ఆక్వాకు, మత్స్యకారులకు ‘జగన్ కష్టాలు’

జగన్ కష్టాలంటే ఏమిటి? వాటిని తెలుగుదేశం నేత లోకేష్ తీరుస్తామంటున్నారు


ఆక్వాకు, మత్స్యకారులకు ‘జగన్ కష్టాలు’
x
యువగళం పాదయాత్రలో టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌


ఆంధ్రా ఆక్వా రంగం ‘జగన్ కష్టా’ల్లో కూరుకుపోయిందని, ఫలితంగా నష్టాల్లోకి జారుకుందని తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడగానే ఈ కష్టాలను తీరుస్తామని టిడిపి ప్రధాన కార్యదర్శ నారాలోకేష్ హామీ ఇచ్చారు.

టా క్స్ లు సీడ్, ఫీడ్, మందుల ధరలు, కరెంటు ఛార్జీలు పెంచి ఆక్వా రైతులను అప్పుల్లో ముంచుతున్నారు. టిడిపి పాలనలో ఆక్వా రంగంలో రాష్ట్రాన్ని భారతదేశంలోనే మొదటిస్థానంలో నిలిపితే, ఇపుడు పాతాళంలోకి పడిపోతున్నది, అని లోకే ష్ అన్నారు.

టిడిపి అధికారంలోకి వచ్చాక ఆక్వా రైతులు, హేచరీలను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామపి అన్నారు.

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం కోనపాపపేటలో హేచరీస్‌ రైతులు టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను యువగళం పాదయాత్రలో కలిసి వినతిపత్రం సమర్పించినపుడు ఆయన ఇలా స్పందించారు.

ఈ ఏరియాలోని సెజ్‌ ప్రాంతంలో నిర్మించబోయే పరిశ్రమలు హేచరీలను ఎలా నాశనం చేస్తాయో వారు ఆయన వివరించారు.

కాకినాడ సెజ్‌ ప్రాంతంలో 500 రొయ్యల హేచరీలు ఉన్నాయని, దేశానికి అవసరమైన రొయ్యల సీడ్‌ లో 50శాతం ఇక్కడే ఉత్పత్తి అవుతుందని, రూ. 50వేల కోట్ల నికర విదేశీ మారక ఆదాయం ఉన్న రొయ్యల పరిశ్రమలో మేము భాగమన్నారు. మాకు నాణ్యమైన సముద్రపు నీరు, గాలి, భూగర్భ జలాలు అవసరం. రొయ్యల హేచరీల్లో ప్రత్యక్షంగా లక్షలాది మంది ఆక్వారైతులు, వేలాది ఉద్యోగులు ఆధారపడి జీవిస్తున్నారని వారు ఆయనకు చెప్పారు.
దీనికి స్పందిస్తూ జోన్లతో సంబంధం లేకుండా ఆక్వా రైతులకు యూనిట్‌ కరెంటును రూ.1.50కు అందిస్తామని, హేచరీస్‌ దెబ్బతినకుండా అనువైన వాతావరణాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని, హేచరీలు ఉన్న ప్రాంతంలో నీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకుంటామని లోకేష్‌ హామీ ఇచ్చారు.
యువనేతను కలిసిన పిఠాపురం గ్రామస్తులు
పిఠాపురం నియోజకవర్గానికే చెందిన శ్రీరాంపురం గ్రామస్తులు యువనేత లోకేష్‌ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. "కాకినాడ సెజ్‌ కోసం మా గ్రామ రైతుల నుండి భూమిని సేకరించారు. సెజ్‌కు భూములిచ్చిన రైతుల్లో కొంతమందికి అన్యాయం జరిగింది. వైసిపి అధికారంలోకి వచ్చాక మా గ్రామానికి పక్కాఇల్లు కూడా రాలేదు. భూమి తీసుకున్న రైతులకు జాబ్‌ కార్డులు ఇచ్చారు. కానీ నేటికీ ఈ జాబ్‌ కార్డులపై ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వలేదు. అరకొరగా వచ్చిన పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వలేదు. సెజ్‌ కు భూములిచ్చిన రైతుల పిల్లలకు కాకుండా స్థానికేతరులకు ఉద్యోగాలిచ్చి అన్యాయం చేస్తున్నార" ని ఆవేదన వ్యక్తం చేశారు.

