జగన్‌మోహన్‌రెడ్డికి దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆకాంక్షించారు.


వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సుదీర్ఘకాలం ప్రజా సేవలో ఉండాలని ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ జగన్‌కు శనివారం హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకంక్షలు చెప్పారు. భగవంతుడు జగన్‌కు మంచి ఆరోగ్యం, సంతోషం, దీర్ఘాయుష్షు ఇవ్వాలని ఆకాంక్షించారు. సుదీర్ఘకాలం జగన్‌ ప్రజా సేవలో ఉండాలని తాను కోరుకుంటున్నట్లు గవర్నర్‌ పేర్కొన్నారు. ఆ మేరకు ఏపీ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ శనివారం ట్వీటర్‌ వేదిక ద్వారా జగన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ప్రముఖులు జగన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. జగన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పేందుకు ఆ పార్టీ నేతలు క్యూ కట్టారు. పలు జిల్లాల్లో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు కేక్‌లు కట్‌ చేసి, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. పేదలకు దుస్తులు పంపిణీ చేపట్టారు.



Next Story