వైఎస్‌ఆర్‌సీపీ సంపదను సృష్టిస్తే.. సీఎం చంద్రబాబు వాటిని అమ్మేస్తున్నారని జగన్ మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పాలనలో సంపదను సృష్టిస్తే.. తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు వాటిని అమ్మేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ద్వజమెత్తారు. సంపద సృష్టి అంటే చంద్రబాబు దృష్టిలో తన సంపదను, తన వాళ్ల సంపదను పెంచుకోవడమే అని జగన్ మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు జేబులో సంపద సృష్టి జరుగుతోందన్నారు. తమ హయాంలో ఇసుక ద్వారా ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చితే.. కూటమి ప్రభుత్వం ఇసుక దోపిడీ చేస్తోందన్నారు. రెట్టింపు ధరలకు ఇసుకను అమ్మతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ రంగంలో ఉన్న మద్యం షాపులను ప్రైవేటు పరం చేసి, బెల్టు షాపులు పెట్టి దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. ప్రతి గ్రామంలో పేకాట క్లబ్‌లు నడిపిస్తూ అడ్డగోలుగా లూటీ చేస్తున్నారని ద్వజమెత్తారు.
ఇసుక, మద్యం, చివరికి ఫ్లైయాష్‌ను కూడా వదిలి పెట్టడం లేదని, అన్నీ మాఫియాలే అని, అన్నీ పెద్దబాబు, చిన్నబాబుల ఆధ్వర్యంలోనే సాగుతున్నాయని విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ ఆదాయం తగ్గుతుంటే.. చంద్రబాబు ఆదాయం పెరుగుతోందన్నారు. సంపాదించే మార్గం ఉంటే తన చెవిలో చెప్పమని చంద్రబాబు అంటున్నారని ఎద్దేవా చేశారు.
తమ పాలనలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలను శ్రీకారం చుట్టాం. తమ హయాంలో 5 ప్రారంభించాం. ఈ ఏడాది ఆ ఐదు మెడికల్ కళాశాలలు ప్రారంభం కావలసి ఉంది. ప్రభుత్వం మారిన తర్వాత వాటిని అమ్మేస్తున్నారు. మెడికల్ సీట్లు ఇస్తామని కేంద్రం చెబుతోంటే.. వద్దని లేఖలు రాశారు. కూటమి వచ్చిన తర్వాత వాటిని అమ్మేయలని చూస్తున్నారని మండిపడ్డారు.
తమ హయాంలో రాష్ట్ర అభివృద్ధి కోసం నాలుగు పోర్టులు నిర్మించామన్నారు. రామాయపట్నం పోర్టును 75 శాతం పూర్తి చేశామని, పది ఫిషింగ్ హార్బర్‌ల నిర్మాణం కూడా చేపట్టమాన్నారు. రెండు హార్బర్‌లను తమ హయాంలోనే ఓపెన్ చేశామన్నారు. మరో హార్బర్‌ను ఇటీవలె ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారని చెప్పారు.
Next Story