
Chiru
మెగాస్టార్ చిరంజీవికి బ్రిటన్ పార్లమెంటు ప్రతిష్టాత్మక అవార్డు
మెగాస్టార్ చిరంజీవి సిగలో మరో ప్రతిష్టాత్మక అవార్డు చేరింది. బ్రిటన్ పార్లమెంటు ఈ ప్రముఖ నటుడు చిరంజీవికి జీవిత సాఫల్య పురస్కారం అందించాలని నిర్ణయించింది.
మెగాస్టార్ చిరంజీవి సిగలో మరో ప్రతిష్టాత్మక అవార్డు చేరింది. బ్రిటన్ పార్లమెంటు ఈ ప్రముఖ నటుడు చిరంజీవికి జీవిత సాఫల్య పురస్కారం అందించాలని నిర్ణయించింది. నాలుగు దశాబ్దాల కాలంలో 150కి పైగా సినిమాలలో నటించిన మెగాస్టార్ కు ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ అవార్డలనేకం దక్కాయి. ఇప్పుడు బ్రిటన్ పార్లమెంటు ఆయన సినీ రంగానికి అందిస్తోన్న విశేష సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు ప్రకటించింది. మార్చి 19న చిరంజీవి ఈ అరుదైన గౌరవాన్ని అందుకోనున్నారు.
చిరంజీవి 1955 ఆగస్టు 22న ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కొణిదెల వెంకటరావు, అంజనా దేవి దంపతులకు జన్మించారు. ఆయన పూర్తి పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్ రావు. ఆయన తండ్రి కొణిదెల వెంకటరావు కానిస్టేబుల్‌గా పనిచేశారు.
చిరంజీవి నిడదవోలు, గురజాల, బాపట్ల, పొన్నూరు, మంగళగిరి, మొగల్తూరులలో పాఠశాల విద్యను అభ్యసించారు. NCC క్యాడెట్ గా 1970లలో న్యూఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొన్నారు. ఆయనకు చిన్నప్పటి నుంచీ నటనపై ఆసక్తి ఉండేది. ఆయన ఒంగోలులోని C. S. R. శర్మ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. నర్సాపురంలోని Y N కళాశాల నుండి కామర్స్ లో పట్టా పొందిన తర్వాత చిరంజీవి చెన్నైకి వెళ్లి 1976లో నటనా వృత్తిని కొనసాగించడానికి మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరారు.
‘పునాదిరాళ్ళు’తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు చిరంజీవి. కెరీర్ ఆరంభంలో ఎన్నో సవాళ్లు, అవమానాలు ఎదుర్కొని స్టార్ హీరోగా ఎదిగారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తనదైన నటన, డ్యాన్సులతో యువతను ఉర్రూతలూగించారు. బాక్సాఫీస్ రికార్డులు క్రియేట్ చేశారు. 9 ఫిలింఫేర్, 3 నంది అవార్డులతోపాటు ఎన్నో ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్నారు. సినీ రంగానికి ఆయన చేస్తున్న సేవలు గుర్తించిన ప్రభుత్వం 2006లో ఆయనకు పద్మభూషణ్, 2024లో పద్మవిభూషణ్ అందించి గౌరవించింది. ఇటీవల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో ఆయన చోటు దక్కించుకున్నారు. 156 చిత్రాలు.. 537 పాటలు.. 24 వేల స్టెప్పులతో అలరించినందుకు ఈ రికార్డు దక్కింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన ‘విశ్వంభర’ కోసం వర్క్ చేస్తున్నారు.
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఆ తర్వాత కాంగ్రెస్ లో విలీనం చేశారు. రాజ్యసభ సభ్యునిగా ఉంటూ కేంద్ర మంత్రివర్గంలో చేరారు. ఇప్పుడాయన తమ్ముడు పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో 21 సీట్లను గెలిచి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు.
1980 ఫిబ్రవరి 20న, చిరంజీవి తెలుగు హాస్య నటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖను వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు, సుష్మిత, శ్రీజ. ఒక కుమారుడు రామ్ చరణ్.
Next Story