కోటశ్రీనివాసరావు సతీమణి మృతి
x

కోటశ్రీనివాసరావు సతీమణి మృతి

మహా ప్రస్థానంలో అంత్యక్రియలు పూర్తి


దివంగత నటుడు కోట శ్రీనివాసరావు సతీమణి కోట రుక్మిణి అనారోగ్య కారణాలతో మృతి చెందారు. ఇటీవలే కోట శ్రీనివాసరావు అసువులు బాసిన సంగతి తెలిసిందే. రుక్మిణి వయస్సు 75 సంవత్సరాలు. ఈ మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో రుక్మిణి మరణించినట్టు కుటుంబసభ్యులు అధికారికంగా ప్రకటించారు.

ఇలా ఉండగా దివంగత నటులు కోట శ్రీనివాసరావు(83) జులై13 న చనిపోయారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. కోట శ్రీనివాసరావు మృతి చెందిన నెల రోజుల తర్వాత కోట రుక్మిణి చనిపోవడం ఆ కుటుంబంలో విషాదచాయలు నింపింది. జూబ్లిహిల్స్ మహా ప్రస్థానంలో ఆమె అంత్య క్రియలు జరిగాయి. కోట శ్రీనివాస రావు ఒక్కగానొక్కకొడుకు ఆంజనేయ ప్రసాద్ 2010లో ఔటర్ రింగ్ రోడ్డులో ప్రమాదానికి గురై చనిపోయిన సంగతి తెలిసిందే.

1973లో కోట రుక్మిణి గర్బిణీగా ఉన్న సమయంలో ఆమె తల్లి చనిపోయారు. అప్పట్నుంచి ఆమె మానసికంగా డిస్టర్బ్ కావడంతో ఎవరినీ గుర్తు పట్టేవారు కాదు. ఈ విషయాన్ని కోట శ్రీనివాసరావు చనిపోయే ముందు ఒక టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Read More
Next Story