నారా లోకేష్‌ స్పందిస్తూ..
రాష్ట్రాభివృద్ధికి ఉపకరించే ప్రధాన ప్రాజెక్టులకు భూములను త్యాగం చేసిన రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చాక కాకినాడ సెజ్‌ పాంతంలో పరిశ్రమలు రప్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జాబ్‌ కార్డులు పొందిన వారికి ఉద్యోగాలు ఇప్పించేలా చర్యలు తీసుకుంటాం. ఇళ్లులేని ప్రతిఒక్కరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు.


మత్స్యకారులతో లోకేష్‌ ముఖాముఖి
జిఎంఆర్‌ హాస్పటల్‌ సమీపంలో క్యాంప్‌ సైట్‌ వద్ద మత్స్యకారులతో నారా లోకేష్‌ ముఖాముఖి నిర్వహించారు. వేట విరామ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే సాయం జగన్‌ ప్రభుత్వం వచ్చిన తరువాత ఇవ్వడం లేదని, మత్స్యకారులు వేటలో చనిపోతే సాయం కూడా ఇవ్వడం లేదని తెలిపారు. ఫార్మా, కెమికల్‌ కంపెనీల వ్యర్ధాలు సముద్రంలో కలవడం వలన చేపలు పెరగటం లేదన్నారు. టిడిపి హయాంలో బోట్లు, వలలు, జిపిఎస్‌ ఇతర సామగ్రి సబ్సిడీలో అందించే వారు. ఇప్పుడు జగన్‌ ప్రభుత్వం ఎటువంటి సబ్సిడీ ఇవ్వడం లేదని తెలిపారు. కాకినాడ సెజ్‌లో ఉన్న కంపెనీల్లో 70 శాతం స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తాం అని జగన్‌ హామీ ఇచ్చి మోసం చేశాడని మత్స్యకారులు లోకేష్‌కు తెలిపారు.
పైప్‌ లైన్‌ కారణంగా బోట్లు, వలలు పోయి నష్టపోతున్నాం. జగన్‌ ప్రభుత్వం ఎటువంటి నష్ట పరిహారం ఇవ్వడం లేదన్నారు. బోట్లకి ఇన్సూ్యరెన్స్‌ లేకపోవడంతో మత్స్యకారులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. డీజిల్‌ సబ్సిడీ పెంచాలి, పెద్ద బోట్లకి 8 వేల లీటర్ల డీజిల్‌ ఇవ్వాలని కోరారు. మత్స్యకారుల కుటుంబాల్లో ఆడబిడ్డల పెళ్లికి సాయం చేయాలని వారు లోకేష్‌ను కోరారు. వేట విరామం సమయంలో సాయం అందించాలన్నారు.
మత్స్యకారులకు, బోట్లుకు, వలలకు జగన్‌ ప్రభుత్వంలో ఇన్సూ్యరెన్స్‌ అందడం లేదన్నారు. డీజిల్‌ రేటు పెరిగినా జగన్‌ ప్రభుత్వం సబ్సిడీ పెంచ లేదన్నారు. వలలు రేట్లు విపరీతంగా పెరిగిపోయాయని, సముద్రంలో చనిపోతే డాక్టర్‌ సర్టిఫికేట్‌ కావాలని జగన్‌ ప్రభుత్వం అంటుందన్నారు.

