ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం కేబినెట్‌ సమావేశం నిర్వహించారు. హడ్కో నుంచి 11వేల కోట్లు రుణం తీసుకునేందుకు ఆమోదం.


ఆంధ్రప్రదేశ్‌ మంత్రి వర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం మంత్రి వర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇది వరకు సీఆర్‌డిఏ నుంచి అనుమతి పొందిన అమరావతి నిర్మాణం కోసం ప్రతిపాదనలను కేబినెట్‌ ఆమోదం తెలిపింది. మూడేళ్లల్లో అమరావతిలోని నిర్మాణాలను పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుంది. రుణం తీసుకునే అంశంపైన చర్చించారు. హడ్కో నుంచి రూ. 11వేల కోట్లు రుణం తీసుకోవాలని ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో పాటుగా జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్యూ ద్వారా కూడా మరో రూ.16వేల కోట్లు రుణం తీసుకునేందుకు చంద్రబాబు నాయుడు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అమరావతి పరిధిలో దాదాపు రూ. 33వేల కోట్ల నిధులు ఖర్చు పెట్టి 45 పనులు పూర్తి చేసేందుకు సీఆర్‌డీఏకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. బుడమేరుతో పాటు పది జిల్లాల్లోని వరద ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ధాన్యం కొనుగోలు కోసం మార్క్‌ఫెడ్‌ ద్వారా రూ. 1000 కోట్లు రుణం తీసుకునేందుకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టుపైన చర్చించిన మంత్రి వర్గం పోలవరం ఎడమ కాల్వ రీటెండర్‌కు అనుమతి ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయించింది. చిత్తూరు జిల్లా పుంగనూరు బ్రాంచ్‌ కెనాల్‌ లైనింగ్‌ పనులకు కూడా మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.

అమరావతిలోని మొత్తం 20 ఇంజనీరింగ్‌ పనులకు రూ. 8821 కోట్ల పరిపాలన అనుమతులకు ఆమోదం తెలిపింది. అమరావతిలో 25 పనులను చేపట్టేందుకు రూ. 24316 కోట్లు మంజూరు చేసేందుకు ఆమోదం తెలిపింది. నూతనంగా ఏర్పాటైన 12 నగర పంచాయతీలు, మునిసిపాలిటీలకు 176 మంజూరు కేడర్‌ స్ట్రెంత్‌ను ట్రాన్స్‌ఫర్‌ చేసేందుకు ఆమోదం లభించింది. ఆంధ్రప్రదేశ్‌ రియల్‌ ఎస్టేట్‌ అప్పిల్లేట ట్రిబ్యునల్‌కు 14 పోస్టులకు ఆమోదం లభించింది. ఏపీ రీసర్వే ప్రాజెక్టుకు సంబంధించి గ్రామ కంఠం భూముల సర్వే నిమిత్తం కోసం తీసుకున్న 679 సూపర్‌ న్యూమరీ డిప్యూటీ డిప్యూటీ తహశీల్దార్‌లను మరో రెండేళ్ల పాటు కొనసాగించేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఎన్జీ రంగా అగ్రికల్చర్‌ యూనివర్శిటీ ఆధ్వర్యంలో కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు 50 ఎకరాల 20 సెంట్లు భూమికి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. వరద బాధితులకు స్టాంప్‌ డ్యూటీని మినహాయింపులు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. క్లీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం ఎన్టీపీసీ, ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ జాయింట్‌ వెంచర్‌ ప్రతిపాదనకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రభుత్వ కళాశాలలు, కేజీబీవీ మోడల్‌ పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్‌ కళాశాలల్లో చదివే ఇంటర్‌ విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర కింద పాఠ్యపుస్తకాలు, పోటీ పరీక్షల మెటీరియల్, నోట్‌ పుస్తకాలు, ప్రాక్టికల్‌ రికార్టుల కోసం రూ. 32,45,88,679కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రూ. 1.70లక్షల కోట్ల పెట్టుబడుతలో విద్యుత్‌ ఉత్పత్తి యూనిట్‌ల ఏర్పాటుకు, 475 జూరియర్‌ కళాశాలల్లో మిడ్‌డేమీల్‌ పథకం భోజనం అందించేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

Next Story