సమాచారం అందుకున్న రైల్వే అధికారులు అప్రమత్త మయ్యారు. రైళ్ల రాకపోకలను నిలిపి వేయడంతో ప్రమాదం తప్పింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఓ పెద్ద రైలు ప్రమాదం తప్పింది. భారీ లగేజీతో వెళ్తున్న ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. సమాచారం అందుకున్న అధికారులు అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటు చేసుకుంది. అల్లూరి జిల్లాలోని అనంతగిరి మండలం బొర్రా గుహల సమీపంలో కొత్తవలస కిరండూల్ రైల్వే ట్రాక్‌పై కొండచరియలు విరిగి పడ్డాయి. అదే సమయంలో ఓ గూడ్స్ రైలు ఆ మార్గం గుండా ప్రయాణిస్తోంది. రైల్వే ట్రాక్‌పై కొండచరియలు విరిగి పడటం, గూడ్స్ రైలు దాని మీద ప్రయాణిస్తుండటంతో ఆ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే అధికారులు స్పందించారు. ఒక్క సారిగా తేరుకొని అధికారులు అప్రమత్తమయ్యారు. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు రంగంలోకి దిగిన రైల్వే అధికారులు ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను నిలిపి వేశారు. దీంతో పెద్ద పెను ప్రమాదం తప్పింది. రైళ్ల రాకపోకలను ఆపక పోయి ఉంటే భారీ ప్రమాదం జరిగి ఉండేది. దెబ్బతిన్న రైలు ట్రాక్‌లను యుద్ధ ప్రాతిపదికన పునరుద్దరించేందుకు రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు.