Maharashtra CM on Tirumala | ఒకే మాటతో తేల్చేసిన మహారాష్ట్ర సీఎం
x

మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ కు శ్రీవారి చిత్రపటం బహూకరిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు

Maharashtra CM on Tirumala | ఒకే మాటతో తేల్చేసిన మహారాష్ట్ర సీఎం

తిరుమలను అర్థం చేసుకుంటే చాలు. ఆలయాల నిర్వహణకు అదే కేంద్రం. ఈ మాటలతో ఐటీసీఎక్స్ నిర్వాహకులను ఆలోచనలో పడేశారు.


ఆలయాల నిర్వహణ, సాంస్కృతిక పునరుజీవం పై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సాంస్కృతిక పునరుజ్జీవానికి ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని ఆయన కొనియాడారు. ప్రధాన ఆలయాల నిర్వహణ, రద్దీ నియంత్రణపై ఐటిసిఎక్స్ శిక్షణ ఇవ్వాల్సిన అవసరాన్ని మహారాష్ట్ర సీఎం ప్రత్యేకంగా గుర్తు చేశారు. ఈ విషయాలను అధ్యయనం చేయడానికి తిరుమల ఓ యూనివర్సిటీలా ఉపయోగపడుతుందని మాట చెప్పకనే చెప్పినట్లు కనిపిస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా దేవాలయాల పర్యావరణ వ్యవస్థ, నెట్వర్కింగ్ (net working), రద్దీ నియంత్రణ (crowd management), అన్నప్రసాదాల పంపిణీ, ఆలయ పర్యాటకాన్ని మరింత అభివృద్ధి పరిచే లక్ష్యంగా అంతర్జాతీయ దేవాలయాల సదస్సు, ఎక్స్పో (ITCX-2025) తిరుపతిలో మూడు రోజుల సదస్సు సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. మహారాష్ట్ర బిజెపి శాసనమండలి చీఫ్ విప్ ప్రసాద్ లాడ్, టెంపుల్ కనెక్ట్ (Temple connect) వ్యవస్థాపకుడైన అదే రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్సీ గిరేష్ కులకర్ణి ఐటీసీ ఎక్స్ 2025 రెండో అంతర్జాతీయ సదస్సు తిరుపతి ఆధ్యాత్మిక కేంద్రంలోని కరకంబాడి మార్గంలో ఉన్న ఆశ కన్వెన్షన్ సెంటర్ వేదికగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి పాలిత మహారాష్ట్ర నుంచి సీఎంగా ప్రాతినిధ్యం వహిస్తున్న దేవేంద్ర ఫడ్నవిస్ హాజరై మాట్లాడుతూ, ఆలయాల అనుసంధానం, పర్యాటక అభివృద్ధిపై చేసిన వ్యాఖ్యలు నిర్వాహకులను కాస్త ఇరకాటంలో పెట్టినట్లే కనిపిస్తోంది. ఆయన ఏమన్నారంటే..
"ఆలయాల నిర్వహణకు, వ్యవస్థకు తిరుమల ఆదర్శం" అని స్పష్టంగా ప్రకటించడం గమనించదగిన విషయం. అంటే, తిరుమలలో రద్దీ నియంత్రణ. క్యూల నిర్వహణ. అన్న ప్రసాదాల పంపిణీ, పర్యావరణం. యాత్రికులకు కల్పిస్తున్న సదుపాయాలు భేషుగ్గా ఉన్నాయని ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనించదగిన విషయం. టీటీడీ అనుసరిస్తున్న పద్ధతులు, విధానాలు, పరిపాలన వ్యవహారాలు కూడా దేశంలోని మిగతా ఆలయాలు పాటించాల్సిన విధంగా పాఠాలు చెబుతున్నాయి అనే విషయాన్ని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ మాటలు స్పష్టం చేశాయి. అంటే, ప్రపంచంలోని 58 దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు, 111 మంది వక్తలు, 15 వర్క్ షాపులు, నాలుగు సెంటర్ నిర్వాహకులను ఆలోచనలో పడేశారనే విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది.
