పార్టీ క్యాడర్ తో మంత్రి లోకేష్ భేటీకోసం...
x

పార్టీ క్యాడర్ తో మంత్రి లోకేష్ భేటీకోసం...

మంత్రి లోకేష్ తిరుపతికి చేరుకున్నారు. విద్యార్థినులు, పార్టీ శ్రేణులతో వేర్వేరుగా ఆయన ముఖాముఖి నిర్వహించనున్నారు.


రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కొద్ది సేపటి కిందటే తిరుపతికి చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయంలో ఆయనకు ఎమ్మెల్యేలు అధికారులు ఘనస్వాగతం పలికారు. నారా లోకేష్ వెంట తిరుపతి జిల్లా ఇన్చార్జి మంత్రి, రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మాత్యులు అనగాని సత్యప్రసాద్ కూడా ఉన్నారు.


వారికి రాష్ట్ర రవాణా శాఖ, యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాదరెడ్డి, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్థన్ రాజు, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి, తిరుపతి, చంద్రగిరి,సత్యవేడు, నగరి ఎమ్మెల్యేలు ఆరని శ్రీనివాసులు, పులివర్తి వెంకట ముని ప్రసాద్ (నాని), కోనేటి ఆదిమూలం, భాను ప్రకాష్, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, మాజీ ఎంఎల్ఏ సుగుణమ్మ, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం విసీ ఉమా, ఎస్వీ యూనివర్సిటీ విసి, ఆర్డిఓ భానుప్రకాషరెడ్డి, అధికారులు, ప్రజా ప్రతినిదులు మంత్రికి స్వాగతం పలికారు.

తిరుపతి నగరంలో బుధవారం మంత్రి నారా లోకేష్ పర్యటన షెడ్యూల్ ఇది.

ఉదయం 9.30 నుంచి 12.30 గంటల వరకూ తిరుపతి టిడిపి కార్యాలయంలో ఉంటారు. టీడీపీ కూటమిని అధికారంలోకి తీసుకుని రావడంతో ఎన్నికల్లో ప్రతిభ కనబరిన ఉత్తమ బూత్, యూనిట్, క్లస్టర్, మండల స్థాయి నాయకులు, ఉత్తమ కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశం అవుతారు. వారికి భవిష్యత్ కార్యాచరణపై దిశా నిర్దేశం చేస్తారు.
మధ్యాహ్నం 2.15 నుంచి 2.45 గంటల వరకూ ఎస్వీ పద్మావతి మహిళా యూనివర్సిటీ లో ఏడు కోట్ల రూపాయలతో నిర్మించిన మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియం ను ప్రారంభిస్తారు.
మధ్యాహ్నం 3.00 నుంచి 3.45 గంటల వరకూ ఎస్వీ పద్మావతి మహిళా యూనివర్సిటీ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు.
సాయంత్రం 4.20 నుంచి 6.00 గంటల వరకూ ఆశా కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ దేవాలయాల సదస్సు లో పాల్గొంటారు. 6-30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని, తిరిగి విజయవాడకు బయలుదేరి వెళతారు.


Read More
Next Story