నియామకాన్ని పునరాలోచన చేయాలని ప్రముఖలు సంతకాలు చేసిన లేఖను సీఎంకు పంపారు.
ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు నియామకంపై తీవ్ర వ్యతిరేకతలు వినిపిస్తున్నాయి. ఫ్యూడల్ విధానాలను ప్రచారం చేసే ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావును విద్యార్థులకు నైతిక విలువలను నేర్పందుకు ప్రభుత్వ సలహాదారుగా నియమించిడం సరికాదని విమర్శలు వినిపిస్తున్నాయి. చాటగంటి నియామకం విషయంలో పునరాలోచనలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు విద్యావేత్తలు, కవులు, రచయితలు, ప్రజా సంఘాల ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి బహిరంగ లేఖ రాశారు.
వైతిక విలువల సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావు నియామకాన్ని వ్యతిరేకిస్తూ జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు, మాజీ పీడీఎఫ్ ఎమ్మెల్సీ గేయానంద్ అధ్యక్షతన ఆదివారం వర్చువల్ సమావేశం నిర్వహించారు. దీనిలో పాల్గొన్న దాదాపు 72 మందికిపైగా విద్యావేత్తలు, కవులు, రచయితలు, ప్రజా సంఘాల ప్రతినిధులు చాగంటి నియామకాన్ని వ్యతిరేకించారు. మాజీ ఎమ్మెల్సీ విఠపుబాలసుబ్రహ్మణ్యం, పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ప్రొ రాచపాలెం చంద్రశేఖరరెడ్డి, సినీ దర్శకులు సి ఉమామహేశ్వరరావు, రచయిత్రి ఓల్లా, ఆలిండియా లాయర్ల సంఘం అధ్యక్షులు సుంకర రాజేంద్రప్రసాద్, అభ్యదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షులు పెనుగొండ లక్ష్మినారాయణ వంటి ప్రముఖులు ఉన్నారు.
స్వాతంత్య్ర ఉద్యమం, రాజ్యాంగ విలువలను ప్రచారం చేయాలి. ప్రజాస్వామ్యం, లౌకిక వాదం పునాదిగా ఉండే విలువలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఇలాంటి విలువలు ఎంతో ముఖ్యం. ఇవి ప్రజలకు ఎంతో అవసరం. అయితే భవిష్యత్ తరాన్ని పురాణ యుగంలోకి మళ్లించడం అనేది రాష్ట్ర ప్రజలకు ఎక్కడికి తీసుకెళ్తుందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించాలి. సంకుచిత, కుల, మత, ప్రాంతీయ ధృక్పథాలకు అతీతంగా భవిష్యత్ తరాలు ఎదిగినప్పుడే మానవ జాతి గొప్పగా చెప్పుకుంటున్న లక్ష్యాలను చేరుకోగలదు. ఈ లక్ష్యాలకు తగిన విధంగా విలువను విద్యార్థులకు పంచాలి. వాటికి అనుగుణంగా విద్యార్థులను మలచాలి. అలా కాకుండా పౌరాణిక నీతులు ఎంత మేరకు ఉపయోగపడుతాయనేది ఒక సారి పునరాలోచన చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు మాజీ పీడీఎఫ్ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం సీఎంకు రాసిన లేఖను విడుదల చేశారు.
Next Story