Nara Bhuvaneswari

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు జైల్లో ఉండగా రాజకీయ ప్రవేశం చేసిన నారా భువనేశ్వరి ఇక ముందుకెళ్లే యోచనలో ఉన్నట్లుంది...ఎన్నికల్లో కూడా పోటీ చేస్తారా!


టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు జైల్లో ఉండగా రాజకీయ తెరపైకి అడుగు పెట్టిన నారా భువనేశ్వరి ఆంధ్ర ప్రజల మద్దతుతో దూసుకుపోతున్నారు. చంద్రబాబు జైలు నుంచి విడుదల య్యారు కాబట్టి ఆమె రాజకీయాలు మాని గృహిణిగా ఉపసంహరించుకుంటారనుకున్నారు. అయితే, అలా జగరడం లేదు. చంద్రబాబు జైలు ఉన్నపుడు కొన్ని ర్యాలీలలో పాల్గొనడం, జనంలో కలవడం, కార్యకర్తలతో మాట్లాడటంతో ఆమె రాజకీయాలు ఒంట పట్టించుకున్నారు. ఇపుడు యాక్టివ్ అయి పోయారు. చంద్రబాబు నాయుడు ఒక సైడు నుంచి, కుమారుడు నారాలోకేష్ ఇటు సైడు నుంచి ప్రచారం చేస్తుంటే, భువనేశ్వరి అటుసైడు రాయలసీమనుంచి నరుక్కొస్తున్నారు. చంద్రబాబు నాయుడు భార్య కూడా క్యాంపెయిన్ చేస్తున్నారని జనంలో కూడా ఆమెను చూడాలనే ఆసక్తి పెరిగింది. ఇలాంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ కి కొత్త.

2019 ఎన్నికల ముందు ఇలాంటి కుటుంబమంతా ప్రచారం చేయడం జగన్ పార్టీలో ఉంది. ఆయన జైలు నుంచి వచ్చే దాకా, చెల్లెలు షర్మిల, తల్లి విజయమ్మ కథనడిపారు. ఇపుడు అక్కడ సీన్ రివర్సయింది. తల్లి జగన్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. చెల్లి కాంగ్రెస్ లో చేరారు. ఆమె ఇపుడు ఏకంగా ఆంధ్రాలో అన్నకు వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేస్తారని చెబుతున్నారు.

ఇపుడు తెలుగుదేశం ఫస్గు ఫామిలీలో ఎనలేని రాజకీయ ఉత్సాహం కనిపిస్తూ ఉంది.

తెలుగుదేశం పార్టీని ముందుండి నడిపించే బాధ్యత భర్త జైల్లో ఉండగా తీసుకున్న భువనేశ్వరి భర్త బయటకు వచ్చిన తరువాత కూడా తన ఆలోచనలకు పదును పెడుతూ మరోవైపు నుంచి నరుక్కుంటూ వస్తున్నారు. చంద్రబాబు జైలుకు వెళ్లారనే వార్త విని తట్టుకోలేక మృతి చెందిన కుటుంబాలను పరామర్శించే కార్యక్రమాన్ని ఆమె చేపట్టారు.



‘నిజం గెలవాలి’ కార్యక్రమం పేరుతో ఆమె ప్రజల మధ్యకు వచ్చారు. భర్త తప్పు చేయకపోయినా రాజకీయాలకు దూరం చేయాలనే దురాలోచనతో వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌ తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించారని నిజం గెలవాలి సభల్లో అధికార పక్షాన్ని భువనేశ్వరి ఎండగట్టారు. బాధిత కుటుంబాలకు భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు. ఉత్తరాంధ్ర పర్యటన పూర్తయింది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించి ఆ కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు.

రాయలసీమలోని కర్నూలు జిల్లాలో మృతి చెందిన కుటుంబాలను మంగళవారం పరామర్శించారు. నేడు ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరం మండలంలోని మాచవరం గ్రామంలో హనుమంతు కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.




చంద్రబాబు అరెస్ట్‌ను జీర్ణించుకోలేక 2023 అక్టోబరు 24న హనుమంతు గుండెపోటుతో చనిపోయారు. బాధిత కుటంబానికి మూడు లక్షల ఆర్థిక సాయాన్ని భువనేశ్వరి అందించారు. మరో నాలుగు కుటుంబాల వారిని పరామర్శిస్తారు. చంద్రబాబు నాయుడు ‘రా కదలిరా’ పేరుతో సభలు నిర్వహిస్తున్నారు. బుధవారం విజయనగరం జిల్లా బొబ్బిలిలో జరిగే సభలో పాల్గొంటారు.


Next Story