ఇదేంటీ, పవన్ కల్యాణ్ కి ఇంత క్రేజా! పంకజ్ త్రిపాఠీ కామెంట్ వైరల్
x

ఇదేంటీ, పవన్ కల్యాణ్ కి ఇంత క్రేజా! పంకజ్ త్రిపాఠీ కామెంట్ వైరల్

సినిమాలు, రాజకీయాలతో బిజీబిజీగా ఉన్న పవన్ కల్యాణ్ పై మీర్జాపూర్ ఫేమ్ పంకజ్ త్రిపాఠీ చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. పవన్ కల్యాణ్ ఇపుడు 3 సినిమాలు చేస్తున్నారు.


పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినీహీరోగా ఎంత ఫేమసో రాజకీయంగాను అంతే. ఆయన సినిమాలంటే చెవి కోసుకునే వారు చాలామందే ఉన్నారు. పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుల్లో ఆయన ఒకరు. ఇప్పుడాయన హ్యాష్‌ట్యాగ్‌ ఒకటి సామాజికమాధ్యమం ఎక్స్ లో వైరల్ అయింది. ఆయన సినిమాలకు సంబంధించిన కొన్ని వార్తలు షేర్ కావడం, బాలీవుడ్‌ నటుడు పంకజ్ త్రిపాఠీ ఆయన్ను ఆకాశానికి ఎత్తేలా మెచ్చుకోవడమే దీనికి కారణం. సినీ, రాజకీయ ప్రముఖులనేక మంది పవన్ కల్యాణ్ కి వీరాభిమానులు. రాజకీయంగా విమర్శలు చేసే వారు సైతం పవన్ కల్యాణ్ నటనను మెచ్చుకుంటామంటూ అనేక సందర్భాలలో కామెంట్లు పెట్టిన వారున్నారు.

తాజాగా ‘మీర్జాపూర్‌’ నటుడు పంకజ్‌ త్రిపాఠి పవన్‌పై ప్రశంసలు కురిపించారు. ‘పవన్‌ గొప్ప నటుడు. బాగా చదువుతారు. దూరదృష్టి ఉన్న వ్యక్తి. కొందరు డైరెక్టర్లు కూడా నాకు ఈ సంగతి చెప్పారు. అందుకే ఆయనకు అన్ని భాషల్లో అభిమానులు ఉన్నారు ’ అని పంకజ్ త్రిపాఠీ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన చేసిన ఈ కామెంట్లు ఇప్పుడు వైరల్ అయ్యాయి.

దీంతో పాటు పవన్ కల్యాణ్‌ సినిమాకు సంబంధించిన మరో వార్త ఎక్స్‌లో వైరల్‌ అవుతోంది. సుజీత్‌ దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్). ఈ సినిమాకు తమిళ హీరో శింబు పాట ఒక పాట కూడా పాడారు. పవన్‌ కెరీర్‌లోనే అది అతి పెద్ద పాట అంటున్నారు. మరోపక్క ‘హరిహర వీరమల్లు’ సినిమా శరవేగంగా నడుస్తోంది. జనసేన రాష్ట్ర కార్యాలయం ఉన్న మంగళగిరి ప్రాంతంలో ఈ సినిమా కోసం ఓ సెట్ కూడా వేశారు. అక్కడే షూటింగ్ చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్‌ కల్యాణ్‌ ఓ పాట పాడనున్నారు. ఈ పాట ఎలా ఉండనుందనే దానిపై పవన్ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కల్యాణ్ ఇటీవలి తిరుపతి వివాదంలో ప్రాయశ్చిత దీక్ష చేశారు. సనాతన ధర్మ పరిరక్షణే తన ధ్యేయం అంటూ తిరుపతి లో వారాహి డిక్లరేషన్ ప్రకటించి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యారు. మరోపక్క పవన్‌ సినిమాల్లోనూ బిజీబిజీగా ఉన్నట్టు సమాచారం. ‘ఓజీ’, ‘హరిహర వీరమల్లు’, ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సినిమాలలో ఆయన నటిస్తున్నారు. ఎన్నికల కారణంగా ఆ సినిమాల షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో పంకజ్ త్రిపాఠీ చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి.


Read More
Next Story