‘రుషికొండపై మాయామహల్’.. నిర్మాణానికి రూ.500 కోట్లా..!
x

‘రుషికొండపై మాయామహల్’.. నిర్మాణానికి రూ.500 కోట్లా..!

జగన్ పెదవిపై పేదల మాట.. మనసులో సిరుల మూట.. నడిచేసి ధనవంతుల బాట అని టీడీపీ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. బీజేపీ నేత బైరెడ్డి కూడా జగన్‌‌ను ప్రజలు చెప్పులతో స్వాగతిస్తారన్నారు.


రుషికొండపై గత ప్రభుత్వం నిర్మించిన అత్యంత విలాసవంతమైన భవనాలు కొన్ని రోజుల్లో దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారాయి. వీటిని మాజీ సీఎం జగన్ ఎందుకు కట్టించారు? ఇదంతా ప్రజా సొమ్మేనా? వీటిని ఇన్నాళ్లూ ఎందుకు తెరవలేదు? ఇవి ప్రభుత్వ భవనాలా లేక జగన్ భవనాలా? ఇది అధికారికంగా కట్టినవేనా? పర్యాటకం కోసం కట్టిస్తే అంత విలాసవంతంగా కట్టాలా? ప్రభుత్వ అతిథి గృహాలయితే ఇప్పటివరకు ఎందుకు ఎక్కడా వీటి గురించి మాట్లాడలేదు? ఇలా మరెన్నో ప్రశ్నలు ప్రజల మదుల్లో మెదులుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టీడీపీ, బీజేపీ నేతలు వర్ల రామయ్య, బైరెడ్డి రాజవేఖర్ రెడ్డి.. జగన్‌పై, రుషికొండ ప్యాలెస్ వ్యవహారంగా మండిపడ్డారు. ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

తాను, తన భార్య నివసించడం కోసం రూ.500 కోట్ల ప్రజా సొమ్మును జగన్ వృథా చేశారని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పర్యాటకం కోసం కడుతున్నమాని ఇప్పుడు చెప్తున్నారే తప్ప అప్పట్లో ఈ భవనాలను ఎందుకు కడుతున్నామనన్న విషయం అప్పటి పర్యాటక మంత్రి ఆర్కే రోజాకు కూడా తెలియదని చెప్పుకొచ్చారు. అధికారం పోతుందని అర్థమైపోవడంతో తూతూ మంత్రంగానే ఈ భవనాలను ప్రారంభించారని, ఫెన్సింగ్ కూడా అంతే వేశారని దుయ్యబట్టారు. రుషికొండ ప్యాలెస్ రహస్యాలు నిన్న బహిర్గతమయ్యాయని, ఇలాంటి నేతన మేము 2019లో ఎన్నుకుందని అని జగన్‌ను ప్రజలు ఛీ కొడుతున్నారని టీడీపీ నేత బైరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ధ్వజమెత్తారు.

‘ఇలాంటి నేత ప్రపంచంలోనే ఎక్కడా లేడు’

‘‘తన నివాస నిర్మాణం కోసం వందల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని వెచ్చించేటటువంటి నేత భారత్‌దేశంలోనే కాదు యావత్ ప్రపంచంలో ఎక్కడా లేరు. జగన్ అధికారం తీసుకున్న తర్వాత ఆంధ్ర రాష్ట్రం పేదరికంలో మగ్గుతుంటే.. పేదలు ఆకలికి అల్లాడుతుంటే జగన్ మాత్రం రూ.500 కోట్ల ప్రజా ధనాన్ని వృథా చేసి రుషికొండలో మాయా మహల్ నిర్మించుకున్నారు. అధికారం శాశ్వతం అనుకునే జగన్ ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డారు. జగన్ పెదవులపై పేదల మాట.. మనసులో సిరుల మూట.. నడిచేది ధనవంతుల బాట అని ఈ మాయా మహల్ స్పష్టం చేస్తుంది’’ అని వర్ల రామయ్య పేర్కొన్నారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘ భారత దేశంలోనే కాదు.. ప్రపంచంలో ఏ నాయకుడు తన నివాసం నిర్మాణం కోసం ప్రజా ధనం వెచ్చించలేదు. ఇంత భవనం నిర్మించలేదు. స్వతంత్రం వచ్చిన 77 సంవత్సరాలలో భారత పార్లమెంట్ నిర్మాణానికి రూ.700 కోట్లు ఖర్చు అయ్యింది. జగన్ రెడ్డి అధికారం చేపట్టాక రాష్ట్రం పేదరికంలో మగ్గుతుంటే పేదలు ఇళ్లు లేక అల్లాడుతుంటే రూ.500 కోట్లతో తాను తన భార్య అప్పుడప్పుడు నివసించడం కోసం ప్రజా ధనాన్ని వృథా చేసి రుషి కొండలో మాయా మహల్ నిర్మించుకున్నారు. అప్పటి పర్యాటక శాఖ మంత్రి రోజాకు ఆ బంగ్లా ఎందుకు కడుతున్నారో కూడా తెలియదు. అధికారం పోతుందని తెలిసి తూతూ మంత్రంగా ప్రారంభం చేసి ఫెన్సింగ్ వేశారు.

