జగనన్న ఇలా అభ్యర్థులతో ‘ఆటాడుకుందాం’ అంటున్నారు
ఈరోజు పలానా నియోజకవర్గానికి అభ్యర్థి అని ప్రకటించి పదిరోజులు కాకుండానే మార్చేస్తుంది వైఎస్సార్సీపీ. దీన్నేమంటారు. ఆటాడుకుందాం... అంటారా అనరా...
మొదట సింహాద్రి రమేష్ ని అవని గడ్డ నుంచి మచిలీపట్నం ఎంపీగా అన్నారు. తప్పును తెలుసుకుని సరిదిద్దుకున్నారో ఏమో కాని తిరిగి అవనిగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థిగా గురువారం రాత్రి ప్రకటించారు. అంతకు ముందు ఎవరినైతే ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారో సింహాద్రి చంద్రశేఖర్‌ను తిరిగి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. క్యాండిడేట్స్ తో అడుకుంటున్న వైసిపి.
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా అవని గడ్డ నియోపకవర్గం ప్రతిష్టాత్మకమైనది. ఈ నియోజకవర్గం ఒకప్పుడు కమ్యూనిస్టుల కరుడు గట్టిన గడ్డ. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేగా ఉన్న సింహాద్రి రమేష్ సహితం కమ్యూనిస్టు ఆర్గనైజేషన్‌లో పనిచేసిన వాడే. సీపీఐ ఎంఎల్ లిబరేషన్ గ్రూపుకు చెదిన శనగా బుచ్చికోటయ్య గతంలో ఎంపీగానూ, ఎమ్మెల్యేగానూ పనిచేశారు. ఆ సమయంలో సింహాద్రి రమేష్‌బబు విద్యార్థి సంఘం విభాగంలో పనిచేశారు. గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా గెలుపొందారు. మంచి పేరు సంపాదించారు. అవినీతికి తావులేని ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నారు. సింహాద్రి రమేష్‌బాబు అంటే అవనిగడ్డలో అందరు కోరుకునే వ్యక్తిగా మారాడు.
పూర్తిగా తీరని తాగునీటి సమస్య..
తాగునీరు అవనిగడ్డ గ్రామాల్లో చాలా తీవ్రం. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోనూ చెరువులు ఉంటాయి. ఆ చెరువుల్లో సాగరు కాలువల నుంచి తాగు నీరు నింపాలి. పశువులు ఆ చెరువుల్లో దిగకుండా చర్యలు తీసుకోవాలి. ఆ నీటిని తాగటం వల్ల ఆరోగ్యం బాగుంటుందని అక్కడి వారు భావిస్తారు. బోర్ల నుంచి వచ్చే నీరు తాగేందుకు బాగుండదని అక్కడి వారి అభిప్రాయం. చెరువులకు తాగు నీరు నింపించడంలో సక్సెస్ అయ్యారు.
వరిపంటతో చేతులు కాలుతున్నాయి..
అంతే కాకుండా డెల్టా ప్రాంతమనేది పేరుకు మాత్రమే. మంచి పంటలు పండాలంటే సంబంధింత శాఖల అధికారుల సాయం అవసరం. అలాగే ఈ ప్రాంతంలో పండ్లతోటలు కూడా అక్కడక్కడా ఉంటాయి. కేవలం వరి పంటకు మాత్రమే ఈ భూమి అనుకూలమైంది. వరి పంటకు ఇప్పుడు పెట్టుబడి పెట్టేకంటే చేతులు కట్టుకుని కూర్చోవడం మంచిదని రైతులు భావిస్తున్నారు. ఈ తరుణంలో రమేష్ ఎన్నో మెళుకువలు పాటించి రైతులకు తగిన సూచనలు, సలహాలు అధికారుల ద్వారా అందించడంలో ముందున్నారు. ప్రత్యామ్నాయ పంటలవైపు రైతులు మళ్లే విధంగా ఎమ్మెల్యే పలు చర్యలు చేపట్టారని, అవి మాద్వారానే చేయించారని వ్యవసాయాధికారులు చెప్పడం విశేషం.
ఎంపీగా సరిపోడనే..
ఎంపీ అభ్యర్థిగా రంగంలో ఉండాలంటే డబ్బు ఉండాలి. ఆ స్థాయిలో రమేష్ దగ్గర డబ్బులేదని వైఎస్సార్‌సీపీ అధిష్టానానికి తెలుసు. పైగా ఎమ్మెల్యేగా చంద్రశేఖర్ కుమారుడు రాంచరణ్‌ను రంగంలోకి దించితే నియోజకవర్గంలో వ్యతిరేకత వస్తోందని వైసీపీ భావించింది. దీంతో చంద్రశేఖర్‌కు సర్థిచెప్పినట్లు సమాచారం.
తప్పును సరిదిద్దుకున్నారా..
రమేషన్‌ను అవని గడ్డ నుంచి మచిలీపట్నం ఎంపీగా పంపించారు. తప్పును తెలుసుకుని సరిదిద్దుకున్నారో ఏమో కాని తిరిగి అవనిగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థిగా గురువారం రాత్రి ప్రకటించారు. అంతకు ముందు ఎవరినైతే ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారో సింహాద్రి చంద్రశేఖర్‌ను తిరిగి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఈ విషయంలో సరైన నిర్ణయం పార్టీ తీసుకుందనే చర్చ వైఎస్సార్‌సీపీ వర్గాల్లో కొనసాగుతోంది.
ప్రజలకు సేవ చేయాలనే..
తాను ఎంతో కాలం నుంచి అవనిగడ్డ ప్రజలకు సాయం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సింహాద్రి చంద్రశేఖర్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన కుమారునికి సీటు ఖరారు చేయించుకున్నారు. ఇప్పుడు అన్నీ మారాయి. చంద్రశేఖరే మచిలీపట్నం ఎంపీగా ఖరారయ్యారు.
రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో చెప్పలేము. అలాగే ఎప్పుడు ఎక్కడ ఎవరు అభ్యర్థులుగా రంగంలో ఉంటారో చెప్పలేము. ఇప్పుడు ఇలా జరిగింది. తిరిగి సింహాద్రి రమేష్‌ను అవనిగడ్డలోనే ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడంలో ఎటువంటి రాజకీయాలు చోటు చేసుకున్నాయో ఆలోచించాల్సి ఉంది. ఏమైనా పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులను నీళ్ల ప్రాయంగా మార్చడం చూస్తుంటే సీఎం జగన్ తీసుకునే నిర్ణయాలు ఇలా ఉంటున్నాయేమిటని పలువురు చర్చించుకుంటున్నారు.