ఎవరు అధికారంలో ఉంటే వారికి అనుకూలంగా పేర్లు మార్చుకోవడం పరిపాటిగా మారింది.


విజయవాడ చారిత్రన నేపథ్యం కలిగిన నగరం. ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయ నగరంగా ప్రఖ్యాతి పొందింది. వ్యాపార నగరంగా కూడా దీనికి పేరుంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ నగరంగా గుర్తింపు లభించింది. దీనికి తోడు రాజధాని అమరావతి దీనికి సమీపంలో ఉండటంతో విజయవాడ స్థాయి మరింత పెరిగింది. రాష్ట్ర గవర్నర్, మంతులు, అధికారులు వంటి ప్రముఖులు విజయవాడలో నివాసాలు ఉండటం వల్ల దీని ప్రఖ్యాతులు పెరిగాయి. వెరసి రాజధాని నగరంగా రూపాంతరం చెందింది.

విజయవాడ నగరంలో మహానాడు అనే ఒక రోడ్డు ఉంది. విజయవాడ నగరం అంటే రెండు రోడ్డులు గుర్తొస్తాయి. బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు, బీసెంట్‌ రోడ్డు ప్రముఖమైనవి. బీసెంట్‌ రోడ్డు బందరు రోడ్డు ఏలూరు రోడ్లను కలుపుతూ ఏర్పడిన వ్యాపార రహదారి. ప్రముఖ వ్యాపార సంస్థలు, పెద్ద పెద్ద షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, ఫోర్‌ రమ్‌లు, ప్రముఖ హోటల్స్‌ ఈ రెండు ప్రాంతాల్లోనే లొకేట్‌ అయ్యుంటాయి. వీటితో పాటు అంతటి ప్రాచుర్యం పొందిన మరొక రోడ్డు ఉంది. అదే మహానాడు రోడ్డు.
బెంజిసర్కిల్‌ మదిరిగా ఎప్పుడూ ట్రాఫిక్‌ రద్దీగా ఉండే కూడళ్లల్లో మహానాడు రోడ్డు జంక్షన్‌ కూడా ఒకటి. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ నుంచి జాతీయ రహదారి 16ను క్రాస్‌ చేస్తూ ఆటోనగర్‌లోకి వెళ్తుంది. దీనికి ఎప్పటి నుంచో మహానాడు రోడ్డుగా దీనిని పిలుస్తుంటారు. తెలుగుదేశం పార్టీ ప్లీనరీ సమావేశాలను మహానాడుగా పిలుస్తారు. ఈ ప్రాంతంలో ఓ సారి మహానాడు నిర్వహించారు. అప్పటి నుంచి దీనికి మహానాడు రోడ్డుగా పేరు స్థిరపడింది.
అయితే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన దీని పేరును మార్చే ప్రయత్నం చేశారు. మహానాడు అంటే తెలుగుదేశం పార్టీ స్పురిస్తుండటంతో ఆ పేరు మార్చాలనే ప్రయత్నాలు చేపట్టారు. ప్రముఖ వైసీపీ నేత దేవినేని అవినాష్‌ తన పలుకుబడిని ప్రయోగించి మహానాడు రోడ్డు పేరును మార్చారు. మహానాడు రోడ్డుకు బదులు తన తండ్రి.. దేవినేని రాజశేఖర్‌ రోడ్డుగా పేరు మార్చారు.
అయితే దీనిపై అప్పట్లో స్థానికులు దీనిని తీవ్రంగానే వ్యతిరేకించారు. మహానాడు పేరునే కొనసాగించాలని స్థానికులు పట్టుబట్టారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశం తెరపైకొచ్చింది. దేవినేని రాజశేఖర్‌ రోడ్డు పేరును మార్చేసి, పాత మహానాడు రోడ్డు పేరునే పునరుద్దరించాలని స్థానికులు ప్రభుత్వ పెద్దలకు విజ్ఞప్తులు చేశారు. ఈ నేపథ్యంలో విజయవాడ తూర్పు నియోజక వర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు దీనిపై స్పందించారు. మహానాడు రోడ్డు పేరును పునరుద్దరించాలని మునిసిపల్‌ కమిషనర్‌కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో మహానాడు రోడ్డును పునరుద్దరించేందుకు నిర్ణయం తీసుకున్నారు. మహానాడు రోడ్డును యధాతధంగా ఉంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Next Story