కాళహస్తిలో జగన్ కు మద్యాభిషేకం ..
x

కాళహస్తిలో జగన్ కు మద్యాభిషేకం ..

శ్రీకాళహస్తిలో జనసేన నేతలు నిరసన. సీఎం జగన్ చిత్రపటానికి మద్యాభిషేకం చేసి తీవ్ర ఆరోపణలు చేసిన జనసేన ఇన్‌ఛార్జ్ వినుత కోటా.



శ్రీకాళహస్తిలో మద్యం మంట రాజుకుంది. మద్యపాన నిషేధం చేస్తామని గత ఎన్నికల సమయంలో జగన్ ప్రజలకు కాకమ్మ కబుర్లు చెప్పి ఓట్లు దండుకున్నారని శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన నేతలు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జగన్ పూర్తిగా విఫలమయ్యారని వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం ప్రజలకు నోటికి వచ్చిన హామీలను ప్రకటించేసి ఇప్పుడు వాటిని నెరవేర్చమంటే మాత్రం మాట మార్చేస్తున్నారని విమర్శించారు. ఇందులో భాగంగానే శ్రీకాళహస్తి ప్రజలకు ఇచ్చిన మద్యపాన నిషేదం అమలు విషయంలో జగన్ మాట తప్పారని, మడమ తిప్పారని, పైగా కొత్తగా సొంత బ్రాండ్లు తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యంతో ఆటలు ఆడుతున్నారని మండిపడ్డారు.
ఈ నేపథ్యంలోనే ఆదివారం శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జ్ వినుత కోటా ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు భారీ ఎత్తున నిరసన తెలిపాయి. మద్యం షాపు ఎదురు జగన్ చిత్ర పటం పెట్టి నిరసన తెలిపారు. జగన్ చిత్రపటానికి మద్యంతో అభిషేకం చేశారు. అనంతరం వందల మంది నియోజకవర్గ మహిళలతో కలిసి మద్యం దుకాణం నుంచి స్థానిక పెళ్లి మండపం మీదుగా నాలుగు మాడవీధుల్లో శాంతియుతంగా ర్యాలీ చేశారు. ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం స్పందించి మద్యపాన నిషేదంపై ఓ నిర్ణయం తీసుకోకుంటే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేస్తామని హెచ్చరించారు.

దమ్ముంటే ఎన్నికల నుంచి తప్పుకోవాలి
నిరసన సందర్భంగా మాట్లాడుతూ వినుత కోటా కీలక వ్యాఖ్యలు చేశారు. సంపూర్ణ మద్యపాన నిషేదం చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మాట తప్పిన జగన్ ఓట్లను అడగానికి ఏ మొహం పెట్టుకుని శ్రీకాళహస్తికి వస్తారని ప్రశ్నించారు. జగన్ అంత అసమర్థుడు, మోసగాడు ఎక్కడా ఉండరని ధ్వజమెత్తారు. ‘‘వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న అంశాలనుక భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావిస్తానని ఆనాడు జగన్ చెప్పిన మాటలన్నీ ప్రగల్బాలు మాత్రమే.క 2019 ఎన్నికల్లో 2024 నాటికి రాష్ట్రాన్ని లిక్కర్ ఫ్రీగా మారుస్తానని చెప్పారు. కానీ ఇప్పుడు ఆ హామీ ఏమైంది. ఇప్పుడు దీనిపై ప్రజలు ప్రశ్నిస్తే ఏం సమాధానం ఇస్తారు. నిజంగా వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే 2024 ఎన్నికలక బరి నుంచి వైసీపీ తప్పుకోవాలి’’అని ఛాలెంజ్ చేశారు. అమ్మఒడి పేరుతో మహిళలకు ఇస్తున్న డబ్బును నాన్న బుడ్డి పేరుతో తిరిగి లాక్కుంటున్నారని జనసేన పార్టీ నాయకులు చురకలంటించారు. కల్తీ మద్యం విచ్చలవిడిగా అమ్ముతూ రాష్ట్ర మహిళల తాళిబొట్లను తెంపుతున్నారని వైసీపీ ప్రభుత్వంపై వినుత ధ్వజమెత్తారు.

వైసీపీ నేతలను తరిమి కొట్టాలి

ఒకవేళ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓట్్లు అడగడానికి వైసీపీ నేతలెవరైనా ఇంటికి, బస్తీకి వస్తే వాళ్లని ప్రజలు తరిమి తరిమి కొట్టాలని ఆమె పిలుపునిచ్చారు. వైసీపీ నేతలకు మరోసారి అవకాశం ఇస్తే రాష్ట్రమంతా గుల్ల అవుతుందని మండిపడ్డారు. వైసీపీ నేతలు, జగన్‌కు దమ్ముంటే ఎన్నికల ప్రచారంలో గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇప్పటివరకు ఎందుకు హామీ చేయాలో ప్రజలకు చెప్పాలని, ఐదేళ్ల పాలనలో వైసీపీ ప్రజలకు ఏం చేశారో కూడా వివరించాలని ఆయన సవాల్ చేశారు.


Read More
Next Story