జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌.. సీబీఐని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
x
Source: Twitter

జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌.. సీబీఐని ప్రశ్నించిన సుప్రీంకోర్టు

సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కేసు దర్యాప్తులో జాప్యమెందుకని సీబీఐని న్యాయస్థానం ప్రవ్నించింది.


సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్‌పై ధర్మాసనం ఈరోజు విచారణ చేపట్టింది. జగన్‌ అక్రమాస్తుల కేసు దర్యాప్తులో జాప్యం ఎందుకు జరుగుతుందని సీబీఐని ప్రశ్నించింది. ఇందుకు గల కారణాలను తదుపరి విచారణలో ఈ తెలపాలని పేర్కొంటూ పిటిషన్ విచారణను ఆగస్టు 5కు వాయిదా వేసింది న్యాయస్థానం. అయితే జగన్ బెయిల్‌ రద్దు చేయాలని, జగన్‌పై ఉన్న కేసుల విచారణను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయాలని కోరుతూ రఘురామకృష్ణ రాజు రెండు పిటిషన్‌లు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లపై జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా ఈ పిటిషన్‌లపై తమ బదులు ఇవ్వడానికి తమకు మరింత సమయం కేటాయించాలని జగన్ తరపు న్యాయవాది కోరారు. అందుకు అంగీకరించిన ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. అంతేకాకుండా ఈ కేసుల విచారణలో జాప్యం ఎందుకు జరిగింది. ఇప్పటివరకు వీటిలో ఎంతమేర పురోగతి లభించింది అన్న వివరాలను సీబీఐ తెలియజేయాలని న్యాయస్థానం కోరింది.

Read More
Next Story