ఎపిలో మద్యం దుకాణాలు మూత పడ్డాయి. ఉద్యోగులు విధులను బహిష్కరించారు. నూతన మద్యం పాలసీతో వారి ఉద్యోగాలు గాలిలో కలిసాయి.
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాలను మూతపడ్డాయి. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న మద్యం దుకాణాలు ఒక్కసారిగా మూత పడటానికి కారణం ప్రభుత్వ విధానం. నూతన మద్యం విధానం రావడంతో ఇప్పటి వరకు మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న సిబ్బంది మాకు సరైన న్యాయం చేస్తామని రాతపూర్వకంగా ప్రభుత్వం నుంచి హామీ ఇస్తేనే దుకాణాలు తెరుస్తామని, లేకుంటే విధులు బహిష్కరిస్తామని ప్రభుత్వానికి ఇప్పటికే చెప్పారు. అయినా ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతో దుకాణాల్లో పనిచేసే ఉద్యోగులు దుకాణాల బయట విధుల్లోకి వెళ్లకుండా ఆగిపోయారు.
సోమవారంతో మద్యం దుకాణాల ఉద్యోగుల ఒప్పంద గడువు ముగిసింది. ఉద్యోగుల ఉపాధికి సంబంధించి ఎటువంటి హామీ ఇవ్వకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా షాపుల్లో ఉద్యోగులు విధులు బహిష్కరించారు. మద్యం దుకాణాల సిబ్బందితో ప్రభుత్వం చర్చలు జరుపుతూనే ఉంది. నిత్యం మందు తాగే వారు దుకాణాలు లేకపోవడంతో దుకాణాల చుట్టూ ఉసూరు మంటూ తిరుగుతున్నారు.
Next Story