జగన్ ప్రభుత్వంలో కీలక నేతగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డిపై లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఆయనను ఇమిగ్రేషన్ అధికారులు అడ్డగించారు.
బాలీవుడ్ నటి కాదంబరి జెత్వానిపై వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సజ్జల రామకృష్ణారెడ్డిపై లుక్ అవుట్ నోటీసు జారీ అయింది. దీంతో ఆయనను ఢిల్లీ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. తనను అడ్డుకోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. తాను ఇప్పుడే విదేశాల నుంచి వచ్చానని వారికి వివరించారు. దీంతో ఆయనను ఏపీకి వెళ్లేందుకు అధికారులు అనుమతించినట్టు సమాచారం.
అయితే, అప్పటికే హైదరాబాద్ వెళ్లే విమానం టేకాఫ్ కావడంతో మరో విమానం కోసం వేచి చూడాల్సి వచ్చింది. జెత్వాని కేసులో సజ్జలతోపాటు వైఎస్సార్‌సీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాశ్, తలశిల రఘురాంపై పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీచేసినట్టు తెలిసింది.
కాదంబరి జెత్వానీ కేసులు సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆమెను ప్రత్యేకంగా విజయవాడ పిలిపించి ఆమె ద్వారా పోలీసులకు కంప్లైంట్ ఇప్పించి దర్యాప్తు ప్రాంభించారు. తనపై అనవసరమైన ఆరోపణలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అప్పట్లో సజ్జల టీడీపీ వారిని హెచ్చరించారు.
ఈ కేసులో ఇప్పటికే ముగ్గరు ఐపీఎస్ అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఒక క్రిమినల్ చేసులో ముగ్గరు సీనియర్ ఐపీఎస్ లు సస్పెండ్ కావడం సంచలనం సృష్టించింది. విచారణలో మరికొందరు వైఎస్సార్సీపీ నాయకులపై కేసు నమోదయ్యే అవకాశం వుంది. సీఎంవో నుంచి వచ్చిన ఆదేశాల మేరకే తాము ఈ కేసులో చర్యలకు ఉపక్రమించినట్లు అప్పట్లో విజయవాడ సీపీగా వ్యవహరించిన కాంతిరాణా తాతా వెల్లడించారు.
Next Story