నీళ్లలో దేన్నైనా వెదికే సామర్థ్యం ఈ డ్రోన్ ఇండియాలో ఒక సాంకేతిక విప్లవమే...


ఇంతవరకు గాలిలో ఎగిరే డ్రోన్ లనే చూశాం. పెళ్లి ఫోటోలు తీయడం దగ్గిర నుంచి యుద్ధాల్లో బాంబులు వేసేదాకా డ్రోన్ లను ప్రయోగిస్తున్నారు. అయితే, నీళ్లలోతుల్లో, సుముద్రపు, రిజార్వాయర్ లోతుల్లో తిరిగి మూలమూలలా గాలించే డ్రోన్ ల గురించి మనం ఎపుడు వినలేదు. అది మన కళ్ల ముందుకు రాబోతున్నది. ఈ డ్రోన్ తయారయితే అది ఎన్ని విధాల ఉపయోగపడుతుందో చెప్పలేం. సముద్రాల్లో కూలిపోయినవిమాన శకలాలను కూడా వెతకవచ్చు. నదుల్లో , రిజర్వాయర్లలో పడిపోయిన వాటిని వెతక వచ్చు. నౌకల కిందలోపాలను కనిపెట్టవచ్చు. నీళ్లలోపల ఆనకట్టు లోపాలను, పరిశీలించవచ్చు. ఇలా నీళ్లమునిగివున్న ఏ నిర్మాణాన్నయినా పరిశీలించే మన సామర్థ్యం బాగా పెరుగుతుంది. ఇలాంటి అండర వాటర్ డ్రోన్ ఎక్కడ కాదు, ఆంధ్రప్రదేశ్, కర్నూలు ఉన్న ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ (Indian Institute of Information Technology Design and Manufacturing Kurnool,IIITDM) శాస్త్రవేత్తలు రూపొందించారు.

ఈ సంస్థకు చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె కృష్ణ నాయక్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రవి కుమార్ మండవ నేతృత్వంలో ఈ డ్రోన్ రూపుదిద్దుకుంది. దీని నిర్మాణానికి అయిన ఖర్చెంత తెలుసా కేవలం రు. 1 లక్ష రుపాయలే. ఈ లోకాస్ట్ డ్రోన్ ఇంకా కొన్ని ప్రయోగాలు జరుపుకుని విజయపతాకం ఎగరవేయనుంది. ఇంకా ప్రయోగాల్లోనే ఉన్నా, దీని ఖ్యాతి దేశమంతా వ్యాపించింది. ఈ అద్భుత శక్తి ఉన్న డ్రోన్ మీద అక్వాకల్చర్ వాళ్లు, జలవనరుల శాఖ వాళ్లు,ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇంజినీర్లు, పర్యావరణ సంస్థలు, విపత్తునివారణ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ డ్రోన్ చాలా శక్తి వంతమయిన సెన్సర్లు, నీళ్లలోపల వీడియో తీసే సామర్థ్యం ఉన్న కెమెరాలను అమర్చారు.

శ్రీశైలం డ్యామ్ నీటిలోకి వదిలిన డ్రోన్
ఈ అండర్ వాటర్ డ్రోన్ (Underwater Drone) ప్రాథమిక రూపం (Prototype) పనితీరును మొదటిసారి విజయవంతంగా ప్రదర్శించారు. శ్రీశైలం, గోరకల్లు రిజర్వాయర్‌లలో ఈ డ్రోన్ పనితీరుని పరిశీలించారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో గోరకల్లు రిజర్వాయర్ 40 మీటర్ల లోతుల దాకా డ్రోన్ వెళ్లగలగడమే కాదు అండర్‌ వాటర్ హై-రిజల్యూషన్ వీడియో ఫుటేజ్ అందించింది.
శ్రీశైలం, గోరకల్లు రిజర్వాయర్‌లలో ఈ డ్రోన్ ప్రయోగం ఆశాజనకంగా సాగిందని డాక్టర్ నాయక్ చెప్పారు.
డాక్టర్ కె కృష్ణ నాయక్ ‘ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ ప్రతినిధితో మాట్లాడుతూ సముద్రంలోని వార్ షిప్స్ కింది భాగంలో పరిశీలించేందుకు ఈ డ్రోన్ ను రూపొందించాలని భావించి 15 ఏళ్లుగా పరిశోధన చేస్తున్నట్లు చెప్పారు. డాక్టర్ నాయక్ మొదట DRDO (Defence Research and Development Organization)లో పనిచేసే వారు. ఆ తరువాత 2020లో కర్నూలు IIIT-DM కు వచ్చారు.

