భారీ మెజారిటీతో గెలిపించారు. మీ రుణం తీర్చుకుంటానని మంత్రి నారా లోకేష్ చెప్పారు.
మంత్రి నారా లోకేష్ మంగళగిరి అసెంబ్లీ నియోజక వర్గ ప్రజలకు మరో హామీ ఇచ్చారు. అక్కున చేర్చుకొని, భారీ మెజారిటీతో గెలిపించిన మంగళగిరి నియోజక వర్గం ప్రజలకు జీవితాంతం గుర్తుండి పోయే విధంగా మంగళగిరి అసెంబ్లీ నియోజక వర్గాన్ని డెవలప్ చేస్తానని స్థానికులకు హామీ ఇచ్చారు. డెవలప్‌మెంట్ అంటే ఎంటో, డెవలప్‌మెంట్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తానన్నారు. రానున్న వంద రోజుల్లో కొన్ని డెవలప్‌మెంట్ కార్యక్రమాలను ప్రారంభిస్తామన్నారు. అందులో భాగంగా భూగర్భ డ్రైనేజీ, నడుమూరు ఫ్లైఓవర్ పనులు, నియోజక వర్గంలోని పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపడుతామని వెల్లడించారు.
మంగళగిరి అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలోని ఎర్రబాలెంలో జైనుల ఆధ్వర్యంలో నిర్మాణం చేపట్టిన భగవాన్ మహావీర్ గోశాలను కేంద్ర మంత్రి, గుంటూరు ఎంపీ పెమ్మాని చంద్రశేఖర్‌తో కలిసి మంత్రి నారా లోకేష్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంగళగిరి అసెంబ్లీ నియోజక వర్గం ప్రజలకు డెవలప్‌మెంట్ హామీల వర్షం కురిపించారు. శుక్రవారం హోలీ సందర్భంగా మంత్రి నారా లోకేష్ చిన్నారులతో హోలీ ఆడారు. చిన్నారులకు రంగులు పూసి హోలీ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్‌ను, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌లను మార్వాడీలు ఘనంగా సన్మానం చేశారు.