పిఠాపురం పాలిటిక్స్‌లోకి ముద్రగడ ఎంట్రీ
x
Source: Twitter

పిఠాపురం పాలిటిక్స్‌లోకి ముద్రగడ ఎంట్రీ

పిఠాపురం పాలిటిక్స్‌లోకి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఎంట్రీ ఇచ్చారు. వైసీపీ తరపున ప్రచారం ఎలా చేయాలన్న అంశాలపై నేతలకు కీలక సూచనలు చేశారు.


జనసేనాని పవన్ కల్యాణ్, వంగా గీత.. పిఠాపురం సీటు కోసం తలపడనున్నారు. ఇద్దరూ కాపు నేతలే కావడంతో ఆంధ్ర ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం కీలకంగా మారింది. అయితే తాజాగా అక్కడి పాలిటిక్స్‌లోకి మరో కాపు నేత, కాపు ఉద్యమకారుడు ముద్రగడ పద్మనాభం ఎంట్రీ ఇచ్చారు. ఈ నియోజకవర్గంలో వైసీపీ గెలుపు ఖరారు చేసేలా ప్రచార వ్యూహాలను రచించడంలో ఆయన కీలక పాత్ర పోషించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఈరోజు యూ కొత్తపల్లి మండలం కాపు నేతలతో సమావేశమయ్యారు. కీర్లంపూడిలోని తన నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ఎన్నికల్లో తమ ప్రచారా శైలి ఎలా ఉండాలన్న అంశంపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇందులో భాగంగానే సభలు, సమావేశాలు ఎలా జరగాలి, ప్రచారాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అన్న అంశాలపై నేతలకు సూచనలు ఇచ్చారు. అనంతరం గ్రామ స్థాయి సభలు కూడా నిర్వహించాలని, అందులో వైసీపీ అందిస్తున్న పథకాలను వివరించాలని చెప్పారు.

‘‘వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మరోసారి గెలిపించుకోవాలి. అందుకోసం పార్టీ కార్యకర్తలందరూ శక్తివంచన లేకుండా శ్రమించాలి. ఈ ఎన్నికలను మీ ఎన్నికలే అనుకుని ప్రచారం చేయాలి. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అహర్నిశలు కృషి చేయాలి. వైసీపీ గెలుపుకోసం నావంతు కృషి నేను చేస్తా మీరు కూడా మీ వంతు కృషి చేయండి’’అని కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు ముద్రగడ పద్మనాభం. దీంతో పిఠాపురం ఎన్నికల పోరు మరింత ప్రాముఖ్యత సంతరించకుంది. ఒక్క పవన్‌ కల్యాణ్ ఓడించడానికి వైసీపీ ఇంతమంది ఉద్దండులను బరిలోకి దించాలా అని కొందరు పెదవి విరుస్తున్నారు. ఇదిలా ఉంటే శనివారం పిఠాపురంలో వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని అధికారులు అడ్డుకున్నారు. అనుమతులు లేకుండా ప్రచారం చేస్తున్నారంటూ ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్.. వంగా గీత ప్రచారాన్ని నిలిపివేశారు. అనంతం వంగా గీత అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Read More
Next Story