విజయనగరం జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించేందుకు ఇది వరకే నోటిఫికేషన్‌ జారీ చేశారు.


ఉత్తరాంధ్ర స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు నిలచిపోనున్నాయి. విజయజనగరం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఇది వరకే నోటిఫికేషన్‌ కూడా జారీ చేసింది. అందువల్లే ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు చేపట్టిన ఉత్తరాంధ్ర టూర్‌లో విజయనగరం పర్యటనను రద్దు చేసుకున్నారు. అయితే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ఏంటా ట్విస్ట్‌ అంటే.. ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై మండలి చైర్మన్‌ మోషన్‌రాజు వేసిన అనర్హత వేటును హైకోర్టు రద్దు చేసింది. దీంతో రఘురాజే ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు. తనపై మండలి చైర్మన్‌ మోషన్‌ రాజు అనర్హత వేటు వేయడంతో ఇందుకూరి రఘురాజు హెకోర్టును ఆశ్రయించారు. దీనిపై బుధవారం విచారణ చేపట్టిన హైకోర్టు రుఘురాజుకు అనుకూలంగా తీర్పును వెలువరించింది. చైర్మన్‌ మోషన్‌రాజు వేసిన అనర్హత వేటును కొట్టేసింది. ఈ నేపథ్యంలో 2027 నవంబరు 31 వరకు ఎమ్మెల్సీగా ఇందుçకూరి రఘురాజు కొనసాగనున్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు నిలచిపోనున్నాయి.

Next Story