’ఆంధ్రాలో ఏది ముట్టుకున్నా అవినీతి స్వరాలు వినబడతాయి’
x

’ఆంధ్రాలో ఏది ముట్టుకున్నా అవినీతి స్వరాలు వినబడతాయి’

ఆంధ్ర ప్రదేశ్ ఏది ముట్టుకున్నా అవినీతి నట. చివరకు ఆటపాటలు కూడా అవినీతి మయయ్యాయి. జగనన్న ఆడకుందాం, రా ప్రోగ్రాం 'దోచుకుందాం, రా ' అయిందట, ఎట్లా అంటే...



ప్రభుత్వం కేటాయించింది రూ.120 కోట్లు... స్పాన్సర్ల నుంచి రూ. 500 కోట్ల వసూలు. వైసిపి కార్యకర్తలు, వాలంటీర్లే క్రీడాకారులు

క్రీడా మైదానాలు ప్రైవేటుకు...కోచ్ ల ఉద్వాసన: ఇదే ఆడుకుందాం, రా అంటే అంటున్న జనసేన

విశాఖపట్నం,ఫిబ్రవరి 12:-

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు 120 కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర అవినీతి కి, అధికార దుర్వినియోగానికి చిరునామాగా మారిందని జనసేన నేత కార్పోరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. సోమవారం ఆయన విశాఖలో పౌరగ్రంధాలయం లొ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇది చాల దన్నట్లు రాష్ట్ర వ్యాప్తంగా పారిశ్రామిక వేత్తలు, కంపెనీలు, సంస్ధ ల నుంచి సుమారు ఐదు వందల కోట్ల రూపాయల వరకూ ఆడుదాం ఆంధ్రా పేరిట దండుకొన్నారనే ఆరోపణలు వున్నాయని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమం విఫలం అని అంటున్నా నిధులు మాత్రం విచ్చల విడిగా ఖర్చు అయిపోయాయని,అవినీతి మంత్రిగా ముద్ర పడిన ఆర్ కే రోజా, పెద్ద నిజాయితీ పరుడిగా యువతకు సందేశాలిచ్చే శాప్ చైర్మన్ సిద్ధార్ధ రెడ్డిల ఆధ్వర్యంలో అధ్యాన్నంగా ఆడదాం ఆంధ్రా ఆటలు సాగుతున్నాయని ధ్వజమెత్తారు.

ప్రభుత్వ స్టేడియం లు ప్రైవేటుకు ఇచ్చేసి బయట ప్రైవేట్ స్ధలాల్లో ఆటలా?

ఆడుదాం ఆంధ్రా పేరిట ప్రభుత్వ క్రీడ మైదానాలను వదిలేసి ప్రైవేట్ స్థలాల్లో చాలా చోట్ల పోటీలు నిర్వహించారని,క్రీడాకారులను పక్కన పెట్టేసి వైసిపి కార్యకర్తలను, వాలంటీర్లను క్రీడాకారులుగా చూపించారని ఆరోపించారు.పలుచోట్ల బాగా రాణించిన టీం ను పక్కన పెట్టేసి స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులు చెప్పిన టీములను విజేతలుగా ప్రకటించారు. మెజార్టీ ప్రాంతాల్లో క్రీడాకారులకు కనీస భోజన,వసతి సదుపాయాలు కూడా కల్పించలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక అసలు క్రీడాకారులకు చేసిందంటూ ఏమీ లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి ఇంట్లో కూర్చొని పబ్జీ ఆడుకొంటుంటే మంత్రి రోజా, శాప్ చైర్మన్ సిద్ధార్ధ రెడ్డిలో క్రీడాకారుల జీవితాలలో ఆడుకొంటున్నారు.

విశాఖలో జరుగుతున్న ముగింపు పోటీలది అదే పరిస్థితి.విశాఖపట్నంలో మూడు రోజులుగా జరుగుతున్న ఆడదాం ఆంధ్రా రాష్ట్ర స్థాయి ముగింపు పోటీల పరిస్థితి దయనీయంగా మారింది. అధికారులు, రాజకీయ నాయకులను రిసీవ్ చేసుకోవటంలో వారి మెప్పు పొందటంలో ఉన్న శ్రద్ధ నిర్వాహకులకు క్రీడా కార్ల విషయంలో లేకపోయింది. సకాలంలో భోజనం అంద లేదని విశాఖ లో క్రీడా కారులు ఆందోళన కు దిగాల్సిన దుస్థితి దాపురించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ప్రారంభం రోజునే బ్యాట్లు విరిగిపోయిన ఘటనలు, క్రీడాకారులు సరైన సౌకర్యాలు ఇవ్వని ఘటనలు మనం చూసాం.నిన్న చూసాము చోడవరం నియోజకవర్గం భుచ్చయ్యపేట మండలం రాజనా గ్రామం క్రీడాకారులకు ఎలా అన్యాయం చేశారో వాళ్ళు మాటలోనే తెలుస్తోంది.

