నాయక్ శవపేటికకు భుజం పట్టిన మంత్రి లోకేష్..
x
మరళీనాయక్ శవపేటిక మోస్తున్న మంత్రి నారా లోకేష్

నాయక్ శవపేటికకు భుజం పట్టిన మంత్రి లోకేష్..

వీరజవాన్ మురళీ నాయక్ కు అధికార లాంఛనాలతో వీడ్కోలు పలికారు. మంత్రులు, ప్రజలు ఘనంగా నివాళులర్పించారు.


కాశ్మీర్ యుద్ధభూమిలో ప్రాణక్యారణ చేసిన వీర జవాన్ మురళీ నాయక్ భౌతిక కాయానికి కల్లి తండాలో ఆదివారం అధికార లాంఛనాలతో తుది వీడ్కోలు పలికారు. మిలిటీ జవాన్లు గౌరవ వందనం సమర్పించారు.

అంతకుముందు ఇంటి వద్ద కుమారుడు మురళీనాయక్ అంతిమయాత్ర ప్రారంభానికి ముందు శవపేటిక వద్ద తండ్రి శ్రీరాం నాయక్ హృదయ విదారకంగా రోధించడం అందరినీ కంటతడి పెట్టించింది.

"ఒక్కగానొక్క కొడుకు మురళీనాయక్ ను కష్టపడి చదివించా. మమ్మిల్ని ఇంత తొందరగా వదలి వెళ్లిపోతాడని ఊహించలేదు" అని రోధిస్తుంటే, తల్లి జ్యోతిబాయిని ఓదార్చడం అక్కడున్న వారికి సాధ్యం కాలేదు. బరువెక్కిన హృదయాలతో జనంతో కలిసి వారు అంతిమయాత్రలో పాల్గొన్నారు.


వీరజవాన్ నివాసం నుంచి ప్రారంభమైన అంతమయాత్రకు అశేష ప్రజానీకం హాజరయ్యారు. దారిపొడవునా, మురళీ శవపేటికపై పూలు చల్లూతు, వనివాళులర్పించారు.

మిలిటరీ జవాన్లతో పాటు మంత్రి నారా లోకేష్ కూడా వీరజవాన్ శవపేటిక మోశారు. అంతకుముందు ఉదయమే నాయక్ నివాసానికి చేరుకున్న మంత్రి లోకేష్ వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకుని అన్ని ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు.


శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల మండలం గడ్డం తండ పంచాయతీ కల్లి తండ కు చెందిన ఎం జ్యోతిబాయి, శ్రీరామ్ నాయక్ దంపతుల ఏకైక కొడుకు మురళి నాయక్ NCC cadet. డిగ్రీ చదివిన నాయక్ రెండున్నర ఏళ్ల కిందట అగ్ని వీర్ ఎంపికకు వెళ్లి సైన్యంలో పాదం మోపారు. ఈయన అవివాహితుడు.

కాశ్మీర్ లోని పహల్గాం వద్ద పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమంతో 28 మంది అమాయక భారత పౌరులు ప్రాణాలు వదిలారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం కొన్ని రోజులు సమాలోచనలు సాగించిన తర్వాత ' ఆపరేషన్ సింధూర్' పేరిట పాకిస్తాన్ పై సైనిక చర్యకు దిగిన విషయం తెలిసిందే.
కల్లి తండా నుంచి మిలిటరీ కి ఎంపికైన ఎం మురళి నాయక్ పంజాబ్ లో ఉండగా, యుద్ధ వాతావరణం నేపథ్యంలో మిగతా జవాన్లతో కలిసి కాశ్మీర్ యుద్ధభూమిలోకి వెళ్లారు. రెండవ రోజే అంటే గురువారం రాత్రి కాశ్మీర్ సరిహద్దులో మురళి నాయక్ వీరమరణం చెందారు.
ఆ వీర జవాన్ మురళి నాయక్ భౌతిక కాయం ఉన్న పేటిక శనివారం రాత్రి స్వగ్రామం కల్లి తండాకు సైనిక అధికారులతో కలిసి రాష్ట్ర మంత్రులు తీసుకువచ్చారు.
శోకసంద్రం గా తండా
వీర జవాన్ మురళి నాయక్ భౌతిక గాయం ఉంచిన సేవ పేటిక వద్ద మంత్రులు, జిల్లా అధికారులు నిదానంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన అశేష ప్రజానికం కన్నీటితో నివాళులర్పించింది. ఆ తర్వాత ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు మురళి నాయక్ శివపేటిక వద్ద సైనికులు గౌరవ వందనం సమర్పించారు.
మురళి నాయక్ అంతిమ యాత్రలో వేలాదిమంది పాల్గొన్నారు. దారి పొడుగునా నాయక్ శివ పేటికపై ప్రజలు పూల వర్షం కురిపించారు.
స్వయంగా పర్యవేక్షించిన మంత్రి లోకేష్
వీర జవాన్ మురళి నాయక్ నివాళులు అర్పించడానికి మంత్రి నారా లోకేష్ ఆదివారం ఉదయం కల్లి తండాకు చేరుకున్నారు. అంతిమ ప్రయాత్ర ప్రారంభం అయ్యే వరకు వారి వంటి వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లను ఆయనే స్వయంగా పర్యవేక్షించారు. ఆ తరువాత వీర జవాన్ ఇంటి నుంచి మురళి నాయక్ శవపేటికను ఆర్మీ జవాన్లతో పాటు మంత్రి నారా లోకేష్ కూడా భుజం అందించారు.

వీర జవాన్ కుటుంబానికి ఉన్న సొంత వ్యవసాయ పొలంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. అక్కడ సత్యసాయి జిల్లా పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. మురళి నాయక్ కు చివరిసారి సెల్యూట్ చేసిన మిలిటరీ సిబ్బంది, శివపేటికపై ఉన్న జాతీయ జెండాను నాయక్ తల్లిదండ్రులకు అప్పగించి వందనం సమర్పించారు. వీర జవాన్ మురళి నాయక్ అంతిమయాత్రలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులుగా మంత్రులు హాజరయ్యారు.
మంత్రులు అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, సవిత, సత్యకుమార్ యాదవ్, ఎంపీ బీకే పార్థసారథి, మాజీ మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు పల్లె సింధూరారెడ్డి, ఎంఎస్ రాజు, జేసీ ప్రభాకర్ రెడ్డి తో ప్రజలు, మీద పార్టీల నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, గిరిజన సంఘాల నేతలు కూడా అంతేమయాత్రలో నడిచారు.
Read More
Next Story