ఆస్ట్రేలియాలో సెంచరీ సాధించి క్రికెట్‌ అభిమానులను ఆకట్టుకున్న నితీష్‌కుమార్‌రెడ్డి.


యువ ఆంధ్ర క్రికెటర్‌ నితీష్‌కుమార్‌రెడ్డికి వైస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. చిన్న వయసులోనే మెల్‌బోర్స్‌లో సెంచరీ సాధించినందుకు నితీష్‌కుమార్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. నితీష్‌ సాధించిన విజయం దేశం మొత్తానికి గర్వకారణమని, సెంచరీ సాధించి ఆంధ్రప్రదేశ్‌ను గర్వపడేలా చేశారని జగన్‌ పేర్కొన్నారు. నితీష్‌ విజయం ఎంతో మంది క్రీడాకారులకు స్పూర్తిదాయకమని, నితీష్‌ మరెన్నో విషయాలను సాధించాలని జగన్‌ ఆకాంక్షించారు.

మరో వైపు క్రికెట్‌లో సెంచరీతో మెరిసిన నితీష్‌కుమార్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పెద్దలు అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(ఏసీఏ) అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ అభినందనలు తెలిపారు. అంతేకాకుండా ఏసీఏ తరపున రూ. 25లక్షల నగదు బహుమతిని ప్రకటించారు. మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆంధ్ర ఆటగాడు నితీష్‌కుమార్‌ రెడ్డి సెంచరీ సాధించారు.
Next Story