రాయదుర్గం చిన్నారులతో బర్త్ డే జరుపుకున్న చంద్రబాబు
x

రాయదుర్గం చిన్నారులతో బర్త్ డే జరుపుకున్న చంద్రబాబు

చంద్రబాబు నాయుడు 74 వ సంవత్సరంలో ప్రవేశించారు. అయినా సరే ఆయన పార్టీని మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు అహోరాత్రాలు శ్రమిస్తున్నారు...


టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు తన 74వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజవకర్గం, కనేకల్లులో చంద్రబాబు నాయుడు చిన్నారులతో కలిసి పుట్టిన రోజు జరుపుకున్నారు. అక్కడ కేక్ కట్ చేశారు. వేద పండితులు, పాస్టర్లు, ముస్లిం మత పెద్దలు చంద్రబాబుకు ఆశీర్వచనాలు అందజేశారు.

చంద్రబాబు పుట్టినరోజు ఏప్రిల్ 20 (1950) ను పురస్కరించుకుని ఆయన నియోజకవర్గం కుప్పంలోని టీడీపీ శ్రేణులు ఘనంగా సంబరాలు చేశారు. వీటిలో భాగంగా చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి కుప్పంలో కేక్ కట్ చేశారు. పార్టీ నేతలకు కేక్ తినిపించారు. మీలాంటి ప్రియతమ అభిమానుల సహకారం టీడీపీ ఎన్నటికీ ఉండాలని వారితో అన్నారు. ప్రజల కోసం టీడీపీ చేస్తున్న యుద్ధంలో మీరు కీలకంగా వ్యవహరించాలని పార్టీ కార్యకర్తలు, శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, చంద్రబాబు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రత్యేక పూజలు చేయించిన భువనేశ్వరి

చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని సామగుట్టపల్లె దగ్గర ఉన్న కదరిబంద నరసింహస్వామి ఆలయంలో నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టీడీపీ కార్యాలయంలో మైనారిటీ మహిళలతో కలిసి చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఇదిలా ఉంటే అనంతపురం జిల్లాలోని కణేకల్‌లో విద్యార్థులు, పార్టీ నాయకుల మధ్య చంద్రబాబు కేక్ కట్ చేసి పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు.

750 టెంకాయలు కొట్టారు

చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా పార్టీ నేతలు భారీగా సంబరాలు చేసుకున్నారు. మరికొందరు నేతలు ప్రత్యేక పూజలు చేయించి కొబ్బరి కాయలు కొట్టారు. వారిలో రాయలసీమ టీడీపీ నేత శ్రీధర్.. ఏకంగా 750 కొబ్బరి కాయలు కొట్టారు. చంద్రబాబు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దేవుడిని కోరుకున్నట్లు ఆయన చెప్పారు. అంతేకాకుండా 7.50 కిలోల కర్పూరం కూడా వెలిగించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రాష్ట్రమంతా సంబరాలు

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పుట్టినరోజు వేడుకలకు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో అక్కడి పార్టీ శ్రేణులు, నేతలు ఘనంగా నిర్వహిస్తున్నారు. చంద్రబాబు పూర్తి ఆరోగ్యంగా ఉండాలని ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు. కొన్ని ఊర్లలో అన్నదానం చేసేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

Read More
Next Story