ఉచిత ఇసుక ఎలా తీసుకెళ్లాలో తెలుసా?

ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక పాలసీ మారింది. గత ప్రభుత్వం అమలు చేసిన విధానానికి స్వస్తిపలికించి నేటి ప్రభుత్వం.


ఉచిత ఇసుక ఎలా తీసుకెళ్లాలో తెలుసా?
x

ఇసుక ఏపీలో అందని ద్దాక్షయింది. ఎన్నో నిర్మాణాలు నిలువునా ఆగిపోయాయి. ఎంతో మంది కూలీలకు పనులు లేకుండా పోయాయి. కాంట్రాక్టర్లు అప్పుల పాలయ్యారు. బిల్డర్లు భవన నిర్మాణాలు ఆపివేసి పత్తాలేకుండా పోవాల్సి వచ్చింది. టన్ను ఇసుక గతంలో కట్టడం వద్దకు చేరాలంటే కనీసం రూ. 14 నుంచి 16 వేలు చెల్లించాల్సి వచ్చేది.

పాత విధానానికి స్వస్తి
నేటి తెలుగుదేశం ప్రభుత్వం ఆ విధానానికి స్వస్తి చెప్పింది. ఇసుకను ఇక నుంచి డంపింగ్‌ యార్డుల వద్ద నుంచి వినియోగదారులు నేరుగా వచ్చి తీసుకుపోవచ్చు. చెల్లింపులు ఆన్‌లైన్‌లో మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఇందు కోసం క్యూఆర్‌ కోడ్‌ను అందుబాటులో ఉంచింది. క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయగానే ఆటోమేటిగ్గా ప్రభుత్వ అకౌంట్‌కు ఇసుక కొనుగోలు దారులు ఇచ్చే డబ్బులు జమ అవుతాయి.
ఎలా తెచ్చుకోవాలి
ఉచితంగా ఇసుక కావాలనుకునే వారు నేరుగా ఇసుక డిపోకు వెళ్లి ఆధార్‌ నెంబర్, ఫోన్‌ నెంబరు, అడ్రస్, ఇసుక తీసుకు వెళ్లే వాహనం నెంబరు అక్కడి వారికి ఇవ్వాలి. లోడింగ్, ట్రాన్స్‌పోర్టుకు అయ్యే ఖర్చును ఆన్‌లైన్‌లో మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఇందు కోసం ప్రత్యేకించి క్యూఆర్‌ కోడ్‌ ఏర్పాటు చేశారు. క్యూఆర్‌ కోడ్‌పై డబ్బులు చెల్లించే యాప్‌ల నుంచి స్కాన్‌ చేయగానే ప్రభుత్వ అకౌంట్‌కు డబ్బులు జమ అవుతాయి. అక్కడి నుంచి నేరుగా ఇసుకను తీసుకు వెళ్లొచ్చు.
తీసుకెళ్లే సమయం
ఇసుక డిపోలు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తాయి. ఆ సమయాల్లో ఎప్పుడైనా ఇసుక కావాలనుకునే వారు తీసుకెళ్లొచ్చు. రాష్ట్రంలోని ఇసుక డిపోలు ఎక్కడెక్కడ ఉన్నాయనే వివరాలు వెబ్‌సైట్లో పూర్తిగా ఉన్నాయి. ఇసుక విధానం గురించి కూడా వెబ్‌సైట్లో ఉంచారు. డిపో ఎక్కడుందో తెలుసుకోవడంతో పాటు ఎంత ఇసుక స్టాక్‌ ఉందో కూడా అందులో వివరాలు ఉంచుతారు. ముందుగానే వెబ్‌సైట్లో వివరాలు తెలుసుకుని ఆ తరువాత ఇసుకను తీసుకెళ్ల వచ్చు. స్టాక్‌ ఉన్నంత వరకు ఎవరు ముందు వస్తే వారికి ఇసుక ఇస్తారు. ఇంకా అదనపు సమాచారం కోసం www.mines.ap.gov.in వెబ్ సైట్లో తెలుసుకునేందుకు వీలు వుంది. ఈ వెబ్సైట్ ను గనుల శాఖ వారు నిర్వహిస్తారు. వెబ్ సైట్ లో అధికారుల ఫోన్ నెంబర్లు ఉంటాయి. ఆ నెంబర్లకు ఫోన్ చేసి సందేహాలు కూడా తీర్చుకోవచ్చు.
Next Story