టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్‌ ఆ పార్టీ శ్రేణులకు ఎలా భరోసా ఇస్తున్నారనే దానికి ఇదే నిదర్శనం.


టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్‌ ఓ టీడీపీ కార్యకర్త మరణాన్ని జీర్ణించుకోలేక పోయారు. ఆ కార్యకర్త మరణం విన్న తర్వాత తల్లడిల్లి పోయారు. ఆ బాధను తట్టుకోలేక ఎమోషనలయ్యారు. మిస్‌ యూ తమ్ముడూ అంటూ సోషల్‌ మీడియాలో లోకేష్‌ పెట్టిన ఎమోషన్‌ల్‌ పోస్టు ఇప్పుటు టీడీపీ శ్రేణుల్లో చక్కర్లు కొడుతోంది.

తెలుగుదేశం పార్టీ కార్యకర్త శ్రీను ఆత్మహత్యపై తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. అన్నా.. అన్నా అని పిలిచే వాడివి. ఎవరికి ఏ కష్టం వచ్చినా సహాయం చేయాలని మెస్సేజ్‌లు పెట్టేవాడివి. నా పుట్టిన రోజు, నా పెళ్లి రోజులను ఓ పండుగలా జరిగిపే వాడివి. నీకు ఆపద వస్తే ఈ అన్నకి ఒక్క మెస్సేజ్‌ చేయాలనిపించలేదా? దిద్దలేని చాలా పెద్ద తప్పు చేశావు తమ్ముడూ. మిస్‌ యూ. ఆత్మాభిమానం ఉండొచ్చు. ఆత్మ..హత్య చేసుకునేంతగా కాదు. నువ్వు బలవర్మణానికి పాల్పడిన విచారకర సంఘటన సోషల్‌ మీడియా ద్వారా తెలుసుకున్న వెంటనే.. నిన్ను బతికించుకునేందుకు చేయని ప్రయత్నం లేదు. సారీ శీను.. నీకున్న కష్టమేంటో నాకెప్పుడూ చెప్ప లేదు. నీకు కలిగిన నష్టమేంటో ఏ రోజూ నాకు తెలియనివ్వలేదు. నువ్వు లేవు. కానీ నీ కుటుంబానికి నేనున్నాను. మీ అన్నగా ఆ కుటుంబానికి అండగా ఉంటూ నీ బాధ్యతలను నెరవేరుస్తాను. అంటూ ఎమోషన్‌ల్‌ పోస్టు పెట్టారు.
దానిని ఇంకా కొనసాగిస్తూ..తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నా అభిమానులు, సోషల్‌ మీడియా యాక్టివిస్టులకు నా విన్నపం. అప్పులో, అనారోగ్యమో, ఆత్మాభిమానమో, కుటుంబ సమస్యలో.. ఏమైనా కానివ్వండి.. కుటుంబం, స్నేహితులు, బందువులు, పార్టీలో హితులు.. ఎవరితోనైనా షేర్‌ చేసుకోండి. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. బతికే ఉందాం.. మరి కొందరిని బతికించుకుందాం. దయచేసి ఇటువంటి తప్పుడు నిర్ణయాలు ఎవ్వరూ తీసుకోవద్దు. అంటూ తన పార్టీ శ్రేణులకు సూచించారు.
Next Story