
రాష్ట్రపతి ద్రౌపదీముర్ము నుంచ అవార్డు అందుకుంటున్న సర్పంచ్ రఘు
Best Panchayat Awards | కొత్త ఆలోచనలకు రెక్కలు తొడిగిన జాతీయ అవార్డు
జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డు అందుకున్న ప్రతినిధుల మాటలు ఇవి. సర్పంచ్ తో పాటు వెళ్లిన అధికారులు ఏమంటున్నారంటే..
జాతీయ అవార్డు అందుకోవడం మరపురాని అనుభూతి ఇచ్చింది. అంతకంటే ముందు బాధ్యతలను గుర్తు చేసిందని సర్పంచులు వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు మాకు ఉన్న ఆలోచనలు ఓ రకంగా ఉన్నాయి. కానీ,
"అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి గ్రామాలు, అక్కడి ప్రజలు సాధికారిత సాధించాలి" అనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాటలు మమ్మలను మరింత ఉత్తేజం చేశాయని సర్పంచులు అన్నారు. అంతేకాదు. స్థానికంగా వనరుల అభివృద్ధి చేసుకునే దిశగా మా ఊహలకు పునాది వేశారని కూడా అంటున్నారు.
దేశంలోని 45 గ్రామపంచాయతీలు జాతీయ అవార్డులకు ఎంపిక అయిన విషయం తెలిసిందే. అందులో రాష్ట్రం నుంచి నాలుగు పంచాయతీలు ఆ జాబితాలో ఉన్నాయి. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో బుధవారం మధ్యాహ్నం ఉత్తమ గ్రామపంచాయతీలుగా ఎంపికైన సర్పంచులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసా పత్రాలతో పాటు, అవార్డును ప్రధానం చేశారు. అదే సమయంలో ఆ పంచాయతీల ఖాతాలకు కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ నుంచి కోటి రూపాయల నగదు రివార్డును జమ చేశారు. అవార్డుల ప్రధానం అనంతరం బటన్ నొక్కడం ద్వారా రాష్ట్రపతి ఆ నిధులను పంచాయతీలకు విడుదల చేశారు.
రాష్ట్రం నుంచి నాలుగు పంచాయతీలు ఎంపికైన విషయం తెలిసిందే. వివిధ విభాగాల్లో మెరుగైన పనితీరు, వసతుల కల్పనతో శ్రద్ధ తీసుకున్నాయి. ప్రజాసేవలో అనుసరించిన ఆ పద్ధతులే కాకుండా, అభివృద్ధి ప్రామాణికంగా తీసుకొని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డులకు ఎంపిక చేసింది. అందులో..
1. మాతా శిశు మరణాల నివారణ. రక్తహీనత లేకుండా కాపాడడంలో అందించిన సేవలతో ఆరోగ్య విభాగంలో చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం బొమ్మసముద్రం పంచాయతీ.
2. 100% మంచినీటి సదుపాయాన్ని కల్పించిన అనకాపల్లి జిల్లా న్యాయంపూడి పంచాయతీ
3. 100% వ్యర్ధాలతో ఏటా 72 టన్నుల ఎరువు తయారీలో మేటిగా నిలిచిన అనకాపల్లి జిల్లా తగరంపూడి పంచాయతీ
4. సామాజిక భద్రత కల్పించడంలో కృష్ణాజిల్లా ముప్పాళ్ళ పంచాయతీ
ఈ పంచాయతీల సర్పంచులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులో ప్రధానం చేశారు
"మారుమూల పల్లె నుంచి ఢిల్లీ రాష్ట్రపతి భవన్ లో పాదం మోపుతామని కలలో కూడా ఊహించలేదు" అని చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం లోని ఐరాల మండలం బొమ్మసముద్రం దళిత సర్పంచ్ వి. రఘు వ్యాఖ్యానించారు. ఈయన సారథ్యంలో వెళ్లిన అధికారుల బృందం 'ఫెడరల్ ఆంధ్ర ప్రదేశ్' ప్రతినిధితో ఢిల్లీ నుంచి ఫోన్ చేసి మాట్లాడారు.
మా పంచాయతీ అవార్డుకు ఎంపిక అయిందనే సమాచారం అందిన తర్వాత అధికారులతో పాటు గ్రామ ప్రజలు కూడా సంబరపడ్డారని చెప్పారు. మా పంచాయతీ, మండల పరిషత్ అధికారులతో కలిసి రాష్ట్రపతి భవన్లోకి అడుగుపెట్టడం జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకం గా మిగిలిపోతుందని చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపదిముర్ము నుంచి అవార్డు అందుకున్న సందర్భం వస్తుందని ఊహించలేదు అన్నారు.
కేంద్ర ప్రభుత్వం అందించే కోటి రూపాయల నిధులతో ఎలాంటి పనులు చేపట్టాలని విషయం పై మాకు ఓ ప్రణాళిక ఉందని సర్పంచ్ రఘు చెప్పారు. అయితే, రాష్ట్రపతి ముర్ము చెప్పిన మాటల్లో
"స్వావలంబన, సమర్థత గల స్థానిక పంచాయతీల వల్ల మాత్రమే అభివృద్ధి చెందిన భారతదేశానికి పునాది పడుతుంది. దీనికి పంచాయితీలు సొంత ఆదాయ వనరులను అభివృద్ధి చేసుకోవాలి. తద్వారా స్వయం సమృద్ధి సాధించడానికి ప్రయత్నించాలి. ఈ సందర్భం మన గ్రామ సభలకు ఆత్మస్థైర్యాన్ని దేశానికి బలాన్ని అందిస్తుంది" అనే సందేశం మా ఆలోచనలకు కొత్త ఊహలు తొడిగేలా చేసిందని సర్పంచ్ రఘుతో పాటు బొమ్మసముద్రం గ్రామ సచివాలయ కార్యదర్శి వై మౌనిక వ్యాఖ్యానించారు.
"మా పంచాయతీకి మాత్రమే కాదు. జిల్లాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాం" అని చిత్తూరు నుంచి వెళ్లిన పంచాయితీ అధికారులు చెప్పారు. రాష్ట్రపతి ఇచ్చిన సందేశం గ్రామీణ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆలోచనలకు ప్రేరణగా ఉన్నాయంటూ, ఆ మాటలు సహకారం చేసే దిశగా మరింత మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తామని చెబుతున్నారు.
మురిసిన మహిళా సర్పంచ్
జాతీయ ఉత్తమ అవార్డుకు ఎంపికైన పంచాయతీల్లో రాష్ట్రంలోని కృష్ణాజిల్లా కూడా చోటు దక్కించుకుంది. ఈ జిల్లాలోని చందర్లపాడు మండలం ముప్పాళ్ళ పంచాయతీ సామాజిక పింఛన్ల పంపిణీలో మేటిగా నిలిచింది. ఈ పంచాయతీలో అందించిన సేవలను గుర్తించిన కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ చందర్లపాడు సర్పంచ్ కుసుమరాజు వీరమ్మ, అధికారులు కూడా ఢిల్లీకి ఆహ్వానించింది. ఢిల్లీలో రాష్ట్రపతి ముర్ము నుంచి ఆమె అవార్డుతో పాటు జ్ఞాపికను కూడా స్వీకరించారు. ఈ పంచాయతీ కార్యదర్శి తోపాటు కొందరు జిల్లా అధికారులు కూడా వెళ్లారు.
Next Story