ఈ సందర్భంగా లోకేష్‌ మాట్లాడుతూ..
మత్స్యకారులు కష్టాన్ని నమ్ముకొని బతుకుతారు. సాయం చేస్తే జీవితాంతం గుర్తు పెట్టుకునే వారు మత్స్యకారులు. గంగమ్మని నమ్ముకొని మత్స్యకారులు జీవిస్తారన్నారు. బోటు, వలలు, డీజిల్‌ సబ్సిడీ, బీమా, 50 ఏళ్లకే పెన్షన్, వేట నిషేదం సమయంలో సహాయం, జిపిఎస్, మోపిడ్, ఐస్‌ బాక్సులు, వ్యాన్లు అన్ని మత్స్యకారులకు సబ్సిడీలో టిడిపి అందించిందన్నారు. టిడిపి హయాంలో మత్స్యకారులకు రూ.800 కోట్లు సబ్సిడీ రూపంలో అందించామన్నారు.
తుఫాను వలన మత్స్యకారులు, రైతులు నష్టపోతే పరామర్శించే మనస్సు జగన్‌కు రాలేదన్నారు. నిన్న స్టేజ్, పరదాలు కట్టుకొని పంట పొలాలు పరిశీలించడానికి వెళ్ళాడు జగన్‌.
మత్స్యకారుల పొట్ట కొడుతూ జగన్‌ తెచ్చిన జిఓ 217 టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే రద్దు చేస్తాం. చెరువులు తిరిగి మత్స్యకారులకు అందిస్తాం. జగన్‌కు బిసిలు అంటే చిన్న చూపు. 26 వేల మంది బిసిలపై కేసులు పెట్టారని విమర్శించారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బిసిల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తాం. టిడిపి హయాంలో మత్స్యకారులు వేటకు వెళ్ళి చనిపోతే వెంటనే ఆ కుటుంబానికి 5 లక్షల ఆర్ధిక సాయం అందించే వాళ్ళం. జగన్‌ ప్రభుత్వం ఎటువంటి సాయం అందించడం లేదు.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే కెమికల్, ఫార్మా కంపెనీల వ్యర్ధాలు సముద్రంలో కలవకుండా పొల్యూషన్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్‌లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.


జగన్‌ ప్రభుత్వం ఆక్వా రంగాన్ని, హేచరీచ్‌ను చంపేసిందని, పొల్యూషన్‌ లేని కంపెనీలు తీసుకొచ్చి స్థానికంగా యువతకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో ఎలా అయితే బోట్లు, ఇంజిన్, వలలు, జీపీఎస్, ఐస్‌ బాక్సులు ఎలా అయితే ఇచ్చామో, తిరిగి సబ్సిడీ లో అందిస్తామన్నారు. ఎన్నికల ముందు జగన్‌ అనేక హామీలు ఇచ్చి మత్స్యకారులను మోసం చేశాడు. 45 ఏళ్లకే పెన్షన్, హౌసింగ్‌ లోన్‌ కింద 5 లక్షలు, కోల్డ్‌ స్టోరేజ్‌లు ఏర్పాటు చేస్తానని చెప్పి మోసం చేసాడన్నారు. పైప్‌ లైన్‌ కారణంగా నష్టపోతున్న మత్స్యకారులను టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆదుకుంటామన్నారు. మత్స్యకారుల పిల్లల చదువుల కోసం 3 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామని, ప్రభుత్వం వచ్చిన వెంటనే మరో 5 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తామన్నారు.

ఉల్లిగడ్డకు బంగాళా దుంపకు తేడాతెలియని జగన్‌
ఉల్లి గడ్డకి , బంగాళాదుంపకు తేడా తెలియని వ్యక్తి మనకి ముఖ్యమంత్రి అయ్యాడన్నారు. టెన్త్‌ పేపర్లు కొట్టేసినా పాస్‌ కానీ వ్యక్తి జగన్‌ అని, ఎక్కడ చదివాడో తెలియదు, పాదయాత్ర చేసింది జగనా లేక డూప్‌నా అనే అనుమానం నాకు వచ్చిందని ఎద్దేవా చేశారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్‌ పెట్టిన అనవసర నిబంధనలు తొలగించి వేటకు వెళ్లిన మత్సకార కుటుంబాలను ఆదుకుంటామన్నారు. కుడి చేత్తో 10 రూపాయిలు ఇచ్చి ఎడమ చేత్తో 100 రూపాయిలు జగన్‌ కొట్టేస్తున్నాడన్నారు. విధులు, నిధులు లేని కార్పొరేషన్లు పెట్టి బిసిలను జగన్‌ మోసం చేసాడని, బిసి మంత్రి పేషిలో పనిచేసే ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే దిక్కు కూడా లేదన్నారు. నేను వైసిపి వారికి, మంత్రికి ఓపెన్‌ ఛాలెంజ్‌ చేస్తున్నా.. ఎవరి హయాంలో మత్స్యకారులకు మేలు జరిగిందో చర్చకు నేను సిద్ధంగా ఉన్నానన్నారు.



Next Story