"దేశంలోని ప్రధాన ఆలయాలే కాదు. ధార్మిక సంస్థలకు కూడా తిరుమల దిక్సూచి లాంటిది" అని మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ మాటల సారాంశంగా కనిపిస్తోంది.
తిరుపతిలో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సులో మహా సీఎం ఫడ్నవిస్ సనాతనధర్మంపై మాట్లాడుతూ..
300 ఏళ్ల కిందటే రాజమాత అహల్యాదేవి తన పరనాకాలంలో అనేకమంది దురాక్రమాదారుల ఆగడాలను అడ్డుకున్న విషయాన్ని గుర్తు చేయడం ద్వారా హిందుత్వాన్ని కాపాడుకునేందుకు ఇతర మతాల నుంచి ఎదురవుతున్న ముప్పును ఎదుర్కోవాలనే సందేశం ఇచ్చినట్లే కనిపించింది.
సనాతన ధర్మం పరిరక్షణలో అహల్యా దేవి మార్గంలోని ఛత్రపతి శివాజీ కూడా నడిచారంటూ, ఈ యజ్ఞాన్ని ప్రధాని నరేంద్ర మోడీ మరింత ముందుకు తీసుకెళ్తున్నారని పొగడ్తలు కురిపించారు. సామాన్యులు కూడా సనాతన ధర్మానికి వారసులమని చెప్పుకునే పరిస్థితి ప్రధాని మోదీ కల్పించాలని ఆయన ప్రశంసలు కురిపించారు. ఉత్తరప్రదేశ్ త్రివేణి సంగమం ప్రయాగ్రాజ్ వద్ద జరుగుతున్న మహా కుంభవేళాలో 50 కోట్ల మందికి పైగా పవిత్ర స్నానం ఆచరిస్తే, ఈ సంఖ్య అమెరికా ఐరోపాఖ కొండల్లోని కొన్ని దేశాల జనాభా కంటే ఎక్కువ అని ఆయన అభివర్ణించారు. సనాతన ధర్మంలో తారతమ్యం ఉండదని చెబుతూ, అనాదిగా వస్తున్న ఈ ధర్మాన్ని ఎవరు మార్చలేకపోయారు. అది సాధ్యం కూడా కాదు. అని మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ వ్యాఖ్యానించారు.
ఆలయ సంపదకు నిలయం
దక్షిణ భారతదేశంలో అద్భుతమైన ఆలయాలు. శిల్ప కళలకు నిలయంగా ఉన్నాయని మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ గుర్తు చేశారు. ఆయన ప్రసంగం సాగినంత సేపు ఆలయ వ్యవస్థకు తిరుమల కేంద్ర బిందువు అనేది చాలా స్పష్టంగా చెప్పారు. అంతేకాకుండా విజయనగర సామ్రాజ్యం లో శ్రీకృష్ణదేవరాయలు అంతకుముందు చోళులు నిర్మించిన ఆలయాల ఖ్యాతి ఇప్పటికీ చెక్కుచెదరని విధంగా సాంస్కృతిక వైభవానికి దివిటీలా నిలిచాయని వ్యాఖ్యానించారు.
విదేశాల్లో పెరిగిన వైభవం
దేశంలో బ్రిటిష్ పాలకులు ఉన్న రోజుల్లోనే 50 వేల సాంస్కృతిక విద్యా కేంద్రాలుగా ఆలయాలు విరాజిల్లాయని మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ చరిత్రను ప్రస్తావించారు. ఆరోజుల్లో ఇంగ్లాండ్లో 2000 మాత్రమే ఆలయాలు ఉండేవని గుర్తు చేశారు. ఈ పరిస్థితి పూర్తిగా మారిందని అందుకు నిదర్శనం.. భారతీయ సనాతన ధర్మం, సంస్కృతి సంప్రదాయాలు చూడడం, తెలుసుకునేందుకు వస్తున్న వారిలో 55 శాతం విదేశీ పర్యాటకులే అని వివరించారు. మహారాష్ట్ర సీఎం ప్రస్తావించిన అంశాలన్నీ ఆలయ వ్యవస్థకు. నిర్వహణకు తిరుమలకు మించిన ఆధ్యాత్మిక క్షేత్రం లేదనే విషయాన్ని చాలా స్పష్టంగా ప్రస్తావించారు. ఈయన మాటల ద్వారా అంతర్జాతీయ సదస్సు నిర్వాహకులు, ప్రతినిధులు బుర్ర బద్దలు కొట్టుకోకుండా, ప్రశాంతంగా తిరుమల ఆలయ నిర్వహణ వ్యవస్థను పరిశీలిస్తే చాలు అనే విధంగానే సూచన చేసినట్లు కనిపిస్తోంది.
Read More
Next Story