ఈ రూ.500 కోట్లతో 25 వేల మంది పేదలకు ఇళ్లు నిర్మించవచ్చు. అది మానుకుని తన స్వార్థం కోసం మాయా మహల్‌ను కట్టుకోవడం సిగ్గుచేటు. ఏ రంకంగా చూసినా జగన్.. పేదల మనిషి కాదు.. మదించిన ధనవంతుడు మాత్రమే. రాష్ట్ర ప్రజలు ఇది గమనించారు. అందుకే జగన్‌కి 11 సీట్లే ఇచ్చారు. జగన్ రెడ్డి పేదవాడి పక్షం కాదు. ధనవంతుడి పక్షమని సరైన వాత పెట్టారు. రుషికొండపై కట్టిన మాయా మహల్‌లోని ఒక్క బాత్ టబ్‌కు రూ.45 లక్షలు ఖర్చు పెట్టారు. ఆ డబ్బుతో పేదలకు మంచి ఇళ్లు కట్టించి ఇవ్వొచ్చు’’ అని అన్నారు.

‘‘అందుకే పేద ప్రజలు జగన్ రెడ్డిని అసహ్యించుకున్నారు. కీలెరిగి వాత పెట్టారు. పేదలు అలోలక్ష్మణ అంటూ కడుపు కాలి అల్లాడుతుంటే ఈజిప్టు మార్బుల్స్‌తో మాయా మహల్ కడతారా? 7 స్టార్ హోటల్స్‌కు కూడా లేని కారిడార్.. జగన్ రెడ్డి మాయా మహల్‌లో ఉంది అంటే జగన్ రెడ్డి ఏవిధంగా ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశాడో అర్థం చేసుకోవచ్చు. స్నానం చేసే టబ్ వద్ద ఏర్పాటు చేసిన ట్యాప్‌లతో పేదోడికి ఇళ్లే వస్తుంది. ఇదంతా ఇప్పుడు బట్టబయలు కావడంతో ఇప్పుడు రాష్ట్రపతి, ప్రధాని కోసం అని కొత్త నాటకం మొదలు పెట్టారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. వాళ్లు కూడా ఈ భవనం చూసి ఆశ్చర్యపోతారు’’ అని వివరించారు రామయ్య.

‘ఇదే జగన్ రాజకీయ సమాధి’

రుషికొండలో ప్రజా ధనాన్ని వృథా చేసి కట్టిన ప్యాలెస్.. జగన్‌కు రాజకీయ సమాధి అని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘రుషికొండపై కట్టిన భవనాల్లో ఏముందో ఇన్నాళ్లకు బట్టబయలు అయింది. ఆ ప్యాలెస్ చూసిన ప్రజలంతా ఇలాంటి నాయకుడినా 2019లో ఎన్నుకుంది అని ఛీ కొడుతున్నారు. ఇప్పుడు ఓడిన తర్వాత తాను మళ్లీ ప్రజల్లోకి వస్తానని, ఓదారుస్తానని చెప్పున్నారు జగన్. అదే జరిగితే ప్రజలు ఆయనకు చెప్పులు, బూట్లతో స్వాగతం పలుకుతారు. జగన్ తన గొచ్చిని తానే తవ్వుకున్నారు’’ అని వ్యాఖ్యానించారు బైరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

‘వాళ్లు ప్రజా సేవకులు’

చంద్రబాబు, నారా లోకేష్.. ప్రజా సేవకులు, పేదల కోసం అహర్నిశలు శ్రమించే నాయకులు అని బైరెడ్డి కొనియాడారు. వారు ఎప్పుడు ప్రజల జీవనాన్ని మెరుగు పరచాలని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచిస్తారని చెప్పారు. ‘‘వాలంటీర్ల వ్యవస్థపై కూటమి ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. అతి త్వరలోనే దీనిపై సమావేశం నిర్వహించి ఒక నిర్ణయానికి వస్తాం. అంతేకాకుండా నందికొట్కూరులో పనిచేసే కొందరు వాలంటీర్లు ప్రభుత్వ పాఠశాలల్లో వంట చేసే ఉద్యోగాల పేరిట రూ.1 లక్ష చొప్పున వసూలు చేసినట్లు తెలిసింది. ఇలాంటి వాటిని బాబు ఎట్టిపరిస్థితుల్లో సహించరు. ఈ విషయంపై దృష్టి సారించి ఇందులో నిజానిజాలు తెలుసుకున్న తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటాం’’ అని చెప్పారు.

Read More
Next Story