కాకినాడు వైపు కదులున్న మొంథా తుఫాన్...
x

కాకినాడు వైపు కదులున్న మొంథా తుఫాన్...

గంటలకు 16 కిమీ వేగంతో దూసుకువస్తున్నది...


మొంథా తుపాను కాకినాడ వైపు దూసుకొస్తున్నది. ఈ వార్త రాస్తున్నప్పటికి గంటకు 16 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లు సమాచారం. మరికొద్దిసేపట్లో తీవ్ర తుపానుగా రూపాంతరం చెందుతుందని వాతావరణశాఖ అంచనా వేస్తున్నది. నేటి సాయంత్రం లేదా రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటనుంది. దాదాపు 18 గంటల పాటు మొంథా ప్రభావం ఉంటుంది. కోస్తా జిల్లాల్లో అత్యంత భారీ, భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ హెచ్చరించింది. ఇదే విధంగా రాయలసీమ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఉదయం ఆరుగంటల సమయం లో వచ్చిన హెచ్చరిక

ఈ గడిచిన 6 గంటల్లో గంటకు 16 కి.మీ మొంథా వేగంతో కదిలింది.

విశాఖ, విజయనగరం, ప్రకాశం, నెల్లూరు,రాయలసీమ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్‌ జారీ చేశారు.

ప్రస్తుతానికి మచిలీపట్నంకి 230కి.మీ, కాకినాడకి 310కి.మీ విశాఖపట్నంకి 370కి.మీ,దూరంలో కేంద్రీకృతం

మరికాసేపట్లో తీవ్రతుపానుగా బలపడే అవకాశం

రాత్రికి మచిలీపట్నం-కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం

రేపు కోస్తా జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం

తీరం వెంబడి గంటకు 90-110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు

శ్రీకాకుళం, విజయనగరం,విశాఖ, అనకాపల్లి, నెల్లూరు, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు

95 ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు రికార్డు

ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ కమిషన్ ప్రఖర్ జైన్ విజ్ఞప్తి చేశారు.



* శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ నంబర్ 08942-240557

• అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేసిన జిల్లా అధికారులు

* విశాఖకు దక్షిణంగా 370 కి.మీ. దూరంలో, కాగినాడుకు 310 కి.మీ దూరాన, మచిలీపట్నంకు దక్షిణ ఆగ్నేయంగా 230 కి.మీ దూరాన తుపాను కేంద్రీకృతం అయింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 110 కి.మీ. వేగంతో గాలులువీ స్తాయి. జిల్లాలో మొంథా తుపాను ప్రభావం ఎక్కువగా ఉండేలా ఉంది. విశాఖలో రాత్రి నుంచి తీవ్ర జల్లులతో వర్షం మొదలయింది.

• తుపాను నేపథ్యంలో ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు అయ్యాయి . విశాఖకు వచ్చే 16 రైళ్లు రద్దు చేశారు. అవసరమైతే తప్ప ప్రజలెవ్వరూ బయటకు రావొద్దని అధికారుల అనౌన్స్ చేస్తున్నారు. విద్యుత్ స్తంభాల వద్ద ఉండొద్దని ఈపీడీసీఎల్ హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచనలు చేశారు.మరొక వైపు తుపాను సహాయ చర్యల కోసం తూర్పునౌకాదళం సన్నద్ధమయింది.నౌకాదళం వద్ద హెలికాప్టర్లు, సరకు రవాణా విమానాలు సిద్ధం చేశారు. డీప్ డైవర్స్, రెస్క్యూ బృందాలకు సిబ్బందిని కూడా సమాయత్తం చేశారు.

* రాయలసీమలోని అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్‌ జారీ చేశారు.

• దాదాపు 18 గంటలపాటు ప్రభావం చూపనుంది.

* తుపాను ప్రభావంతో కోస్తా జిల్లాల్లో అతిభారీ వర్షాలు

• తుపాను దృష్ట్యా ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారుల హెచ్చరిక చేశారు.

• కమ్యూనికేషన్ కోసం జిల్లాలకు 16 శాటిలైట్ ఫోన్లు పంపిణీ చేశారు.

• కమ్యూనికేషన్ కోసం జిల్లాలకు 35 డీఎంఆర్ సెట్లు పంపిణీ చేశారు.

• సహాయ చర్యలకు 11 ఎన్డీఆర్‌ఎఫ్‌, 12 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సిద్ధం చేశారు.

పునరావాస కేంద్రాలకు బాధితులు తరలింపు

* కాకినాడ జిల్లావ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షం. పునరావాస కేంద్రాలకు తుఫాన్ బాధితులు తరలించేందుకు ఏర్పాట్లు. ఉప్పాడ తీరంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. అలలుఎగిసిపడుతున్నాయి. ఇకపోతే,చ కోనసీమ జిల్లాలో అర్థరాత్రి నుంచి వర్షం కురుస్తూ ఉంది. మొంథా తుపాను ప్రభావంతో కోనసీమ జిల్లావ్యాప్తంగా వర్షం కరుస్తూ ఉంది. సముద్ర తీరప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

విజయవాడ పరిస్థితి

విజయవాడలో 16 సెం.మీ వర్షపాతానికి పైగా నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించారుఅత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచన. తీవ్రత ఎక్కువ ఉంటే దుకాణాలు, వాణిజ్య సంస్థలు మూసివేయాలని విజ్ఞప్తిచేశారు. మెడికల్‌షాపులు, పాలదుకాణాలు, కూరగాయల దుకాణాలను మినహాయించారు. ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్, వీఎంసీ ప్రధాన కార్యాలయాల్లో ఫోన్ నంబర్: 9154970454

వీఎంసీ కంట్రోల్‌రూమ్‌ నంబర్లు: 0866 2424172‬, 0866 ౨౪౨౨౫౧౫, 0866 2427485‬

ఇతర కంట్రోల్‌ రూమ్‌ నంబర్లు

• నెల్లూరు కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ నం. 0861 2331261, 7995576699

• కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ నం.76010 02776

• నెల్లూరు ఆర్డీవో కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ నం.98499 04061

• ఆత్మకూరు ఆర్డీవో కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ నం.9100948215

• కావలి ఆర్డీవో కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ నం.77022 67559

Read More
Next Story