బంగాళాఖాతంలో  అల్పపీడనం, ఈరోజు వర్షాలు
x

బంగాళాఖాతంలో అల్పపీడనం, ఈరోజు వర్షాలు

లో తట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు



వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఇవాళ ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఎన్టీఆర్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కోనసీమ, తూ.గో, ప.గో, కృష్ణా, గుంటూరు, బాపట్ల, కర్నూలు, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇదే సమయంలో గోదావరిలో నీటి మట్టం పెరగుతూఉందని అధికారులు హచ్చరిక జారీ చేశారు. భద్రాచలం వద్ద గోదావరి వరద 43.6 అడుగుల నీటి మట్టం నమోదయింది. ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 8.36లక్షల క్యూసెక్కులు. ఆంధ్రప్రదేశ్ లోని 6 జిల్లాల అధికార యంత్రంగాన్ని అప్రమత్తం చేశారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల సంస్థ హెచ్చరిస్తున్నది.


ఇక తెలంగాణకు సంబంధించి కూడా అధికారులు ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. లోయర్ మానేరు డ్యామ్ నీటి సామర్థ్యం 24.034 TMC కి గాను ప్రస్తుతానికి 19.20 TMC కి చేరుకున్నది . నిన్నటి వాతావరణ మరియు ఎగువ పరివాహక ప్రాంత నీటి ప్రవాహం పరిస్థితులును బట్టి ప్రాజెక్ట్ వరద గేట్లు ఎత్తి, నీటిని దిగువకు వదిలే విషయం ముందస్తు హెచ్చరిక చేశారు. ప్రస్తుతానికి లోయర్ మానేరు డ్యామ్ ఎగువ పరివాహక ప్రాంతంలో నీటి ప్రవాహం నిలకడగా ఉండటం వలన పూర్తి సామర్థ్యంనకు చేరుటుకు కొంత సమయం పడుతుంది.

ప్రస్తుత నీటి ప్రవాహం (Inflows) 21125 క్యూసెక్కులు ఒకవేళ ఎగువ పరివాహక ప్రాంతం నుండి ప్రవాహం పెరిగినచో ప్రాజెక్ట్ వరద గేట్లు ఎత్తి, నీటిని దిగువకు వదిలే విషయం తెలియజేయగలమని అధికారులు చెప్పారు.

Read More
Next Story