ఫ్రొఫెసర్ డాక్టర్ కె కృష్ణ నాయక్

“ప్రస్తుతం తయారు చేసిన అండర్‌ వాటర్ డ్రోన్ ను శ్రీశైలం రిజర్వాయర్, గోరకల్లు రిజర్వాయర్లలో ప్రయోగించాము. అయితే అనుకున్న స్థాయిలో రిజల్ట్ తెప్పించేందుకు మరో నెల రోజులలో మరొకసారి ప్రయోగిస్తాము,” అని ఆచన చెప్పారు.
తాము ప్రస్తుతం తయారు చేసిన మోడల్ లో మరికొన్నిమార్పులు చేర్పులు తీసుకువస్తామని కూడా ఆయన చెప్పారు. ఇది ఆలపాటికి పూర్తి కావలసి ఉండిందని, అయిన యోగా, సెన్సెస్ వంటి కారణాల వల్ల కాస్త ఆలస్యం అయింది. పెద్దగా ఖర్చు లేకుండా కూడా భారతీయ శాస్త్రవేత్తలు ఈ లాంటి అద్భుతాలు ఆవిష్కరించగలరనేందుకు ఈ అండర్ వాటర్ డ్రోన్ ఒక నిరదర్శనమని ఈ శాస్త్రవేత్తలు చెప్పారు.
నీటి విడుదల సమయంలో శ్రీశైలం డ్యామ్ కింది భాగంలో గుంతలు పడ్డాయి. ఈ గుంతలు పూడ్చకుంటే ప్రాజెక్టుకు డ్యామేజీ జరిగే అవకాశం ఉందని భావించిన ప్రాజెక్టు సేఫ్టీ అధికారులు వారానికి ఒక రోజు ప్రాజెక్టును పరిశీలించి తగు చర్యలు తీసుకుంటున్నారు. గత నెలలో ప్రాజెక్టు సేఫ్టీ అధికారులు వచ్చిన రోజునే డ్రోన్ ను కూడా శాస్త్ర వేత్తలు ప్రవేశపెట్టడంతో డ్రోన్ ద్వారా ప్రాజెక్టు గట్టితనం గురించి పరిశీలన జరిగినట్లు మీడియాలోవూహాగానాలువచ్చాయి. దీంతో డ్రోన్ అసలు పరిశోధన చర్చ పక్కదారి పట్టిందని కృష్ణ నాయక్ అన్నారు.

కర్నూలులోని ఐఐటీ ఎండి ఇనిస్టిట్యూట్
ఈ డ్రోన్ ను పూర్తిగా భారతీయ టెక్నాలజీతో అభివృద్ధి చేశారు.
ఈ డ్రోన్ నీళ్లలోపల పనులకు సంబంధించిన సిబ్బంది లేదా ఇంజినీర్లకు బాగా ఉపయోగపడుతుంది. నీళ్ళలోతుల్లో మానవులు, సాధారణ పరికరాలు సులభంగా పరిశీలించలేని ప్రదేశాలలో దీనిని ఉపయోగించుకోవచ్చు. డ్రోన్ కు అమర్చిన సాంకేతిక సామర్థ్యం ద్వార అండర్ వాటర్ నిర్మాణాల లోపాలను సులభంగా కనుగొనేందుకు వీలవుతుంది.
"మేము తయారు చేసిన ఈ శక్తివంతమైన మినీ-డ్రోన్‌లకు 100 మీటర్ల లోతుకు వెళ్లే సామర్థ్యం ఉంది. తదపరి దశలో ఈలోతుల్లోకి డ్రోన్ ను పంపించడం జరగుతుంది" అని నాయక్ వివరించారు. "ఈ టెక్నాలజీని ఇంకా అభివృద్ధి చేసేందుకు మరింత సమయం అవసరం. ఈ ప్రాజెక్ట్ అండర్‌ వాటర్ టెక్నాలజీలో భారతీయ సామర్థ్యం ఏమిటో ప్రపంచానికి తెలుస్తుంది” అని డాక్టర్ నాయక్ చెప్పారు.
ఈ డ్రోన్ ఫీల్డ్-రెడీ సొల్యూషన్‌లను అందిస్తుంది, మానిటరింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఈ డ్రోన్‌కు మూడు దశల్లో పరీక్షలు జరిగాయి. ప్రాథమికంగా నీటి ట్యాంక్‌లు, AI కాలిబ్రేషన్ కదలిక నియంత్రణలో స్విమ్మింగ్ పరీక్షలు, ఫీల్డ్-లెవల్ డెప్లాయ్‌మెంట్ జరిగాయి. ఈ సిస్టమ్ బోర్డ్ AI సామర్థ్యాలు, దానిని గుర్తించడానికి మందపాటి ఉపరితలాలను, కాంక్రీట్ నీటి వనరులను పరీక్షించేందుకు పనికి వస్తాయి.
Next Story