‘జగన్ ఓడిపోవడం ఆశ్చర్యంగా ఉంది’.. కేటీఆర్
x

‘జగన్ ఓడిపోవడం ఆశ్చర్యంగా ఉంది’.. కేటీఆర్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల ఫలితాలపై తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ముఖ్యంలో ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ ఓడిపోవడంపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల ఫలితాలపై తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ముఖ్యంలో ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ ఓడిపోవడంపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ఓడిపోవడం చాలా విడ్డూరంగా ఉందని, అలా జరుగుతుందని తాను అసలు ఊహించలేదని చెప్పారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ భారీగా పేదలకు పథకాలు ఇచ్చినప్పటికీ జగన్ ఎందుకు ఓడిపోయారో అర్థం కావడంలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రజలు, పేదల కోసం ఎంతో చేసిన జగన్ ఓటమి చాలా ఆశ్చర్యం కలిగించిందని చెప్పుకొచ్చారు కేటీఆర్. ఓడిపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ 40శాతం ఓటింగ్‌ను నమోదు చేయడం మామూలు విషయం కాదని, ఆంధ్రప్రదేశ్‌లో ఓడిపోయినా వైసీపీ బలంగానే ఉందని ఈ ఓటింగ్ శాతం నిరూపిస్తుందని అన్నారు.

షర్మిల ఒక ఆయుధం

అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్ జగన్‌ను ఓడించడానికి వైఎస్ షర్మిలను ఒక ఆయుధంలా వినియోగించుకున్నారని వ్యాఖ్యానించారు కేటీఆర్. ఢిల్లీలో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జగన్ ఓటమికి షర్మిల అతిపెద్ద ఆయుధంలా మారారు. ఆంధ్రలో కాంగ్రెస్‌ గెలవదని తెలిసినా.. కేవలం జగన్‌ను ఓడించాలన్న ఉద్దేశంతోనే షర్మిలను రంగంలోకి దించారు. అనుకున్నట్లుగానే జగన్‌ను ఓడించడానికి షర్మిల ఆయుధంలా పనిచేశారు’’ అని అభిప్రాయపడ్డారు. అదే విధంగా పవన్ కల్యాణ్ కూడా ఎన్‌డీఏ కూటమితో కాకుండా ఒంటరిగా పోటీ చేసి ఉన్నా ఎన్నికల ఫలితాలు మరోలా ఉండి ఉండేవని అన్నారు.

కేతిరెడ్డి ఓడిపోవడం మరీ విడ్డూరం

‘‘నిత్యం ప్రజల్లోకి వెళ్తూ వారి కష్టనష్టాలు తెలుసుకుంటూ.. వారి సమస్యల పరిష్కారాని పాటుపడిన వ్యక్తి ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి. ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా? అందకుంటే ఎందుకు అందడం లేదని అధికారులను అక్కడిక్కడే అడిగి సమస్యను పరిష్కరించిన కేతిరెడ్డి కూడా ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. అది మరీ విడ్డూరంగా ఉంది. ఎప్పుడూ ప్రజల్లోనే ఉన్నా ఓడిస్తారా అన్న అనుమానాలను కలిగిస్తున్నాయి ఈ ఎన్నికల ఫలితాలు’’ అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు కేటీఆర్.

Read More
Next Story