
విశాఖలో స్వల్పంగా కంపించిన భూమి
భయంతో ఉరుకులు పరుగులు తీసిన ప్రజలు
విశాఖపట్నంలో ఈ తెల్లవారుజామున ఐదు సెకన్లపాటు భూమి స్వల్పంగా కంపించింది. దీంతో ప్రజలు ఏమి జరిగిందో అర్థం కాక ఉరుకులు పరుగులు పెట్టారు.
విశాఖ నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారుజామున స్వల్పంగా భూమి కంపించింది. ఆరిలోవ, అడవివరం, మాధవధార, అక్కయ్యపాలెం, హెచ్‌బీ కాలనీ, అల్లిపురం, ఎండాడ, భీమిలి, పెందుర్తిలో తెల్లవారుజామున 4.18 గంటలకు స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి. పెద్ద శబ్దంతో భీమిలి బీచ్ రోడ్‌లో భూమి కంపించింది. సింహాచలంలోనూ స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో ఇళ్ల నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు.
విశాఖపట్నంలో ఉదయం 4.18 నుండీ 4.20 గంటల లోపు కొన్ని సెకండ్స్ పాటు భూమి కంపించింది.. నాలుగైదు సెకన్ల పాటు "భూకంపం" సంభవించినట్లు పలు ప్రాంతాల్లో సమాచారం.. నగర ప్రజలు గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో, భూమి కంపించింది బీచ్ రోడ్, సీతమ్మధార, గోపాలపట్నంలో లో భూమి కంపించినట్లు తెలుస్తోంది. విజయనగరం వాసులు కూడా భూమి కంపించినట్లు చెబుతున్నారు.
పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

