Mahakumbh of temples in Tirupati | తిరుపతిలో ఆలయాల మహాకుంభమేళా
x

Mahakumbh of temples in Tirupati | "తిరుపతి'లో ఆలయాల మహాకుంభమేళా

ఆలయాల ప్రతినిధులు. రాజకీయవేత్తలు, మతపెద్దలు తిరుపతికి పోటెత్తనున్నారు. అంతర్జాతీయ దేవాలయాల కన్వెన్షన్ కోసం ముగ్గురు సీఎంలు వస్తుండడంతో వెలుగులోకి వచ్చింది.


ఉత్తరాదిన 141 ఏళ్ల తర్వాత జరుగుతున్న మహాకుంభమేళలో కోట్లాది మంది ప్రయాగలోని త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇది కొన్ని రోజుల్లో ముగియనున్నది. ఇదే సమయంలో ప్రపంచ దేవాలయాల మహాకుంభ్ కు తిరుపతి వేదిక కానున్నంది. సోమవారం ఉదయం (ఫిబ్రవరి 17) నుంచి ప్రారంభమయ్యే ఈ సదస్సులు మూడు రోజుల పాటు నిర్వహించడానికి తిరుపతి వేదిక కానున్నది. దీనికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.

దక్షిణాదిన తిరుపతి ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రంలో కొన్ని గంటల్లో ప్రపంచ స్థాయి దేవాలయాల కన్వెన్షన్ అండ్ ఎక్స్ పో (ITCX ) పేరిట మహాకుంభ్ ప్రారంభం కాబోతుంది. ఫిబ్రవరి 17వ తేదీ నుంచి మూడు రోజుల పాటు అంతర్జాతీయ సదస్సులు, ప్రదర్శనకు వేదిక కాబోతోంది. ఈ మేళాకు 58 దేశాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు. ప్రచార ఆర్భాటాలకు ఏమాత్రం ఆస్కారం లేకుండా గోప్యంగా ఏర్పాటుకు జరిగాయి.
తిరుపతి నగరానికి సమీపంలోని కరకంబాడికి వెళ్లే మార్గంలో ఉన్న ఆశ కేంద్రంలో ఈ మహాకుంభ ప్రారంభం కానున్న ది.
ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఏపీ సీఎం ఎన్. చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, గోవా సీఎం ప్రమోద్ సావంత్ హాజరుకారున్నారు.
"దేవాలయాల మహాకుంభ్" ప్రారంభానికి దక్షిణాది రాష్ట్రాల్లోని ముగ్గురు సీఎంలు హాజరుకానున్నారు. దీంతో ఈ కార్యక్రమం వెలుగులోకి వచ్చింది.
మహారాష్ట్ర శాసనమండలి సభ్యుడు, టెంపుల్ కనెక్ట్ వ్యవస్థాపకుడు, ఐటీసీక్స్ 2025 చైర్మన్ గిరేష్ కులకర్ణి ఈ కార్యక్రమాల నిర్వహణకు సన్నాహాలు పూర్తి చేశారు. ఆయన ఏమంటున్నారంటే..
"ఇన్క్రెడిబుల్ ఇండియా" కార్యక్రమం ద్వారా "కేంద్ర ప్రభుత్వ పర్యాటక శాఖ సహకారంతో ఆలయాల కుంభమేళా నిర్వహిస్తున్నాం" అని కులకర్ణి చెప్పారు. 2023లో ఈ తరహా ఆలయాల మహాకుంభ్ ప్రధమ సభ వారణాసిలో నిర్వహించామని గుర్తు చేశారు.
మూడు రాష్ట్రాల సీఎంల హాజరు...
తిరుపతిలో నిర్వహిస్తున్న ప్రపంచ ఆలయాల మహాకుంభ్ కు దక్షిణాదిలోని ముగ్గురు సీఎంలు హాజరు కాబోతున్నారు. వారిలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, గోవా సీఎం ప్రమోద్ సావంత్ హాజరు కానున్నారు. వారితో పాటు కేరళ గవర్నర్, రాజేంద్ర అర్లేకర్ జీ, ఆర్ఎస్ఎస్ (RSS) సహ కార్యవాహక్ ముకుంద సీఆర్ జీ, రాష్ట్ర మంత్రి నారా లోకేష్, గోవా ఆరోగ్య శాఖ మంత్రి రోహన్ ఖౌంటే, రాజ్యసభ సభ్యుడు సుధాన్షు త్రివేది, ఇస్కాన్ (ISCON) కమ్యూనికేషన్స్ డైరెక్టర్ యుధిష్టర్ గోవింద దాస్ జీ, వీహెచ్పీ (VHP) మిలింద్ పరాండే ఉదయపూర్ మేయర్ డాక్టర్ లక్ష్యరాజ్, సుప్రీం కోర్టు న్యాయవాది డాక్టర్ లక్ష్యరాజ్ హాజరు కానున్నారు.

మూడు రోజుల చర్చలు

మూడు రోజుల పాటు సాగే ఆలయాల మహాకుంభ్ ( Kumbh of temples) లో అనేక అంశాలపై చర్చలు ఉంటాయని మహారాష్ట్ర ఎంఎల్సీ, ఐటీసీక్స్ (ITCX ) - 2025 చైర్మన్ గిరేష్ కులకర్ణి చెబుతున్నారు. ఈ సదస్సుల్లో ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి వచ్చే 111 మంది నిపుణులు సందేశాలు ఇస్తారు. వారితో సెమినార్లు, ఇంటరాక్టివ్ వర్క్‌షాప్‌లు, ప్రత్యేక మాస్టర్‌క్లాస్‌లు, ప్రెజెంటేషన్‌లు, వర్క్‌షాప్‌లు , మాస్టర్‌క్లాస్‌లు - ఆలయ చర్చలు ఉంటాయి. 58కి పైగా దేశాల నుంచి వస్తున్న ఆలయ నిర్వహాకుల్లో హిందూ,సిక్కు, బౌద్ధ, జైన మత సంస్థల నుండి కీలక ప్రతినిధులు పాల్గొనడమే ఇందులో విశేషం.

Read More
Next Story