ఆడుదాం ఆంధ్ర ఫైనల్ పోటీల నిర్వహణను విశాఖపట్నంలో చేస్తున్నారు మంచిదే మొదటి రోజు కనీసం క్రీడాకారులు కడుపునిండా అన్నం పెట్టలేకపోయారు కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోయారు.

120 కోట్ల రూపాయల నిధులు పెట్టుకుని కనీసం క్రీడాకారులకు పౌష్టికాహారం కూడా ఇవ్వలేరా?క్రీడాకారులకు మంచి వసతి సౌకర్యం లేదు, భోజన సదుపాయం లేదు, కనీసం వారికి మంచి క్రీడా సామాగ్రిని కూడా ఇవ్వలేదు. అలాంటప్పుడు ఆడుదాం అందరం ఎందుకు పెట్టినట్టు?ఈ పోటీలు నిర్వహిస్తున్న శాప్ అక్రమాలతో అట్టుడికి పోతుంది. ఒక క్రికెట్లో మినహా మిగతా ఏ పోటీలకు సరైన క్రీడాకారులు లేకపోయారు. వారిని వైసిపి కార్యకర్తలను వాలంటీర్లను క్రీడాకారులుగా చూపించి వారిలో విజేతలుగా ప్రకటించే ప్రాహసనం సాగుతోంది.

కోచ్ లు లేకుండా పోటీలా?

పెద్ద మొత్తంలో 120 కోట్ల రూపాయలతో పోటీలు నిర్వహించినప్పుడు ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి. క్రీడా మైదానాలను అభివృద్ధి పరచాలి. సమర్థులైన అర్హతలు ఉన్న కోచ్ లను నియమించి క్రీడాకారులకు శిక్షణ ఇప్పించాలి. అసలు కోచింగ్ లేకుండా క్రీడాకారులకు శిక్షణ లేకుండా నియమ నిబంధనలు తెలియకుండానే పోటీలు జరిగిపోతున్నాయి. శాప్ గుర్తింపు పొందిన కోచ్ లకు చాలాకాలంగా కనీస వేతనాలు అందడం లేదు.

క్రీడా మైదానాలు ప్రైవేటుకు

ఆంధ్ర పోటీలు 120 కోట్ల తో నిర్వహిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కొన్ని లక్షల రూపాయల కోసం రాష్ట్రంలో క్రీడా మైదానంలో అన్నిటిని ప్రైవేట్ పరం చేసేసింది. అంటే ఆటలాడుకోవాలన్నా, వ్యాయామం చేయాలన్న, కనీసం వాకింగ్ చేయాలన్న ఫీజు చెల్లించాలి. ముందు చూపు లేకుండా క్రీడా మైదానం ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టి క్రీడలకు తీరని ద్రోహం చేసి ఆడదాం ఆంధ్ర పేరిట పోటీలు నిర్వహించడం అంటే ప్రభుత్వ నిధులను పూర్తిగా దుర్వినియోగం చేయటమే. నిధుల దుర్వినియోగంపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నందున ఈ వ్యవహారం పై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం. నిధుల దుర్వినియోగం ,నకిలీ క్రీడాకారులు వ్యవహారం , జరగని పోటీలు జరిగినట్టు చూపించటం వంటి వ్యవహారాలన్నిటిపై విచారణ జరిపి నివేదిక బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. వందల కోట్ల తో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా ఖర్చులపై ఆడిట్ జరిపి నివేదికను బహిరంగ పర్చాలని డిమాండ్ చేస్తున్నాం.

ఈ 120 కోట్లు ఉంటే...

ఈ 120 కోట్లు ఉంటే రాష్ట్రంలో బస్సులన్నీ ఈరోజు ఉచితంగా నడపవచ్చు.ఈ 120 కోట్లు ఉంటే ఉత్తరాంధ్రలో ప్రాజెక్టులు అన్నీ కూడా నీళ్లు లీకేజీ లేకుండా మరమత్తులు చేయొచ్చు.

ఈ 120 కోట్లు ఉంటే ఉత్తరాంధ్రలో ప్రతి పల్లెకు చక్కటి తారు రోడ్డు వేయొచ్చు.

కానీ ఈ 120 కోట్లు పెట్టి క్రీడాకారుల పేరు చెప్పి వైసీపీ పార్టీ ఖజానా నింపుకుంటున్నారు.నిజంగా చెత్తశుద్ధి ఉంటే ఆడుదాం ఆంధ్ర కు అయిన ప్రతీ రూపాయి ఖర్చుని ప్రజలకు తెలియజేసి శ్వేతపత్రం విడుదల చేయాలి. అలాగే గతంలో అంతర్జాతీయ స్థాయిలో బహుమతులు తీసుకొచ్చిన క్రీడాకారులకి ప్రభుత్వం ప్రకటించిన నగదు బహుమతి అందించాలి.

ఈ సమావేశంలో జనసేన ఉత్తరాంధ్రా ప్రాంతీయ సమన్వయకర్తలు నాగలక్ష్మీ చౌదరి, కిరణ్ ప్రసాద్, రూపా, బంటు రవి తదితరులు పాల్గొన్నారు.


Read More
Next Story