నిబద్దత, విలువలతో కూడిన రాజకీయాలకు ప్రతీకని చంద్రబాబు అంటే.. పవన్ కల్యాణ్ అన్నా అంటూ లోకేష్ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మీద తెలుగుదేశం పార్టీ పెద్దలు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లు మరో సారి తమ ప్రేమను, ఆప్యాయతలను ప్రదర్శించారు. కూటమిలో తమ స్నేహ బంధాన్ని చూపించారు. పవన్ కల్యాణ్‌కు శుభాకాంక్షలు చెప్పారు. జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బెస్ట్ విషెస్ చెప్పారు. నిబద్దత, సేవా గుణం, విలువలతో కూడి రాజకీయాలకు జనసేన, ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ అంటూ సీఎం చంద్రబాబు పేర్కొంటే.. జనసేనకు మంచి ఫ్యూచర్ ఉందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆ మేరకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లు తమ ఎక్స్ వేదికగా పోస్టులు పెట్టారు.
సీఎం చంద్రబాబు ఏమన్నారంటే..
జనసేన నిబద్ధత, విలువలతో కూడిన రాజకీయాలకు ప్రతీకగా కొనసాగుతున్న పార్టీ జనసేన, 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు, పార్టీ ముఖ్య నాయకులకు, జనసైనికులందరికీ హృదయపూర్తవక శుభాకాంక్షలు అంటూ తాను పవన్ కల్యాణ్‌లు కలిసి ఉన్న ఫొటోను పోస్టు చేశారు.
నారా లోకేష్ ఏమన్నారంటే..
జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్‌భంగా పవన్ కల్యాణ్ అన్నకు, నాయకులకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, సామాజిక అభివృద్ధికి జనసేన చిత్తశుద్దితో పని చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడంలో, అభివృద్ధి చేయడంలో జనసేన పాత్ర కీలకం. జనసేనకు మరింత ప్రకాశవంతమైన భవిష్యత్తు ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అంటూ ఎక్స్ వేదికగా మంత్రి నారా లోకేష్ పోస్టు చేశారు. దీంతో పాటుగా తన ట్వీట్‌ను జనసేన జయకేతనంకు ట్యాగ్ చేసిన లోకేష్ తన ట్వీట్ కింద పవన్ కల్యాణ్ పిడికిలి బిగించి మైక్ పట్టుకొని మాట్లాడుతున్నట్లు రూపొందించిన చిత్రాన్ని ఉంచుతూ, సాధించిన విజయాలు స్మరించుకుందాం.. భవిష్యత్తుకు మార్గ నిర్థేశం చేసుకుందాం.. జయకేతనం ఎగుర వేద్దాం అంటూ ఆసక్తికరంగా పోస్టు పెట్టారు.
Next Story