భర్త మద్యానికి బానిస కావడంతో విసిగి వేసారిన భార్య బలవన్మరణానికి పాల్పడింది. ఇద్దరు చిన్నారులు అనాధలుగా మారారు.
ఇద్దరు ప్రేమ వివాహాం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు పుట్టారు. తన ఇద్దరు బిడ్డలు పసి పిల్లలు కావడంతో తల్లి వారిని ఆడించేందుకు, నిద్రపుచ్చేందుకు ఇంట్లో ఉయాల్యను కట్టింది. ప్రతి రోజు అందులోనే తన ఇద్దరు చిన్నారులను వేసి జోల పాడుతూ నిద్రపుచ్చేది. దానిలో పడుకున్న ఆ చిన్నారులు అమ్మ జోల పాటు వింటూ మయమరిచి పోయేవారు. హాయిగా నిద్ర పోయేవారు. కానీ తన చిన్నారులను నిద్రపుచ్చడం కోసం కట్టిన ఉయ్యాలే తనకు ఉరితాడుగా మారుతుందని ఆ తల్లి తన కలలో కూడా ఊహించి ఉండదు. కానీ అదే నిజమైంది. పసిబిడ్డల కోసం కట్టిన ఉయ్యాలతోనే ఆ తల్లి ఉరి వేసుకొని శాశ్వత నిద్రలోకి వెళ్లి పోయింది. దీంతో అభం శుభం తెలియని ఆ పసి బిడ్డలు అనాధలుగా మారారు. తల్లి బలవన్మరణంతో వారి భవిష్యత్తు అంధకారంగా మారింది. ఈ దుర్ఘటన స్థానికులను సైతం కన్నీటి పర్యంతమయ్యాలే చేసింది.
కాకినాడ జిల్లా మండలం రామవరం గ్రామానికి చెందిన కొట్టేడు స్వాతికి కాకినాడకు చెందిన తలాటం సురేష్‌తో 2017లో వివాహం అయ్యింది. ప్రేమించుకుకొని మరీ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. భర్త సురేష్ కార్ ట్రావెల్స్‌లో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. భార్య స్వాతి గృహిణి. పెళ్లైన కొత్తల్లో స్వాతితో సురేష్‌ల సంసారం సవ్యంగానే సాగింది. స్వాతితో కూడా సురేష్ సఖ్యతగానే మెలిగేవాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాబుకు నాలుగేళ్లు, పాపకు ఎనిమిది నెలలు. అయితే భర్త సురేష్ క్రమంగా మద్యానికి అలవాటు పట్టాడు. మద్యం తాగొద్దని భర్త సురేష్‌ను భార్య స్వాతి వారించేది. అయినా సురేష్ తన భార్య స్వాతి మాటలు వినేవాడు కాదు. అయినా తన భర్త సురేష్‌ను మార్చుకునేందుకు భార్య స్వాతి ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఈ అలవాటు పెరిగి పోవడంతో సురేష్ మద్యానికి బానిసగా మారిపోయాడు. ఈ నేపథ్యంలో భార్య, భర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. పూర్తిగా మద్యానికి బానిసగా మారిపోయిన సురేష్ తన కుటుంబాన్ని పట్టించుకోవడం మానేశాడు. నిద్యం మద్యం మత్తులో తూలుతూనే ఉండేవాడు. దీంతో సురేష్ మద్యం వ్యవహారంతో స్వాతి విసిగి పోయింది. సురేష్ తాగుడు పట్ల, కుటుంబాన్ని పట్టించుకోకపోవడం పట్ల స్వాతి తీవ్ర అసంతృప్తిగా ఉండేది.
ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త నిత్యం తాగుతూ తూలుతు ఉండటాన్ని చూసి తట్టుకోలేని భార్య స్వాతి తన భర్త సురేష్ తాగుడు వ్యవహారాన్ని తన కుటుంబ సభ్యులతో చెప్పుకొని బోరుమనేది. భర్త సురేష్ తన ఫ్రెండ్స్ వల్లే తాగుబోతుగా మారిపోయాడని తన తల్లిదండ్రుల వద్ద చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకునేది. కుమార్తె బాధలు విన్న తల్లిదండ్రలు స్వాతిని సముదాయించేవారు. పిల్లలు ఉన్నారు కాబట్టి సురేష్ తప్పకుండా మారుతాడులే అని స్వాతిని ఓదార్చే వారు. అయితే స్వాతికి తన భర్త సురేష్ వ్యవహారంలో ఏ మాత్రం మార్పు కనిపించలేదు. తాగుడును తగ్గించ లేదు.
ఈ క్రమంలో ఆదివారం అర్థరాత్రి పూటుగా మద్య తాగి ఇంటికెళ్లిన సురేష్, భార్యా పిల్లలు పడుకున్న గదిలోకి వెళ్లాడు. అప్పటి వరకు భర్త కోసం మేలుకొని, భర్త సురేష్ రాకను గమనించిన భార్య స్వాతి తీవ్ర మనే వేదనకు లోనైంది. తన భర్త తాగుబోతుగా మారిన నేపథ్యంలో తన కుటుంబం భవిష్యత్తు గురించి ఒక్క సారిగా మానసిక ఆందోళనకు గురైంది. ఇంతేనా జీవితం అంటూ భర్త సురేష్‌ను ప్రశ్నించింది. ఈ క్రమంలో స్వాతి, సురేష్‌లు గొడవపడ్డారు. నిత్యం తాగుతూ ఉంటే పిల్లల పరిస్థితి ఏంటని బార్య స్వాతి భర్త సరేష్‌ను ప్రశ్నించింది. వీటని తలకెక్కించుకోలేని స్థితిలో మద్యం మత్తులో తూలుతున్న భర్త సురేష్, భార్య స్వాతి మీద తిరగబడ్డాడు. దీంతో స్వాతికి జీవితం మీద విరక్తి కలిగింది. సోమవారం తెల్లవారు జామున దాదాపు మూడు గంటల సమయంలో పిల్లల కోసం కట్టిన ఉయ్యాల తాడుతో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. భర్త తాగుబోతు వ్యవహారం వల్ల అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తన పసి పిల్లలకు శాశ్వతంగా దూరమైంది. స్వాతి సోదరుడు నగేష్ ఫిర్యాదతో కాకినాడ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరో వైపు అదేదో చాలా మంచి పని చేసినట్లు నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తెచ్చామని కూటమి ప్రభుత్వం గర్వంగా ప్రకటించుకుంటోంది. ధరలు కూడా అందుబాటులోకి తెచ్చామని బాకా ఊదుకుంటోంది. అయితే అదే మద్యానికి ఎంతో మంది బానిసలుగా మారుతున్నారు. ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. రోడ్డున పడుతున్నాయి. పిల్లలు అనాధలుగా మారి పోతున్నారు. దీనికి సురేష్, స్వాతిల ఉదంతమే నిదర్శనం.
Next Story