారా? అనేది చర్చనీయాంశం. ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఆయన పంచుకున్న ఫొటోలతో విభిన్న కథనాలు వైరల్ అవుతున్నాయి. దీంతో మళ్లీ విజయసాయిరెడ్డి వార్తల్లో నిలిచారు.
చురుకైన ట్వీట్లు
వైసీపీలో కీలకనేతగా ఉన్న విజయసాయి రెడ్డి వైఎస్ఆర్ కుటుంబంలో మూడు తరాలకు అంతే వైఎస్. రాజారెడ్డి నుంచి జగన్ వరకు 40 ఏళ్లుగా విశ్వాసపాత్రుడిగా మెలిగారు. ఇలాంటి వ్యక్తి రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
రాజ్యసభ సభ్యుడిగానే కాకుండా, వైసీపీలో నంబర్ -2 గా విజయసాయిరెడ్డి రాజకీయ కలాపాలు సాగించిన తీరు విభిన్నంగా ఉండేది. మాజీ సీఎం వైఎస్. జగన్ పై మాట పడనిచ్చే వారు కాదు. ట్విట్టర్ వేదికగానే సతిమెత్తగా ట్వీట్ చేసిన, ప్రత్యర్థులకు చురుగ్గా గుచ్చుకునేవి. అయితే, విజయసాయిరెడ్డి రాజకీయ వైరాగ్యానికి గురయ్యారు. పార్టీలో అంతర్గం వ్యవహారాలు కావచ్చు. వైఎస్. జగన్ అక్రమాస్తుల కేసులు వెంటాడుతున్న తీరు కూడా ఉండొచ్చు. రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఆయన తీసుకున్న నిర్ణయం వైసీపీలో ప్రకంపనలు సృష్టించిదనడంలో సందేహం లేదు.
ఇంతకీ ఆ క్షేత్రం ఎక్కడ

రాజకీయాల నుంచి వైదొలగి విజయసాయిరెడ్డి వ్యవసాయ క్షేత్రం ఎక్కడుంది? అనేది సమాధానం లభించని ప్రశ్నగా మారింది. ఈ విషయం తెలుసుకునేందుకు నెటిజన్లు తీవ్రంగా అన్వేషిస్తున్నారు. అటవీప్రాంతాన్ని తలపిస్తున్న ప్రదేశం. గలగలపారే సెలయరు. ఒడ్డున జంగిల్ సఫారీకి పోలిన జీపు వద్ద ఉన్నట్లు ఆయన షేర్ చేసిన ఫొటోలతో విమర్శకులనే కాదు. మీడియాకు కూడా ఆయన పజిల్ వదిలినట్లు కనిపిస్తోంది. ట్రాక్ ప్యాంటు, బనియన్, బూట్లు ధరించిన విజయసాయిరెడ్డి ఆధునిక రైతును తలపిస్తున్నట్లే ఉంది.
ఉద్యానవన వ్యవసాయ క్షేత్రంలో ఉన్నట్లు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫొటోలు షేర్ చేశారు. అందులో టాప్ లెస్ జంగిల్ సఫారీ జీపు వద్ద ఆయన ఫొటోలకు ఫోజులిచ్చారు. KA 29 M 513 నంబర్ జీపు వాడుతున్నారు. ఇది కర్ణాటక రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేశారు. అక్కడ చేసినా ఏపీలో కూడా వాడవచ్చు. అయితే, ఈయన వ్యవసాయ క్షేత్రం ఎక్కడ ఉంది. ఎంత విస్తీర్ణంలో ఉద్యానవన పంటలు సాగు చేస్తున్నారు. అనేది మాత్రం మీడియాకు వెల్లడి కాకుండా జాగ్తత్తలు తీసుకున్నట్లు కనిపిస్తోంది.
ఆడిటింగ్ నుంచి రాజకీయ బాటగా మార్చుకున్న విజయసాయిరెడ్డి కొత్త జీవితం ప్రారంభించాననే మాట చెప్పకనే చెప్పారు. ఈ వ్యవసాయం సవ్యంగా సాగుతుందా? సాగనిస్తారా? అనేది కూడా చర్చకు వచ్చింది. ఇప్పటికే అనేక కేసులు వెంటాడుతుంటే, అవి తుది విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. ఆ తరువాత పరిణామాలు ఎలా ఉంటాయి?
"నేను శ్రీవేంకటేశ్వరస్వామికి అత్యంత విశ్వాస భక్తుడిని. తప్పులు చేయను. చేయలేదు. అబద్దాలు చెప్పను" అని ఘంటాపథంగా చెబుతున్నారు. దీనిపై టీడీపీ ఎమ్మెల్యేలు విభిన్నంగా స్పందించారు.
నెల్లూరు జిల్లా సర్వేపల్లె ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి ఘాటుగా స్పందించారు.
"సేద్యం చేస్తా అని అంటున్నారు. దోచేసిన నల్లడబ్బుతోనేనా?" అని ప్రశ్నించారు. "సేద్యంలోకి దిగితే రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ఎవరు పూడుస్తారు" అని సోమిరెడ్డి నిలదీశారు. 2004 నుంచి 2009 వరకు సీఎం వైఎస్ఆర్ కొడుకుని అడ్డుగా ఉంచి, ఏ2గా ఎన్ని పాపాలు చేశావు. అధికారంలోకి వచ్చిన 2019- 2024 మధ్య అరాచక పాలన, దోపిడీకి రైట్ హ్యాండ్ గా నిలిచారు" అని విజయసాయిని ఉద్దేశించి సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. అప్పుడు దోచుకున్న రూ. 43 వేల కోట్లతో పాటు ఐదేళ్లలో జగన్ తో కలిసి దోచిన లక్ష కోట్ల ప్రజల సొమ్ము బయటపెట్టాలని డిమాండ్ చేశారు. "అల్లుడి అరబిందోను కాపాడడానికి రాజీనామా చేశావా" అని కూడా ఆయన విజయసాయిరెడ్డిని నిలదీశారు.
Read More
Next Story