గత శాసనసభ ఎన్నికలు తనను తీవ్ర బాధకు గురి చేశాయి. ఎప్పుడు పోటీ చేయకుండా ఉండలేదు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపైన మొన్నటి వరకు ఆ పార్టీ రాజ్యసభ ఎంపీగా ఉండి, టీడీపీలో చేరిన మోపిదేవి వెంకటరమణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలు తనను చాలా బాధకు గురి చేశాయన్నారు. తన రాజకీయ ప్రయాణంలో తొలిసారిగా బాధకు గురి చేసిన సంఘటన 2024 శాసన సభ ఎన్నికలే అని అన్నారు. దాని గురించి ఆయన మాట్లాడుతూ ఆ ఎన్నికల్లో తాను శాసన సభకు పోటీ చేయక పోవడం అనేది తనను చాలా బాధకు గురి చేసిందన్నారు. ఎప్పడు తాను శాసనసభకు పోటీ చేయకుండ ఉండ లేదని, ఎమ్మెల్యేగా పోటీ చేయడం తనకు నచ్చిన అంశమని, కానీ ఆ అవకాశం గత ఎన్నికల్లో తనకు లేకుండా పోయిందన్నారు. ఇది తన రాజకీయ ప్రయాణంలో బాగా బాధపెట్టిన అంశంగా ఆయన చెప్పుకొచ్చారు. అందరు పోటీ చేస్తున్నారు. సీనియర్ లీడర్ అయిన తాను మాత్రం పోటీలో లేక పోవడం అనేది తనను తీవ్ర అవమానానికి గురి చేసిందని అని చెప్పారు. ఎందుకు జగన్ మోహన్‌రెడ్డి తనను ఎమ్మెల్యేగా పోటీలో నిలప కూడదని నిర్ణయించుకున్నారో తనకు తెలియదన్నారు. కానీ తనను పోటీలో పెట్టకూడదని జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం మాత్రం తనను బాగా బాధ పెట్టిందని, ఇది తనను తీవ్ర అవమానానికి గురి చేసిందని చెప్పారు.